S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/30/2016 - 21:09

ముంబైలో జరిగిన ఓ మ్యాగజైన్ తాజాసంచిక విడుదల కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ భామ కంగనారనౌత్ ఆహూతులను ఆకట్టుకున్నారు. ప్రఖ్యాత డిజైనర్ సల్వటోర్ ఫెర్రిగమొ రూపొందించిన నల్లని దుస్తుల్లో ఆమె మిలమిల మెరిసిపోయింది.

06/30/2016 - 21:07

కామెడీ చిత్రాల హీరో అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ‘సెల్ఫీ రాజా’ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తికానుంది. ఈ సినిమా తర్వాత నరేష్ నటించే తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని జాహ్నవి ఫిలిమ్స్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నాడు.

06/30/2016 - 21:05

రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధ్రువ’ సినిమా కొద్దిరోజులుగా కాశ్మీర్‌లో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్’కు రీమేక్ అయిన ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక కాశ్మీర్ షెడ్యూల్‌లో ఒక పాటను, కొన్ని కీలక సన్నివేశాలను పూర్తిచేసిన టీమ్, నిన్నటితో షెడ్యూల్ మొత్తాన్నీ పూర్తిచేసి తిరుగు ప్రయాణమైంది.

06/30/2016 - 21:04

నారా రోహిత్, నమితాప్రమోద్ జంటగా మహేష్ సూరపనేని దర్శకత్వంలో కార్తిక శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం ‘కలలో రాజకుమారి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, పరిణితి చెందిన రెండు జంటల మధ్య జరిగే భావోద్వేగాలతో కూడుకున్న ప్రేమకథా చిత్రం ఇదని అన్నారు.

06/30/2016 - 21:02

ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమా తరువాత ఆయన నటించే సినిమాకు ‘కల్యాణం’ అనే టైటిల్ ఓకే అయింది. ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతున్న సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇందులో హీరోయిన్‌గా సమంత నటిస్తోంది.

06/30/2016 - 21:00

దాదాపు 28 సంవత్సరాల తరువాత మళ్లీ సాయిబాబా పాత్రలో నటిస్తున్నానని, ఇది తనకెంతో ఆనందాన్నిస్తోందని సినీనటుడు విజయ్‌చందర్ అన్నారు. విజయ్‌చందర్ సాయిబాబాగా నటిస్తున్న చిత్రం ‘సాయే దైవం’. శ్రీ మల్లాది వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై శ్రీనివాస్ జి.ఎల్.బి. దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

06/30/2016 - 20:59

ఆది కథానాయకుడుగా శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై వీరభద్రం దర్శకత్వంలో రామ్ తాళ్లూరి, వెంకట్ తలారి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలైంది. నిర్మాతలు మాట్లాడుతూ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ‘చుట్టాలబ్బాయి’ టీజర్‌ను యూ ట్యూబ్‌లో విడుదల చేశామని, 24 గంటల్లోనే 1.5 లక్షల వ్యూస్ సాధించిందని అన్నారు.

06/30/2016 - 20:57

అల్లరి నరేష్ కథానాయకుడుగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇంట్లో దయ్యం.. నాకేం భయం’. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను నిర్మాత తెలియజేశారు. జూన్ 23నుండి శరవేగంగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చేస్తున్నామని, దర్శకుడు ఈ సినిమా కథ చెప్పగానే కచ్చితంగా విజయవంతవౌతుందన్న నమ్మకం కుదరడంతో ప్రారంభించామని తెలిపారు.

06/30/2016 - 21:14

మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా పరిచయవౌతూ తెరకెక్కిన ‘రేయ్’ చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయమైంది పంజాబీ భామ సయామీఖేర్. మొదటి చిత్రంతోనే గ్లామర్ ప్రదర్శనలో సంచలనం క్రియేట్ చేసిన ఈమెకు ఆ సినిమా కమర్షియల్‌గా కెరీర్‌కు బ్రేక్ ఇవ్వలేకపోయింది. దాంతో దక్షిణాదిలో అవకాశాలు రాలేదు. ఇక్కడ లాభం లేదనుకుని బాలీవుడ్‌కు చెక్కేసింది.

06/30/2016 - 20:53

బాలీవుడ్‌లో రెండు దశాబ్దాల కాలంగా తనదైన గ్లామర్, బికినీలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది హాట్‌భామ బిపాసా. తను నటించిన ఏ సినిమా చూసినా బికినీలో కనిపించడం కామనే. అలాంటి బికిని, ఎక్స్‌పోజింగ్‌తోనే క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ ఇటీవలే.. హీరో కరణ్‌సింగ్ గ్రోవర్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత సినిమాలు మానేస్తుందని అనుకున్నారు అందరూ.. కానీ ఇప్పుడు బిపాసా రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది.

Pages