S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/17/2016 - 03:45

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న 150వ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోంది. వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. తమిళ సూపర్ హిట్ ‘కత్తి’చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు ‘కత్తిలాంటోడు’ అనే టైటిల్ పెడతారని ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టడం లేదని నిర్మాత రామ్‌చరణ్ తెలిపాడు.

07/17/2016 - 03:43

గీతా ఆర్ట్స్ పతాకంపై పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో అల్లు అరవింద్ రూపొందించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఆగస్టు 5న విడుదలకు సిద్ధమైంది. అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు.

07/17/2016 - 03:41

ఆనంద నంద, రేష్మి గౌతమ్, శివకృష్ణ ప్రధాన తారాగణంగా డి.దివాకర్ దర్శకత్వంలో వి సినీ స్టూడియోస్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘రాణిగారి బంగళా’. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు.

07/17/2016 - 03:39

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా నటించే నెక్స్ట్ సినిమా వచ్చే నెలలో సెట్స్‌పైకి వస్తుందని యూనిట్ తెలిపింది. ‘కడప కింగ్’ పేరుతో తెరకెక్కే ఈ సినిమాకు ముందు ఎస్.జె.సూర్య దర్శకుడిగా పూజా కార్యక్రమాలు చేశారు. ఆ తరువాత ఆయన మహేష్ సినిమా కోసం ఈ సినిమాను వదిలేశాడు. ఇక ఆయన స్థానంలో దర్శకుడు డాలి చేరాడు. ఈ సినిమా హీరోయిన్‌గా శ్రుతిహాసన్ నటిస్తుందని ఆమధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

07/17/2016 - 03:38

‘సరైనోడు’ విజయంతో మంచి ఫామ్‌లోకి వచ్చిన బోయపాటి శ్రీను ఇప్పుడు తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందే ఈ సినిమాకు మరోసారి పాత సెంటిమెంట్‌ను వర్కవుట్ చేసేలా ఉన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు శీను’తో ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులే కొట్టేశాడు. ఇక ఆ తరువాత చేసిన ‘స్పీడున్నోడు’ ప్లాప్‌ను మూటగట్టుకుంది.

07/17/2016 - 03:37

వసంత్ మూవీ క్రియేషన్స్ పతాకంపై దాసరి గంగాధర్ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందిస్తున్న చిత్రం ‘అంతం లేని కథ’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు దాసరి గంగాధర్ మాట్లాడుతూ, హీరోయిన్ ఓరియెంటెడ్ కథనంతో సాగే ఈ చిత్రంలో కథానాయిక ఎవరు అనేది త్వరలో తెలియజేస్తామని, సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా సినిమా రూపొందిస్తున్నామని తెలిపారు.

07/17/2016 - 03:35

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ క్రేజ్ మామూలుగా లేదు. ఆయన నటిస్తున్న సినిమాల రికార్డులను తానే దాటేస్తూ.. నిర్మాతలకు పంట పండిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘సుల్తాన్’ సినిమా 200 కోట్ల మార్కెట్‌ను వారంలో క్రాస్ చేసింది. ‘బాహుబలి’ తరువాత సల్మాన్ తన రికార్డును పదిలపరచుకున్నాడు. అయితే ఈ విషయంలో నిజంగా సల్మాన్ గ్రేట్ అని చెప్పాలి.

07/17/2016 - 03:33

‘జబర్దస్త్’ ఫేమ్ అనసూయ మరో సినిమాకి సన్నద్ధమవుతోంది. ఆ సినిమా సన్నాహాల్లో భాగంగానే ఇటీవల ఓ ఫొటోషూట్ కూడా చేయించుకున్నట్టు తెలుస్తోంది. అందులో అనసూయ మరింత ఆకర్షణీయంగా కన్పిస్తోంది. చిట్టిపొట్టి దుస్తులతో కుర్రాళ్ళని రెచ్చగొడుతోంది. ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘క్షణం’ చిత్రాల తర్వాత అనసూయకి హీరోయిన్‌గా బోలెడన్ని అవకాశాలొచ్చాయి.

07/17/2016 - 03:32

‘దండుపాళ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘దండుపాళ్యం-2’లో కథ, కథనాలు సరికొత్తగా వుంటాయని దర్శకుడు శ్రీనివాసరాజు తెలియజేస్తున్నారు. వెంకట్ మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధీ, రఘు ముఖర్జి, మకరంద్ దేశ్‌పాండే ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. కన్నడంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేస్తే, అదీ హిట్ అయింది.

07/17/2016 - 03:30

అంపశయ్య నవల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నవీన్ 1969లో రాసిన ఈ నవల ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఆ నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘క్యాంపస్ - అంపశయ్య’. దర్శకుడు ప్రభాకర్ జైని ప్రధాన పాత్రలో నటించడంతోపాటు చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్యాంకుమార్, పావని జంటగా నటించిన సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు.

Pages