S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/03/2016 - 21:26

క్రేజీ హీరో రవితేజ ‘బెంగాల్ టైగర్’ సినిమా తరువాత ఇప్పటివరకు మరే సినిమా చేయడం లేదు. ఇప్పటికే రెండుమూడు స్క్రిప్ట్స్ సిద్ధంగా ఉన్న కూడా ఇంకా ఆయన సినిమా మాత్రం సెట్స్‌పైకి తీసుకురావడం లేదు. దానికి కారణం ఈమధ్య ‘కిక్-2’ సినిమా సమయంలో రవితేజ బాగా సన్నగా కనిపించడంతో జనాలు సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. దాంతో ఇప్పుడు ఆయన మళ్లీ బరువుపెంచే పనిలోపడ్డాడు.

06/03/2016 - 21:15

ఈమధ్య సీనియర్ హీరోలకు.. హీరోయిన్ల షాక్‌లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే నందమూరి బాలయ్య వందో సినిమాకు హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న 150వ సినిమాకు కూడా హీరోయిన్ సమస్యగా మారింది. ఇప్పటికే ఈ సినిమాలో హాట్‌భామ అనుష్క నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అనుష్క ఫైనల్ అయిందని కూడా తెలిసింది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా విషయంలో ఇంకా అనుష్క ఓకే చెప్పలేదట!

06/03/2016 - 21:11

సునీల్ హీరోగా, మన్నార్‌చోప్రా హీరోయిన్‌గా ‘ప్రేమకథాచిత్రమ్’ తరువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం జక్కన్న చిత్రం ఇటీవలే దుబాయ్‌లోని అందమైన లొకేషన్స్‌లో జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా సాంగ్ షూటింగ్ జరుపుకుంది. వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్‌రెడ్డి ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

06/03/2016 - 21:09

సుడిగాలి సుధీర్ (జబర్దస్త్ ఫేం), శ్రావణి, మనీషా ప్రధాన తారాగణంగా సత్యశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై వరసాల సత్యనారాయణ రూపొందించిన చిత్రం ‘అవును.. నిజమే’. షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి దర్శకుడు గూన అప్పారావు. ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

06/03/2016 - 21:07

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా వెలగాలనుకుని చాలా ప్రయత్నాలు చేసినా లాభం లేకపోవడంతో బాలీవుడ్‌కి చెక్కేసి, అందాలను ఆరబోసి హీరోయిన్‌గా చాన్సులు కొట్టేసింది సోనాల్ చౌహాన్. ఆ తరువాత బాలయ్య ‘లెజెండ్’ సినిమాలో చాన్స్ కొట్టేసి, ఇక్కడ బికినీలో ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి ఆయనతో మరో సినిమా చాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా తరువాత చాలా అవకాశాలు వస్తున్నాయి కూడా.

06/03/2016 - 21:04

తమిళంలో విజయవంతమైన నంబేండా చిత్రాన్ని తెలుగులో గుడ్ ఈవెనింగ్ పేరుతో అనువదించారు. నయనతార, ఉదయనిధి స్టాలిన్, సంతానం కాంబినేషన్‌లో ఎ.జగదీష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని భద్రకాళి ఫిలింస్ పతాకంపై భద్రకాళి ప్రసాద్ తెలుగులో అందిస్తున్నారు.

06/03/2016 - 21:02

గిరిబాబు, జూ.రేలంగి ప్రధాన తారాగణంగా బాబ్, బిందు బార్బి యువ జంటగా పాలిన్ డ్రోమ్ పిక్చర్స్ పతాకంపై భువన విజయ్ దర్శకత్వంలో ఫణిదుర్గప్రసాద్ రూపొందించిన చిత్రం ‘వర్మ వర్సెస్ శర్మ’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించారు.

06/03/2016 - 21:00

హర్షకుమార్, డాలీశర్మ, నదీమ్ భార్గవ్ ప్రధాన తారాగణంగా గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ పతాకంపై దీపక్ బలదేవ్ దర్శకత్వంలో ప్రకాష్ ఠాకూర్ రూపొందించిన చిత్రం ఫుల్‌మూన్. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలో వున్నాయి.

06/03/2016 - 20:54

రాంశంకర్, నికిషా పటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో నక్కా రామేశ్వరి, మేకా బాలసుబ్రహ్మణ్యం, సురేష్‌వర్మ ఇందుకూరి సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘అరకు రోడ్డులో’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలు సరికొత్తగా వుంటాయని, ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు.

06/02/2016 - 21:10

ప్రస్తుతం దక్షిణాదిలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది అందాల భామ త్రిష. ఇప్పటికే పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్న ఈమె, తాజాగా నటించిన ‘నాయకి’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. హర్రర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమైంది. త్రిష మరోమారు ప్రేక్షకులను భయపెట్టనుందట. తాజాగా మరో హర్రర్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది.

Pages