S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/14/2016 - 21:35

గ్లామర్ భామ అనుష్క ప్రస్తుతం ‘బాహుబలి-2’, ‘సింగం-3’ చిత్రాల్లో నటిస్తోంది. దానితోపాటు భాగమతి అనే చిత్రం కూడా చేస్తోంది. ప్రస్తుతం అనుష్క సన్యాసినిగా ఓ సినిమా కోసం మారనున్నదట. నాగార్జున కథానాయకుడిగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో అనుష్క సన్యాసినిగా నటించనుందని సమాచారం. ఇందులో మరో ఇద్దరు హీరోయిన్లు కూడా వున్నారు.

06/14/2016 - 21:34

ప్రిన్స్, వ్యోమానంది జంటగా శ్రీ చైత్రా చలనచిత్ర పతాకంపై వాణి ఎం.కొసరాజు దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘మరల తెలుపనా ప్రియా’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శకురాలు మాట్లాడుతూ- ఓ విభిన్నమైన ప్రేమకథతో వైవిధ్యమైన మనస్తత్వాలు వున్న అమ్మాయి, అబ్బాయిమధ్య సాగే యుద్ధంగా ఈ ప్రేమకథ సాగుతుందని తెలిపారు.

06/14/2016 - 21:32

‘రెండక్షరాలు’ చిత్రం అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోందని, రెండు జంటలమీద సాగే ఈ చిత్రం సందేశాత్మకంగా వుంటుందని నిర్మాత పైలా దేవదాస్‌రెడ్డి తెలిపారు. శ్రీ కంచమ్మతల్లి సినీ ప్రొడక్షన్స్ పతాకంపై లోకేష్‌రెడ్డి, అక్షర జంటగా శ్రీనివాసరావు.ఎం. దర్శకత్వంలో ఆయన రూపొందించిన రెండక్షరాలు గత వారం విడుదలైన సంగతి తెలిసిందే.

06/12/2016 - 21:06

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘ధ్రువ’ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూళ్లను పూర్తిచేసుకుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్’ చిత్రానికి రీమేక్. మైండ్ గేమ్‌తో సాగే ఈ సినిమాలో చరణ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తారు. ఇందులో హీరోయిన్‌గా రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తోంది.

06/12/2016 - 21:04

తెలుగు చిత్రసీమలో మహానటులున్నా వారికి పద్మశ్రీవంటి పురస్కారాలు రాకపోవడం తెలుగువారి దౌర్భాగ్యమని, ప్రతిభను గుర్తించని ప్రభుత్వాలు రికమెండేషన్లను గుర్తించి ముక్కూముఖం తెలియనివారికి ఆ పురస్కారాన్ని ప్రకటిస్తున్నాయని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి చర్యలవల్ల ఆ పురస్కారం చిన్నబోతోందని అన్నారు.

,
06/12/2016 - 21:02

నాని, సురభి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జెంటిల్‌మన్’. శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణప్రసాద్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..
కథ నచ్చింది

06/12/2016 - 20:58

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న భక్తిరస చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి ‘ఓం నమో వేంకటేశాయ’ టైటిల్‌ను నిర్ణయించారు. వేంకటేశ్వరస్వామి పరమభక్తుడైన హాథీరామ్‌బాబా జీవిత కథతో తెరకెక్కే ఈ చిత్రాన్ని మహేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా అనుష్క, ప్రజ్ఞాజైస్వాల్‌లు ఎంపికయ్యారు.

06/12/2016 - 20:56

బాలీవుడ్ హాట్ భామ దీపికాపదుకొనేకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. గ్లామర్‌తోపాటు నటనలో కూడా మంచి సత్తావున్న హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రేజీ అవకాశాలతో దూసుకుపోతున్న ఈ భామకు కమర్షియల్ యాడ్స్ విషయంలోనూ అంతే డిమాండ్ ఉంది. తాజాగా ఓ ప్రైవేట్ యాడ్‌కోసం దీపిక తీసుకునే రెమ్యునరేషన్ విని షాకయ్యారట వాళ్లు.

06/12/2016 - 20:55

రామ్, రాశీఖన్నా జంటగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర వివరాల గురించి నిర్మాతలు తెలియజేశారు.‘మొదటి షెడ్యూల్ పూర్తయింది. జూన్ 14నుండి 30వరకు వైజాగ్‌లో రెండో షెడ్యూల్‌ను జరపనున్నాం. రామ్, సంతోష్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘కందిరీగ’ చిత్రం సంచలన విజయం సాధించింది.

06/12/2016 - 20:53

‘బాయ్స్’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’,‘బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో తెలుగు హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సిద్ధార్థ్. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అవి తన కెరీర్‌కి సరైన సక్సెస్‌ను ఇవ్వలేకపోయాయి. దాంతోపాటు హిందీలో కూడా రెండు మూడు చిత్రాల్లో నటించిన సిద్ధార్థ్ కొంత గ్యాప్ తర్వాత మరో చిత్రంతో ముందుకు రానున్నాడు.

Pages