S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/25/2016 - 21:14

సాయిధరమ్ తేజ్, లారిస్సా బొనేసి జంటగా శ్రీ వెంకటేశ్వరా మూవీ మేకర్స్ బ్యానర్‌పై సునీల్‌రెడ్డి దర్శకత్వంలో సి.రోహిన్‌కుమార్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘తిక్క’. ఈ సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ శనివారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, ‘దర్శకుడు సునీల్‌కు తన టాలెంట్ ఏంటో నిరూపించుకోవాలన్న తిక్క ఉంది. సాయిధరమ్ తేజ్ ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టాడు.

06/25/2016 - 21:08

‘రోజులు మారాయి’ రెండు జంటల ప్రేమ కథతో సాగుతుంది. సోషల్ మీడియావల్ల యువతలో ఎలాంటి మార్పు వచ్చిందనే అంశంతో ఈ సినిమా సాగుతుందని నిర్మాత దిల్‌రాజు తెలిపారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో జి.శ్రీనివాసరావు రూపొందించిన ‘రోజులు మారాయి’ జూలై 1న విడుదలకు సిద్ధమైంది.

06/25/2016 - 21:04

ఆది హీరోగా శ్రీఐశ్వర్య లక్ష్మి మూవీస్ పతాకంపై రామ్ తాళ్ళూరి సమర్పణలో వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి నిర్మిస్తున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’. దీని టీజర్‌ను శనివారం హైద్రాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో ఆది మాట్లాడుతూ,‘కన్ఫ్యూజన్ కామెడీ జోనర్‌లో ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి ఎంటర్‌టైనింగ్‌గా రూపొందించాం. వీరబాబు చక్కగా డైరెక్ట్‌చేశారు.

06/25/2016 - 21:02

సర్వేశ్వరా మూవీస్ పతాకంపై జొన్నలగడ్డ శివ దర్శకత్వంలో గుద్దేటి బసవప్ప రూపొందిస్తున్న చిత్రం ‘పోలీస్ పవర్’. శివ, నందిని కపూర్, ధరణి ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది.

06/25/2016 - 21:00

వరుస విజయాలతో దూసుకుపోతున్న అల్లు అర్జున్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రొడ్యూసర్ దిల్‌రాజు త్వరలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తారు. ఏడు సంవత్సరాల తరువాత అల్లు అర్జున్, దిల్‌రాజు కాంబినేషన్‌లో రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో ప్రారంభం అవుతుంది.

,
06/24/2016 - 21:32

స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరుగుతున్న 17వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) అవార్డుల ప్రదానోత్సవం సంరంభం మొదలైంది. బాలీవుడ్‌కు చెందిన 150మంది ప్రముఖులు హాజరైన ఈ వేడుకకు స్పెయిన్‌కు చెందిన సినీ,వ్యాపారరంగ ప్రముఖులూ తోడయ్యారు. గురువారం లాంఛనంగా మొదలైన ఐఫా వేడుకలో తొలిరోజంతా సదస్సులు, చర్చాగోష్టులు జరిగాయి. శుక్రవారం ఫిక్కి-స్పెయిన్ చాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా పలు అంశాలపై చర్చించాయి.

06/24/2016 - 21:27

‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘ఊపిరి’ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తాజాగా నటిస్తున్న చిత్రానికి ‘ఓం నమో వెంకటేశాయ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కే ఈ భక్తిరస చిత్రం నేటి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.

06/24/2016 - 21:22

తెలుగులో కమర్షియల్ సినిమాలే వస్తాయి, ప్రయోగాలు చేయరు అనే అపవాదుని దూరంచేసే పనిలో పడ్డారు తెలుగు హీరోలు, దర్శకులు. ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. లేటెస్ట్‌గా ఓ సినిమాలో అంధుడి పాత్రలో నటించేందుకు రెడీ అయ్యాడు రామ్. అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కే ఈ సినిమాలో తాను అంధుడి పాత్ర పోషిస్తున్నానని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు అనిల్‌రావిపూడి.

06/24/2016 - 21:20

హీరో హీరోయిన్లుగా హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన సూర్య-జ్యోతిక కలిసి మళ్లీ నటించనున్నారు. 2006లో వచ్చిన ఓ తమిళ చిత్రం తరువాత వారు మళ్లీ కలిసి నటించలేదు. మళ్లీ దాదాపు పదేళ్ల తరువాత ఈ జోడీ తెరపై కనువిందు చేయనుంది. గత సంవత్సరం 30 వయదినిలె చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక, తాజాగా తన భర్త సూర్య రూపొందించనున్న చిత్రంలో నటించనుంది.

06/24/2016 - 21:02

మెగా వారసురాలు నిహారిక హీరోయన్‌గా పరిచయమవుతూ రూపొందిన ‘ఒక మనసు’ చిత్రం శుక్రవారం విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా అభిమానులతో కలిసి చిరంజీవి బ్లడ్ బ్యాంకులో విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిహారిక కేక్ కట్ చేసి అభిమానులను అలరించారు.

Pages