S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/05/2016 - 22:55

ప్రముఖ సీనియర్ నటుడు కృష్ణ, విజయనిర్మల ప్రధాన పాత్రలో ముప్పలనేని శివ దర్శకత్వంలో ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్‌అవుతున్న శ్రీశ్రీ చిత్రంలో ఓ ప్రముఖ పాత్ర పోషించాడు నటుడు ఆశిష్ గాంధీ. ఈ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కిందని చెబుతున్న ఆశిష్ గాంధీ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లో.. ‘కల్యాణ్‌రామ్ హీరోగా వచ్చిన పటాస్ సినిమాలో మంచి పాత్ర దక్కింది.

06/05/2016 - 22:52

ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది గ్లామర్ భామ రకుల్‌ప్రీత్‌సింగ్. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో సక్సెస్ అందుకున్న ఈమెకు తెలుగులో స్టార్ హీరోల సరసన అవకాశాలు అందిపుచ్చుకుంటూ విజయాల్ని దక్కించుకుంటోంది. ఇప్పటివరకూ రకుల్ చేసిన సినిమాల్లో మెగా హీరోల సినిమాలే ఎక్కువ. దాంతో ఈమెకు మెగా హీరోయిన్ అనే ట్యాగ్ పడిపోయింది.

06/05/2016 - 22:48

సాయిరోనక్, అతిథిసింగ్ ప్రధాన తారాగణంగా ఐవింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుప్పెడంత ప్రేమ. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు.

06/05/2016 - 22:47

ఆర్.పి.పట్నాయక్, అనిత హెచ్.రెడ్డి జంటగా యూని క్రాఫ్ట్స్ మూవీ పతాకంపై ఆర్.పి. దర్శకత్వంలో జి.సి.జగన్మోహన్ రూపొందిస్తున్న చిత్రం ‘మనలో ఒకడు’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఒక్క పాట మినహా పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.పి. మాట్లాడుతూ ఈనెల 16నుండి నెలాఖరు వరకు జరిపే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందని, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుతున్నామని అన్నారు.

06/05/2016 - 03:57

ప్రభుదేవా, తమన్నా, సోనుసూద్ ప్రధాన పాత్రల్లో ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో కోన ఫిలిం కార్పొరేషన్, బ్లూసర్కిల్ కార్పొరేషన్, బిఎల్‌ఎన్ సినిమా, ఎంవివి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘అభినేత్రి’. ఈ సినిమా ఫస్ట్‌లుక్, టీజర్ హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ, సినిమా టీజర్ అద్భుతంగా ఉందని, ‘అభినేత్రి’ అని టైటిల్ తమన్నాకు బాగా సూట్ అవుతుందని అన్నారు.

06/05/2016 - 03:53

సుధాకర్, సుధీర్‌వర్మ, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఎస్.ఎల్.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ముళ్ళపూడి వరా దర్శకత్వంలో జి.అనిల్‌కుమార్ రాజు, జి.వంశీకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘కుందనపుబొమ్మ’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని జూన్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ముళ్ళపూడి వరా మాట్లాడుతూ, ఇదొక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ప్రేమకథ.

06/05/2016 - 03:49

విశాల్, శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో విశాల్ సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించిన చిత్రం ‘రాయుడు’. ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి తెలుగులో విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు.

06/05/2016 - 03:46

ఇటీవల విడుదలైన ‘శ్రీమతి బంగారం’ చిత్రం అందరికీ నచ్చే బంగారమని దర్శకుడు ఈ చిత్రాన్ని చక్కగా రూపొందించారని ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ తెలిపారు. రిషి, రాజీవ్ కనకాల, రిచాసిన్హా ప్రధాన తారాగణంగా వినయ్‌బాబు దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమతి బంగారం’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ హాల్‌లో నిర్వహించారు.

06/05/2016 - 03:41

రమ్య, దివంగత విష్ణువర్థన్ ప్రధాన తారాగణంగా పెన్ మూవీస్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో సాజిద్ ఖురేషి రూపొందించిన చిత్రం ‘నాగాభరణం’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను హైదరాబాద్‌లో శనివారం విడుదల చేశారు.

06/05/2016 - 03:39

రాజవౌళి దర్శకత్వంలో రూపొందిన ‘మర్యాద రామన్న’ చిత్రంతో విలన్‌గా తెరంగేట్రం చేసి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాకర్. ఆ తరువాత అనేక చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఆయనకు ‘బాహుబలి’ చిత్రం అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. కాలకేయుడిగా నటించిన ఆయన, ఇప్పుడు బిజీగా మారాడు. ప్రస్తుతం సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా నటించిన ‘రైట్ రైట్’ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

Pages