S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/07/2016 - 20:49

అందమైన ప్రేమకథలను మరింత అందంగా తెరకెక్కించే దర్శకుడు మణిరత్నం. తాజాగా ఆయన తెరెకెక్కిస్తున్న చిత్రం ‘కాట్రు వెళిఇదై’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలై అభిమానులనుండి మంచి స్పందన పొందుతోంది. అందమైన ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రంలో తమిళ హీరో కార్తీ, బాలీవుడ్ నటి అదితిరావు హైదరీ జంటగా నటించారు. ఈ చిత్రానికి మణిరత్నం ఫేవరేట్ సంగీత దర్శకుడు రెహమాన్ సంగీతం అందించారు.

07/06/2016 - 23:12

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ సెనే్సషన్ ‘కబాలి’. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ రంజిత్ తెరకెక్కించారు. కలైపులి ఎస్.్థను ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే నటించింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కబాలి చిత్రాన్ని ఈనెల 15న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాలవలన వాయిదా పడింది. అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ప్రకటించలేదు.

07/06/2016 - 23:11

సూర్య, ఆమలాపాల్, బిందుమాధవి ప్రధాన తారాగణంగా స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజాతో కలిసి 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హీరో సూర్య స్వయంగా రూపొందించిన చిత్రం ‘పసంగ-2’. ఈ చిత్రాన్ని తెలుగులో జూలకంటి మధుసూదన్ రెడ్డి సాయి మణికంఠా క్రియేషన్స్ పతాకంపై ‘మేము’గా అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ చిత్రం ఈనెల 8న విడుదలకు సిద్ధమైంది.

07/06/2016 - 23:10

‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు అవసరాల శ్రీనివాస్, తన మొదటి సినిమాతోనే దర్శకుడిగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత మళ్లీ చాలా కాలానికి ఆయన ‘జ్యో అచ్యుతానంద’ అనే మరో రొమాంటిక్ కామెడీతో మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. నారా రోహిత్, నాగశౌర్య హీరోలుగా వస్తున్న ఈ సినిమా శ్రీనివాస్ మార్క్ ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా మెప్పిస్తుందని సమాచారం.

07/06/2016 - 22:01

రవితేజ ఈ ఏడాది సగం పూర్తవుతున్నా కొత్త సినిమా మొదలెట్టనే లేదు. ‘బెంగాల్ టైగర్’ తర్వాత చక్రి సహా మరో డైరెక్టర్‌తో సినిమా ప్లానింగ్ జరిపినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. కొన్ని ప్రాజెక్టులు ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయాయి. అయితే ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందులో ఒకటి డైరెక్టర్ బాబి, మరో సినిమా రమేష్ వర్మ దర్శకత్వంలో ఉంటుందని అంటున్నారు.

07/06/2016 - 22:00

అల్లు అర్జున్, డైరెక్టర్ హరీష్ శంకర్‌ల కాంబినేషన్‌లో త్వరలోనే ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్ళేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ‘సరైనోడు’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత చాలా ఆలోచించి బన్నీ తన క్రేజ్‌ను మరింత పెంచే సినిమాతో రావాలని దర్శకుడు హరీష్ శంకర్ పేరును తెరపైకి తెచ్చారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతిహాసన్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.

07/06/2016 - 21:59

‘తీన్‌మార్’, ‘ఒంగోలు గిత్త’, ‘బ్రూస్‌లీ’ తదితర పెద్ద సినిమాల్లో నటించినా హీరోయిన్‌గా సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయిన కృతి కర్బందా, తాజాగా హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ‘రాజ్ రీ బూట్’ సినిమాతో సిద్ధమవుతోంది. బాలీవుడ్‌లో సూపర్‌హిట్ ‘రాజ్’ సిరీస్‌లో నాలుగో సినిమాగా వస్తోన్న ‘రాజ్ రీ బూట్’కు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ సినిమాలో కృతి ఓ దెయ్యం పాత్రలో కనిపించనుందని సమాచారం.

07/06/2016 - 21:58

అదును చూసి చదును చేయడం అంటే ఇదేనేమో. చేతిలో సినిమాలు లేనప్పుడు ఎలాంటి పాత్రలో అయినా నటిస్తా.. గ్లామర్‌కు సై అంటూ చెప్పిన హీరోయినే్ల.. కాస్త స్టార్‌డమ్ వచ్చాక.. అబ్బో ఇలా చేయను, అలా చేయను, ఇలాంటి కండిషన్స్ అయితేనే చేస్తాననడం మామూలే. ఇప్పుడు అలాంటి కడిషనే్స పెడుతోంది గ్లామర్ భామ నయనతార. ఇప్పటికే సీనియర్ హీరోయిన్స్ లిస్టులో చేరిన ఈ అమ్మడు యువ హీరోల సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది.

07/06/2016 - 21:56

ప్రభుదేవ, తమన్నా జంటగా ఎం.వి.వి. సినిమా పతాకంపై విజయ్ దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ రూపొందిస్తున్న చిత్రం ‘అభినేత్రి’. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. సినిమాకు సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఆగస్టు 15న విజయవాడలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీదేవి హాజరుకానున్నారు.

07/06/2016 - 21:55

తమిళంలో విజయవంతమైన ‘మెట్రో’ చిత్రాన్ని తెలుగులో అనువదిస్తున్నారు. నిర్మాత రామ్ తాళ్ళూరి ఎస్.ఆర్.టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హక్కులను పొందారు. కన్నతల్లి చావుకు కారణమైన చైన్ స్నాచర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించిన జర్నలిస్టు తెలుసుకున్న నిజాలేంటి అన్న కథనంతో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట సంచలన విజయాన్ని పొందిందని నిర్మాత తెలిపారు.

Pages