S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/07/2016 - 21:49

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో దర్శకుడు మారుతి కథ, స్క్రీన్‌ప్లే అందించగా మారుతి టాకీస్ బ్యానర్‌పై మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రోజులు మారాయి’. చేతన్, పార్వతీశన్, కృతిక, తేజశ్వి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జి.శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు.

06/07/2016 - 21:47

అల్లరి నరేష్ సరసన అత్తిలి సత్తిబాబు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విదీషకు ఆ తర్వాత చేసిన సినిమాలు కెరీర్‌కు ఉపయోగపడలేదు. దాంతో తమిళంలో కూడా ప్రయత్నాలు సాగించిన ఈమె ఇటీవలే శ్రీకాంత్ సరసన దేవరాయ చిత్రంలో నటించింది. తాజాగా విదీష ఎన్.టి.ఆర్ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఎన్‌టిఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతాగ్యారేజ్ చిత్రం ఇటీవల చెన్నయ్‌లో ఓ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది.

06/07/2016 - 21:45

ప్రతీక్, శ్రావ్య, విశాఖ ప్రధాన తారాగణంగా రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రేమ్‌కిరణ్ దర్శకత్వంలో లంకా కరుణాకర్‌దాస్ రూపొందిస్తున్న చిత్రం ‘వానవిల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన మలేషియా షెడ్యూల్ పూర్తిచేశారు.

06/07/2016 - 21:43

బీచుపల్లి ఆంజనేయ ప్రొడక్షన్స్, షేరింగ్ టాలెంట్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘నందికొండ వాగుల్లోన’. సాయికిరణ్, ఆనంద్, కళ్యాణ్ ప్రధాన తారాగణంగా ఏకారి సత్యనారాయణ దర్శకత్వంలో బీచుపల్లి రఘు రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, అనుకున్నదానికన్నా సినిమా బాగా వచ్చిందని, ఊటీ, గోవా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిపామని తెలిపారు.

06/05/2016 - 23:13

ప్రముఖ నటుడు మహేష్‌బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ ఆశించిన స్థాయి విజయం సాధించకపోవడంతో ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు మహేష్‌బాబు. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావచ్చాయి. ఈనెల చివర్లో ఈ చిత్రం ప్రారంభం కానుందని తెలిసింది. సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కే ఈ చిత్రంలో మహేష్‌బాబు ఇంటిలిజెన్స్ అధికారిగా కనిపిస్తాడు.

06/05/2016 - 23:08

ప్రముఖ నిర్మాత రామానాయుడు పేరుతో విశాఖలో ‘మ్యూజియం ఆఫ్ సినిమా’ను ఏర్పాటు చేస్తామని, ఆయన పేరుమీద అవార్డును కూడా ప్రకటిస్తామని ఆయన తనయుడు, నిర్మాత సురేశ్‌బాబు అన్నారు. ఆదివారం తమ సొంత స్టూడియోలో రామానాయుడు జయంతి సందర్భంగా స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించారు.

06/05/2016 - 23:11

తెలుగులో హీరోయిన్‌గా నటించిన ‘నేను శైలజ’ చిత్రం మంచి విజయం సాధించడంతో హీరోయిన్‌గా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది కీర్తి సురేష్. ఆ సినిమా తర్వాత ప్రస్తుతం తమిళంలో బిజీ అయిన ఈమెకు అవకాశాలు ఎక్కువయ్యాయి. నటనతోపాటు గ్లామర్‌కు కొదవలేని కీర్తిసురేష్ తాజాగా ఓ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పింది.

06/05/2016 - 23:03

కథానాయిక సమంత ఒక రోజు ‘మీ బ్రెయిన్ చాలా తెలివైనది. హృదయం ఎంతో మెత్తనైనది. ఎప్పుడు బ్రెయిన్‌తోనే కథాకథనాలు రాస్తారు. హృదయంతో ఎందుకు రాయరు?’ అని అడిగినప్పటినుండి ఆలోచిస్తూ ‘అ.. ఆ’ చిత్రాన్ని రాసుకున్నాను అని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు.

06/05/2016 - 23:02

రొటీన్‌కు భిన్నంగా సరికొత్త కథలను ఎంచుకొని హీరోగా నటిస్తున్న సుమంత్ అశ్విన్ మరో కొత్త చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని మల్కాపురం శివకుమార్, కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైవిధ్యమైన కథాకథనాలతో సినిమా రూపొందించాలనుకున్న తమ సంస్థ ఈసారి సుమంత్ అశ్విన్‌తో ఓ మంచి చిత్రాన్ని రూపొందించనుందని తెలిపారు.

06/05/2016 - 22:42

చిరంజీవి 150 చిత్రానికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడే కొత్తకొత్తగా వినిపిస్తున్నాయి. ఆ మధ్య కథానాయికగా నయనతార ఖరారైందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మరో కొత్త పేరు వినిపిస్తోంది. నయనతార తర్వాత అనుష్క పేరు వినిపించినా వెనక్కెళ్ళింది. వీరందరినీ కాదని ఇప్పుడు బాలీవుడ్ భామ దీపికాపదుకొనే పేరు వినిపిస్తోంది. చిరంజీవి పక్కన నటించమని తననెవరూ అడగలేదని నయనతార చెప్పింది.

Pages