S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/19/2016 - 03:34

సినిమాలో నటించినంత మాత్రాన ఎవరు ఏది రాస్తే అది ఒప్పుకోవాల్సిందేనా? అనవసరంగా లేనిపోనివి అన్నీ రాసి ఇబ్బందిపెడుతున్నారంటూ మీడియాపై చిందులేస్తోంది అందాల నటి శిల్పాశెట్టి. ప్రస్తుతం సినిమాలు మానేసిన ఆమె అవకాశాలకోసం వెంపర్లాడుతోంది. తెలిసిన వాళ్లను కలిసి అవకాశాలు ఇమ్మని అడుగుతోందట.

06/19/2016 - 03:33

చేతిలో డబ్బుంటే ఏదైనా చేయచ్చు. మంచి పనీ చేయచ్చు. ఎవరికీ పనికిరాని పనీ చేయచ్చు. అలా ఈసారి చేతి నిండా డబ్బుండడంతో రకుల్‌ప్రీత్‌సింగ్ గ్యాంబ్లింగ్ ఆటకు సై అన్నదట. మన దేశంలో అయితే ఎక్కడపడితే అక్కడ అభిమానులు చుట్టేస్తారు కనుక రకుల్ ఈసారి లాస్‌వెగాస్ వెళ్లింది. ఆ పట్నం అంటేనే గ్యాంబ్లింగ్‌కు పెట్టింది పేరు. ఎన్నోసార్లు ఆ ఆట ఆడే ముచ్చటను వాయిదా వేసుకున్న రకుల్ ఈసారి నిజంగానే ఆటలో దిగేసింది.

06/19/2016 - 03:31

నాగచైతన్య, మంజిమా మోహన్ జంటగా ద్వాఠకా క్రియేషన్స్ పతాకంపై గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో రవీందర్‌రెడ్డి రూపొందించిన చిత్రం సాహసం శ్వాసగా సాగిపో. ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో బిగ్ సీడీని నాగార్జున, గోపీచంద్ విడుదల చేయగా, ఆడియో సీడీని ఎ.ఆర్.రహమాన్ ఆవిష్కరించారు. ట్రైలర్‌ను దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు.

06/19/2016 - 03:29

తమిళంలో జాక్సన్‌దొరైగా రూపొందిన చిత్రాన్ని తెలుగులో ‘దొర’ పేరుతో అందిస్తున్నారు. రత్నా సెల్యులాయిడ్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో సత్యరాజ్, అతని కుమారుడు శిబిరాజ్ నటించారు. బిందుమాధవి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని జక్కం జవహర్‌బాబు తెలుగులో అందిస్తున్నారు.

06/19/2016 - 03:28

పంచాక్షరి పిక్చర్స్ పతాకంపై విష్ణురెడ్డి, అభిరామ్, సంజన, అశోక్ ప్రధాన తారాగణంగా గౌతమ్‌నాయుడు దర్శకత్వంలో పద్మజనాయుడు రూపొందిస్తున్న చిత్రం త్రయం. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

06/18/2016 - 22:28

సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ ట్విట్టర్‌ను వేదికగా చేసుకొని పలు సంచలన కామెంట్లతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఇప్పటికే పలువురిపై కామెంట్లు చేసిన వర్మ తాజాగా, ఈమధ్యే రజనీకాంత్‌ని టార్గెట్ చేస్తూ ఆయన అభిమానులకు కోపం తెప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వర్మ రజనీని పొగుడుతూ చేసిన ట్విట్ అందరికీ షాక్ ఇస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ వంద ముద్దులకు అర్హుడని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

06/18/2016 - 22:27

‘సర్దార్ గబ్బర్‌సింగ్’ పరాజయం తరువాత వెంటనే సినిమాను మొదలుపెట్టాడు పవన్‌కళ్యాణ్. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ‘ఖుషి’ వంటి సంచలన చిత్రాన్ని అందించిన ఎస్.జె.సూర్య దర్శకత్వలో పవన్ నటిస్తున్న మూడో సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఒకటి మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

06/17/2016 - 21:40

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న జనతా గ్యారేజ్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈనెలాఖరు వరకు జరిగే షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని తెలిసింది. ఆ తర్వాత పాటల్ని చిత్రీకరించి, ఆగస్టు 12న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

06/17/2016 - 21:37

ఉపేంద్ర, సలోని, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో శ్రీనివాసరాజు దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన ‘శివం’ చిత్రాన్ని శ్రీ తారకరామా పిక్చర్స్ పతాకంపై బ్రాహ్మణ పేరుతో విడుదల చేస్తున్నారు. నిర్మాతలు విజయ్ ఎం, గుర్రం మహేష్‌చౌదరి. ఈ చిత్రంలోని ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ప్రముఖ నటుడు శ్రీకాంత్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

06/17/2016 - 21:35

ప్రముఖ నటుడు సూర్య హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సింగం-3’. తమిళంతోపాటు తెలుగులోను రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పాటల చిత్రీకరణ కూడా జరపనున్నారట. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ‘సింగం’, ‘సింగం-2’ చిత్రాలు ఘన విజయం సాధించడంతో వాటికి మించిన కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Pages