S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/13/2016 - 02:58

తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న అందాల భామ కాజల్‌కు ఇప్పుడు అవకాశాలు కూడా క్యూ కట్టాయి. తెలుగులో స్టార్ హీరోల సరసన నటిస్తున్న ఈమెకు తాజాగా తమిళంలో క్రేజీ అవకాశం దక్కింది. ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. శింబు హీరోగా నటించే ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజలే ఎంపికైందట.

03/13/2016 - 02:58

జీవా, హన్సిక జంటగా రామ్‌ప్రకాష్ రాయప్ప దర్శకత్వంలో సాయిగీతా ఆర్ట్స్ పతాకంపై మలిరెడ్డి వీరవెంకట సత్యనారాయణ, హనీప్రమోద్, శ్రీనులు నిర్మిస్తున్న చిత్రం ‘పోకిరి రాజా’. ‘్ఫన్ ఆఫ్ విండ్’ ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుందన్నారు.

03/13/2016 - 02:56

‘పందెం కోడి’ సినిమా తర్వాత విశాల్ కెరీర్‌లో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవనే చెప్పాలి. తమిళంలో మంచి క్రేజ్ తెచ్చుకున్నా తెలుగులో మాత్రం ఇంకా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాడు. సొంతంగా విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ బ్యానర్‌ను స్థాపించి, విభిన్నమైన కథనాలతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. లేటెస్ట్‌గా విడుదలైన ‘కథకళి’ చిత్రం తమిళంలో మంచి హిట్‌ను నమోదు చేసుకుంది. ఈనెల 18న ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది.

03/13/2016 - 02:56

కార్తీక్, కశ్మీరా కులకర్ణి జంటగా బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై శివనాగేంద్రప్రసాద్ నిర్మించిన చిత్రం ‘దృశ్యకావ్యం’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 18న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు రామకృష్ణారెడ్డి చెప్పిన విశేషాలు.. ఆయన మాటల్లోనే..

03/13/2016 - 02:55

చైనా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో భారతదేశంనుండి పాల్గొన్న ఆదిత్య చిత్రానికి అవార్డు లభించింది. చైనా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికై ఉత్తమ బాలల చిత్రంగా అవార్డు అందుకున్న ఆదిత్య (క్రియేటివ్ జీనియస్) చిత్రాన్ని సంతోష్ ఫిలింస్ పతాకంపై భీమగాని సుధాకర్‌గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.

03/13/2016 - 02:53

* చిత్ర నిర్మాణానికి సన్నాహాలు
* ముందుకొచ్చిన ముగ్గురు యువకులు

03/13/2016 - 02:52

శివాజీ, నమ్రత, నిశాదేశ్ ప్రధాన పాత్రల్లో ఇషాక్ దర్శకత్వంలో లక్ష్మీ వేంకటేశ్వర ఫిలింస్ పతాకంపై జగదీష్ నిర్మించిన చిత్రం ‘సీసా’.

03/13/2016 - 02:52

తన ఆరోగ్యం బాగానే ఉందని సుప్రసిద్ధ యాంకర్ సుమ చెప్పారు. గొంతు సంబంధిత సమస్యతో తాను మూడు నెలల విశ్రాంతి తీసుకోనున్నట్లు వచ్చిన వార్తలు చూసి అభిమానులు ఆందోళన చెందారని, అయితే తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, ఎప్పటిలా షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని ఆమె స్పష్టం చేశారు.

03/13/2016 - 02:51

తనదైన స్టైల్‌తో సినిమాలు రూపొందిస్తూ టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు పూరి జగన్నాధ్. ఇటీవలే ‘లోఫర్’ చిత్రాన్ని రూపొందించిన ఆయన ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో ‘రోగ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తరువాత పూరి హిందీలో ఓ చిత్రం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. హిందీలో ప్రముఖ నటుడు సంజయ్‌దత్ హీరోగా ఈ చిత్రం ఉంటుందని తెలిసింది.

03/13/2016 - 02:50

శ్రీలంకనుండి వచ్చిన జాక్విలిన్ ఫెర్నాండెజ్ ముంబైకి నక్కతోక తొక్కి వచ్చిందని బాలీవుడ్ సినీ పండితులు చెబుతున్నారు. ఏకంగా సల్మాన్‌ఖాన్‌తోనే ‘కిక్’ చిత్రంలో నటించాక జాక్విలిన్‌కు స్టార్ తిరిగింది. ప్రతి విషయాన్ని స్టైల్‌గా ఆచరించి చూపించే జాక్విలిన్ ముంబైలో హల్‌చల్ చేస్తోంది. ఉదయానే్న నిద్రలేచిన దగ్గర్నుంచి తాను ఎక్కడికివెళితే అక్కడే ఫొటోలు తీసి అందరికీ చేరేలా చేస్తోంది.

Pages