S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/29/2016 - 22:45

తెలుగులో ‘ముకుంద’, ‘ఒక లైలాకోసం’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ పూజాహెగ్డే. ఆ సినిమాల తర్వాత దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగులో మంచి అవకాశాలు వస్తున్న సమయంలో బాలీవుడ్‌లో వచ్చిన క్రేజీ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ప్రముఖ నటుడు హృతిక్‌రోషన్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న ‘మొహెంజోదారో’ చిత్రంలో నటిస్తోంది.

06/29/2016 - 22:43

‘బ్రహ్మోత్సవం’ డిజాస్టర్ తర్వాత మహేష్‌బాబు తన తదుపరి చిత్రానికి జోరుగా సన్నాహాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రం వచ్చేనెల 15న సెట్స్‌పైకి రానుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఇండియన్ న్యాయ వ్యవస్థపై పోరాటంగా ఉంటుందని తెలిసింది.

06/29/2016 - 22:41

భాగ్యనగర వాసులకు కనువిందు చేయడానికి యూరోపియన్ యూనియన్ (ఇయూ) సభ్య దేశాల ఆధ్వర్యంలో ఫిలిమ్ ఫెస్టివల్ జూలై 1నుండి జరగనుంది. ఈ ఫిలిమ్ ఫెస్టివల్‌లో 23 అవార్డు పొందిన సినిమాలను ప్రదర్శించనున్నారు.

06/29/2016 - 22:40

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకకోసం సింగపూర్ సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే దక్షిణ భారత సినీరంగానికి చెందిన ప్రముఖులు తరలివెళ్లారు. అవార్డుల వేడుక వైభవంగా సింగపూర్‌లో జరగనుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు దక్షిణాది తారలు భారీగా వెళ్తున్నారు. మరోవైపు ఈ వేడుకలకు సంబంధించిన రిహార్సల్స్‌లో పలువురు ప్రముఖ నటీమణులు పాల్గొంటున్నారు.

06/29/2016 - 22:15

ప్రముఖ నటుడు చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న 150వ చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ ‘కత్తి’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోంది. ఇందులో చిరంజీవి రెండు పాత్రల్లో కనిపిస్తాడు. ఒక పాత్రకు సంబంధించిన జైలు సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సన్నివేశానికి సంబంధించిన ఫొటో మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

06/29/2016 - 22:13

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన ‘అ ఆ’ సినిమా సంచలన విజయం సాధించి, మంచి కమర్షియల్ విజయాన్ని అందించింది హీరో నితిన్‌కి. ఈ సినిమాతో 50 కోట్ల క్లబ్‌లో చేరిపోయారు నితిన్. ఫీల్‌గుడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా తర్వాత నితిన్‌కు అవకాశాల వెల్లువ ప్రారంభమైంది. ఈ విజయంతో జోరుమీదున్న నితిన్ స్పీడ్ పెంచినట్టు తెలుస్తోంది.

06/29/2016 - 22:12

దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న మారుతి మరోవైపు తన సొంత బ్యానర్‌లో చిన్న సినిమాల నిర్మాణాన్ని చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన కథతో తెరకెక్కిన చిత్రం ‘రోజులుమారాయి’.

06/29/2016 - 21:42

పాండురంగ క్రియేషన్స్ పతాకంపై పవన్‌కుమార్ కథానాయకుడుగా రాజ్ బి.కుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం హంతకుడు (హీ ఈజ్ నాట్ ఎ కిల్లర్). ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది.

06/29/2016 - 21:41

ప్రముఖ నటుడు ఉపేంద్ర హీరోగా శ్రీనివాసరాజు దర్శకత్వంలో ‘శివం’ పేరుతో కన్నడంలో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రాన్ని ‘బ్రాహ్మణ’ పేరుతో విజి చరిష్ విజన్స్ మరియు శ్రీ తారకరామా పిక్చర్స్ పతాకాలపై విజయ్ ఎం, గుర్రం మహేష్‌చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ వున్న నటుడు ఉపేంద్ర.

06/29/2016 - 21:39

బాధ్యత లేని వాడికి భారతదేశంలో బ్రతికే హక్కు లేదు అనే కానె్సప్ట్‌తో దర్శకుడు భానుశంకర్ చౌదరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘అర్ధనారి’. నూతన నటీనటులతో పత్తికొండ సినిమాస్
పతాకంపై రవికుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 1న విడుదల అవుతున్న సందర్భంగా దర్శకుడు భానుశంకర్ చౌదరితో ఇంటర్వ్యూ..

Pages