S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/10/2016 - 22:04

ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జనతాగ్యారేజ్’ సెట్‌లో ‘అఆ’ హీరో నితిన్ ప్రత్యక్షమయ్యాడు. గ్యారేజ్ చిత్రంకోసం ఎన్టీఆర్ చేస్తున్న డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేశానంటూ సామాజిక మాధ్యమంలో నితిన్ కామెంట్స్ పోస్ట్ చేశాడు. పనిలోపనిగా ఎన్టీఆర్‌తో కలసి తీసుకున్న ఓ ఫొటోనూ జతపరిచాడు.

06/10/2016 - 22:01

‘బాహుబలి’ని తలదనే్న మల్టీస్టారర్ సినిమా తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. ఇప్పటివరకు భారత సినిమా చరిత్రలో ‘బాహుబలి’ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా చాటిన సినిమా అది. పైగా జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా అందుకుంది. అయితే అదే స్థాయిలో భారీ బడ్జెట్‌తో వచ్చిన సినిమాలు మాత్రం డిజాస్టర్లుగా మిగిలిపోయాయి.

06/10/2016 - 22:00

ఇప్పటివరకు 99 సినిమాలు కథానాయకుడిగా పూర్తిచేసి 100 సినిమా మైలురాయిని దాటబోతున్న బాలకృష్ణ చిన్న పిల్లల మనస్తత్వంతోనే ఉన్నారని, విద్యార్థిలాగా షూటింగ్‌లో అన్నీ నేర్చుకుంటారని ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ దర్శకుడు క్రిష్ తెలిపారు.

06/10/2016 - 21:58

నాని, సురభి, నివేదా థామస్ ప్రధాన తారాగణంగా శ్రీదేవి మూవీస్ పతాకంపై ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ రూపొందించిన జెంటిల్‌మెన్ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ..

06/10/2016 - 21:56

నాగచైతన్య కథానాయకుడుగా చందు మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై రూపొందిస్తున్న ప్రేమమ్ చిత్రంలో హీరో వెంకటేష్ ఓ అతిథి పాత్రలో నటించనున్నారు. మలయాళంలో విజయవంతమైన ప్రేమమ్ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగచైతన్యకు కథానాయికలుగా శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోనా శబాస్టియన్ నటిస్తున్నారు.

06/10/2016 - 21:54

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ ఇప్పటివరకు ఎన్నో ప్రయోగాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మరో ప్రయోగానికి సిద్ధం అయ్యాడు? ఇంతకీ ఆయన చేసే ప్రయోగం ఏంటో తెలుసా? ఈసారి ఆయన ఆస్ట్రోనాట్ రాకేశ్ శర్మ జీవిత కథలో కనిపిస్తాడట! అవును, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్ కూడా జరుగుతోంది. మొత్తానికి ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇది మొదటి స్పేస్ మూవీ అవుతుంది.

06/10/2016 - 21:53

అల్లు అర్జున్ కథానాయకుడుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ రూపొందించిన ‘సరైనోడు’ చిత్రం విడుదలై 50 రోజులు దాటింది. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ వేసవి కానుకగా విడుదల చేసిన ‘సరైనోడు’ అన్ని కేంద్రాల్లో అద్భుత విజయం సాధించిందని, అల్లు అర్జున్ మెచ్యుర్డ్‌గా ఈ సినిమాలో నటించాడని తెలిపారు.

06/10/2016 - 21:51

శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ శర్వానంద్ కథానాయకుడిగా చంద్రమోహన్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తిచేశారు.

06/09/2016 - 21:03

మాస్, కమర్షియల్ హీరోగా 99 చిత్రాలను పూర్తిచేసిన బాలకృష్ణ, తాజాగా నటిస్తున్న చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. 100వ మైలురాయి చేరిన ఆయన కెరీర్‌లో ఈ చిత్రం ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. శ్రీయ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మంచి అభిరుచి వున్న క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం నటుడు బాలకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఫస్ట్‌లుక్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది.

06/09/2016 - 21:02

‘నేను ఇప్పటివరకూ చేసిన కమర్షియల్ చిత్రాలలో ది బెస్ట్‌గా ‘ఒక్క అమ్మాయి తప్ప’ నిలుస్తుంది. దర్శకుడు ఈ కథను నాకు 2012లోనే చెప్పారు. నాకు నచ్చిన కథల్లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఒకటైతే, రెండోది ఇదే. కానీ ఇది సినిమాగా రూపొందించడం కష్టం. సినిమా అంతా హైదరాబాద్ హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై షూటింగ్ సాగాలి. ఆ కథను ప్రేక్షకులు నమ్మేలా తీయడానికి ఇంతకాలం పట్టింది’ అని కథానాయకుడు సందీప్‌కిషన్ తెలిపారు.

Pages