S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/04/2016 - 00:02

రావంత్, పావని జంటగా కార్తికేయ ప్రొడక్షన్స్ పతాకంపై ధనుంజయ్ దర్శకత్వంలో పల్లా రమణయాదవ్ రూపొందిస్తున్న చిత్రం ‘నా హృదయం ఊగిసలాడే’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, చీరాల పరిసర ప్రాంతాల్లో షూటింగ్ అంతా పూర్తిచేశామని, సంగీతం హైలెట్‌గా నిలిచే పాటలన్నీ అందరికీ నచ్చుతాయని తెలిపారు.

04/03/2016 - 23:59

సూపర్ స్టార్ రజనీకాంత్, సంచలన దర్శకుడు శంకర్ కలయికలో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతూన్న రోబో 2.0 చిత్రం ఇటీవల ఢిల్లీలోని నెహ్రూ స్టేడియంలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకున్న విషయం తెలిసిందే. రజనీ, అక్షయ్‌కుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. మరో షెడ్యూల్‌ను మొరాకోలో చిత్రీకరించాలని అనుకున్నా, ఎండలు తీవ్రంగా ఉండడంతో ఈ షెడ్యూల్‌ని చెన్నయ్‌కి మార్చారు.

04/03/2016 - 23:57

కన్నడంలో విజయవంతమైన హారర్ చిత్రాన్ని తెలుగులో ‘లాస్ట్‌బస్’ పేరిట శ్రీ మంజునాథ మూవీ మేకర్స్ పతాకంపై అందిస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న ఈ చిత్రంలో అవినాష్ నరసింహ రాజు, మేఘశ్రీ భాగవతార్, ప్రకాష్ బేలవాడి ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

04/03/2016 - 23:56

నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రానికి జోరుగా సన్నాహాలు మొదలుపెట్టిన సంగతి
తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం పేరును ఉగాది రోజున ప్రకటిస్తారట.
అమరావతి నేపథ్యంలో గౌతమీపుత్ర శాతకర్ణి కథతో తెరకెక్కే ఈ చిత్రం కొత్త తరహాలో
ఉండాలని బాలయ్య భావిస్తున్నారట. నటీనటులను కూడా బాలీవుడ్ నుంచి దిగుమతి

04/03/2016 - 23:54

సాయిరోనక్, అతిథిసింగ్, ఐశ్వర్య ప్రధాన తారాగణంగా ఐ వింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుప్పెడంత ప్రేమ. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల సందర్భంగా వినోద్ మాట్లాడుతూ, ఫస్ట్‌లవ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రం ఫీల్‌గుడ్ మూవీగా ఉంటుందని, ఫస్ట్‌లుక్ టీజర్లకు మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు.

04/03/2016 - 23:53

‘పరిశ్రమకు వచ్చి దాదాపుగా పదేళ్లవుతోంది. ఎన్నో రకాల పాత్రలు చేసినా సరైన సంతృప్తి దొరకలేదు. నటిగా నన్ను నేను ఆవిష్కరించుకునే పాత్రలు రాలేదు. గ్లామర్‌కు పరిమితం అయిపోయా’ అని బాధపడుతోంది అందాల తార కాజల్. గుర్తింపు వచ్చింది కానీ మనస్సుకు నచ్చిన పాత్ర ఒకటి మాత్రం చేయలేకపోయానంటోంది. హాస్య ప్రధానంగా సాగే ఓ చిత్రంలో ఫుల్‌లెంగ్త్ కామెడీ రోల్ చేయాలని కాజల్ కోరికట.

04/02/2016 - 21:29

‘ఊపిరి’ చిత్రం ఆసక్తికరంగా, అసభ్యకరమైన సన్నివేశాలు లేకుండా, అర్ధవంతమైన విలువలతో ఆఖరిదాకా సాగింది. సినిమా అన్నతర్వాత వినోదమన్నా వుండాలి, విజ్ఞానమన్నా వుండాలి, సందేశమైనా వుండాలి. ఈ మూడు ఈ చిత్రంలో ఉన్నాయి. అందుకే మంచి సినిమాకు ఆదరణ వుంటుందని ఈ సినిమా నిరూపించింది’ అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు.

04/02/2016 - 21:27

విజయ్ కథానాయకుడుగా అట్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు, కలైపులి ఎస్.్ధను అందిస్తున్న చిత్రం పోలీసోడు. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి.

04/02/2016 - 21:26

ప్రస్తుతం ఉన్న సమాజంలో జీవన పోరాటానికి సమయం సరిపోవడం లేదు. అలాంటి పరిస్థితుల్లో కుటుంబాల్లోని అనుబంధాలకు ఇంకా సమయం ఎక్కడిది? ముఖ్యంగా పిల్లలకు నీతి కథలు బోధించడానికి అమ్మమ్మలు తాతయ్యలు ఉండరు.

04/02/2016 - 21:24

తెలుగు చిత్రాలలో కుర్రకారుకు కలల రాణిగా ఓ వెలుగు వెలిగిన
ఇలియానా ప్రస్తుతం సినిమాలు లేని స్థితిని ఎదుర్కొంటోంది. మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే బాలీవుడ్‌కి ఎగిరిపోయిన ఈ గోవా సుందరి అక్కడ సరైన అవకాశాలను తట్టుకోలేకపోయింది. ఇక లాభంలేదని మళ్లీ పాత గూటికే తిరిగొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తన

Pages