S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/24/2016 - 21:35

‘అందాల రాక్షసి’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమై యూత్ హార్ట్‌ని దోచుకున్న నవీన్ చంద్ర చేస్తున్న నూతన చిత్రానికి ‘చందమామ రావే’ అని టైటిల్ ఖరారు చేశారు. ‘అది రాదు.. వీడు మారడు’ అనే చక్కటి క్యాప్షన్‌ని ఇటీవలే ఎనౌన్సు చేశారు. టైటిల్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే క్యాప్షన్‌కి హ్యూజ్ రెస్పాన్స్ రావటంతో చిత్ర యూనిట్ ఆనందంగా వున్నారు.

05/24/2016 - 21:34

నాగచైతన్య కథానాయకుడిగా గౌతమ్ వాసుదేవమీనన్ దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. ఈ చిత్రానికి సంబంధించిన పాటల మేకింగ్ వీడియోను ఇటీవల విడుదల చేశారు. మూడో పాటగా ఇప్పుడు చెకోరిని 26న సోషల్ మీడియాలో దర్శకుడు విడుదల చేయనున్నారు. అదేరోజు నాగచైతన్య, కోనవెంకట్ ట్విట్టర్‌లో విడుదల చేస్తారు.

05/24/2016 - 21:28

సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా శ్రీ సత్యా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మనూ దర్శకత్వంలో జె.వంశీకృష్ణ రూపొందించిన చిత్రం ‘రైట్ రైట్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కథానాయకుడు సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ, తాను ఇప్పటివరకూ చేసిన పాత్రల్లో ఈ పాత్ర భిన్నంగా వుంటుందని, చాలా నేచురల్‌గా వుంటుందని అన్నారు.

05/24/2016 - 21:25

ఇటీవలే ‘దో లఫ్జోంకి కహాని’ అనే సినిమాలో రణదీప్ హుడాతో ఘాటు లిప్‌లాక్ సన్నివేశంలో నటించి సంచలనం క్రియేట్ చేసిన కాజల్, ఆ సన్నివేశం తనకు తెలియకుండా జరిగిందని, దాన్ని ఖండిస్తున్నానని చాలా కథలే చెప్పింది. అయ్యో.. తను తెలియకున్నా సీన్‌ను అర్ధంచేసుకుంది పాపం అని అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు అసలు విషయం చెప్పి షాకిచ్చింది ఈ హాట్ భామ. ఇంతకి కాజల్ చెప్పిన విషయం ఏమిటో తెలుసా!

05/24/2016 - 21:23

సుప్రీమ్ చిత్రంతో మరో హిట్ కొట్టిన రాశిఖన్నా కెరీర్ జోరుమీదుంది. ఈ చిత్రం విజయంతో నటిగా, గ్లామర్ డాల్‌గా మరింత లైమ్‌లైట్‌లోకొచ్చింది. బెల్లం శ్రీదేవిగా ఆమె నటనకు మార్కులు పడుతున్నాయి. అయితే ఇటీవల ఆమెపై పలు కామెంట్స్ వస్తున్న విషయంపై నోరు మెదపడం లేదు రాశిఖన్నా.

05/22/2016 - 21:43

చిన్నితెరపై సంచలనం సృష్టించిన ‘బాలికావధు’ (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‌లో నటించి దేశమంతటా ప్రేక్షకుల మనసుదోచిన నటి అవికాగోర్ తెలుగుప్రేక్షకులకూ పరిచితమే. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో టాలీవుడ్‌లో స్థానం సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఫ్రాన్స్‌లోని కేన్స్ నదీతీరంలో జరుగుతున్న చిత్రోత్సవంలో రెడ్‌కార్పెట్‌పై హొయలుపోయింది. మూడురోజులుగా జరుగుతున్న పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొంది.

05/22/2016 - 21:41

ఆనంద్ నందా, రేష్మి జంటగా వి సినీ స్టూడియో నిర్మాణంలో డి.దివాకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాణిగారి బంగళా’. ఈ చిత్రానికి సంబంధించిన తొలి కాపీ సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలుపుతూ- ఈ సినిమా కోసం అనేక పేర్లను పరిశీలించి చివరికి ఈ పేరైతేనే కథనానికి సరిపోతుందని తెలిపారు.

05/22/2016 - 21:39

నితిన్, సమంత జంటగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్యదేవర రాధాకృష్ణ రూపొందిస్తున్న చిత్రం ‘అ.. ఆ’ (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి). ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్ 2న విడుదలకు సిద్ధం చేశారు.

05/22/2016 - 21:38

ధన్‌రాజ్, దీక్షాపంత్ జంటగా ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై నెల్లుట్ల ప్రవీణ్‌చందర్ దర్శకత్వంలో కళ్యాణి, రామ్, తేజ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘బంతిపూల జానకి’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.

05/22/2016 - 21:36

బాలీవుడ్ తార శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రాల తనయుడు వియాన్ పుట్టినరోజు వేడుకలు ముంబైలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు ఐశ్వర్యారాయ్ తన కుమార్తె ఆరాధ్యతోను, జెనీలియా, రితీష్ దేశ్‌ముఖ్‌లు తమ రెండేళ్ల తనయుడు రియాన్‌తోను, మాధవన్, సరితాబ్రిజె దంపతులు తమ కుమారుడు వేదాంత్‌తోను కలసి హాజరయ్యారు.

Pages