S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/28/2016 - 21:08

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ షూటింగ్ జరుపుకుంటోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత ఆయన 101వ చిత్రం గురించి అనంతపురంలో ప్రకటించారు. హిందూపురం ఎమ్మెల్యేగా వున్న బాలకృష్ణ అక్కడి రైతులకు రుణ ఉపశమన పత్రాల పంపిణీలో భాగంగా తాను తన 101వ చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుంతుందని, ఈ చిత్రానికి ‘రైతు’ అనే పేరు వుంటుందని చెప్పారు.

06/28/2016 - 21:06

ప్రముఖ దర్శకుడు రాజవౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం సంచలన విజయం సాధించింది. 600 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ఈ చిత్రం ఇప్పుడు చైనాలో విడుదలకు సిద్ధమైంది. జూలై 22న 6500 స్క్రీన్‌లలో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇప్పటిదాకా ఏ భారతీయ సినిమా చైనాలో ఈ స్థాయిలో విడుదల కాలేదు. ఇప్పటికే సినిమాలోని ప్రధాన తారాగణం చైనాలో పర్యటించారు.

06/28/2016 - 21:05

ఫెయిర్ అండ్ లవ్‌లీ కమర్షియల్ యాడ్‌తో బాగా పాపులర్ అయిన యామీ గౌతమ్ ఆ తర్వాత దక్షిణాదిలో హీరోయిన్‌గా ప్రవేశించింది. ఆమె చేసిన రెండు సినిమాలు ప్లాప్ అవడంతో బాలీవుడ్‌కు షిఫ్ట్ అయింది. అక్కడ చేసిన సినిమాలకంటే కూడా ప్రేమాయణాలు సాగించి, సంచలనం సృష్టించిన ఈ భామకు ఇప్పుడు ఓ క్రేజీ అవకాశం దక్కింది. ప్రముఖ నటుడు హృతిక్‌రోషన్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. యామీ కెరీర్‌లో ఇదే భారీ సినిమా.

06/28/2016 - 21:02

నాగశౌర్య, నిహారిక జంటగా మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీ్ధర్ నిర్మించిన ‘ఒక మనసు’ ప్రస్తుతం టాక్‌తో రన్‌అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మధుర శ్రీ్ధర్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ, ‘ఈ సినిమా కొందరికి బాగా నచ్చింది. హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీ అని చెబుతున్నారు. కొందరు మాత్రం స్లోగా వుందని అంటున్నారు. అందుకని 14 నిమిషాల నిడివి తగ్గించాం.

06/28/2016 - 21:00

నవీన్, మమతా కులకర్ణి, ఆరోహి, ఐశ్వర్య ముఖ్యపాత్రల్లో కాటా ప్రసాద్ దర్శకత్వంలో ప్రవీణ క్రియేషన్స్ పతాకంపై నందం రామారావు నిర్మిస్తున్న బ్యాంకాక్‌లో ఏం జరిగింది? చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ క్లాప్‌నివ్వగా, టిఆర్‌ఎస్ పార్టీ ఇన్‌ఛార్జి మురళీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

06/28/2016 - 20:58

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు యువ హీరో రాజ్‌తరుణ్. ఉయ్యాల జంపాల, కుమారి 21ఎఫ్, సినిమా చూపిస్తమావ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాల్ని అందుకున్న రాజ్‌తరుణ్‌కి లేటెస్ట్‌గా ఈడోరకం ఆడోరకం సినిమా మంచి విజయాన్ని అందించింది. దర్శకుడు మారుతి నిర్మాతగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌తో కలిసి నిర్మిస్తున్న సినిమా నేడు సెట్స్‌పైకి వచ్చింది.

06/28/2016 - 20:56

ప్రవీణ్, వంశీ, రమేష్, శ్రావణి, గాయత్రి, నాగినీడు ముఖ్యపాత్రల్లో డి. శ్రీనివాస్ దర్శకత్వంలో ది విజన్ పతాకంపై యాగ్ణిక పీఠం సమర్పణలో రూపొందిన దిగ్బంధన చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న అహోబిలం రామానుజ చిన జీయర్‌స్వామి సీడీలను విడుదల చేశాక మాట్లాడుతూ, ‘యువత దశ దిశ ఏమిటో తెలిపే విధంగా ఈ చిత్రం రూపొందింది.

06/28/2016 - 20:55

ప్రముఖ నటుడు చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న 150వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ కత్తి చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

06/28/2016 - 20:53

సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ కాజల్‌కు ఈమధ్య చేసిన సినిమాలు వరుసగా పరాజయం పాలవడంతో కాస్త నిరాశలో ఉన్నట్టుంది. పవన్‌కళ్యాణ్‌తో చేసిన సర్దార్ గబ్బర్‌సింగ్, మహేష్‌బాబుతో నటించిన బ్రహ్మోత్సవం పల్టీ కొట్టాయి. హిందీలో ఎన్నో ఆశలు పెట్టుకున్న దో లఫ్జోంకీ కహాని సినిమా కూడా తీవ్ర నిరాశను మిగిల్చింది.

06/26/2016 - 21:43

బిచ్చగాడు చిత్రంతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన విజయ్ ఆంటోని నటిస్తున్న తాజా చిత్రం ‘సైతాన్’. ఎన్‌ఎన్‌ఎన్ క్రియేషన్స్ పతాకంపై తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు రైట్స్‌ను ఎస్.వేణుగోపాల్ చేజిక్కించుకున్నారు.

Pages