S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/02/2016 - 21:09

దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘రుద్రమదేవి’ సినిమా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఒక చారిత్రక కథను సినిమాగా ఆవిష్కరించాలని గుణశేఖర్ చేసిన ప్రయత్నానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచే కాక సినీ పరిశ్రమనుంచి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది.

06/02/2016 - 21:07

శ్రీ వేంకటేశ్వర సినీ పిక్చర్స్ పతాకంపై నాగేష్.సిహెచ్. నిర్మాతగా బేబి దివ్యప్రియ సమర్పణలో ఎ.వి.్ఫణిశ్వర్ (తుఫాన్) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పక్కా ప్లాన్’. సుభాష్, నాగేష్, భవానీ, యువరాణి ప్రధాన పాత్రల్లో నటిస్తన్న ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది.

06/02/2016 - 21:06

ఆనంద్ నందా, రేష్మి జంటగా వి సినీ స్టూడియో నిర్మాణంలో డి.దివాకర్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘రాణిగారి బంగళా’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధంచేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు డి.దివాకర్ మాట్లాడుతూ- ఈ సినిమా కోసం అనేక రకాల పేర్లు అనుకున్నా, కథప్రకారం ఈ టైటిల్ అయితేనే బాగుంటుందని నిర్ణయించామని, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయని తెలిపారు.

06/02/2016 - 21:05

పరిశ్రమలో దర్శకులు నిర్మాతలు తమ తమ బంధువులను, వారసులను పరిశ్రమకు పరిచయం చేయడం షరా మామూలే. ఈసారి ఈ లిస్టులో దర్శకుడు సుకుమార్ కూడా చేరారు. ఇప్పటికే ఆయన ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించి చిత్రాలు రూపొందిస్తున్నారు. తన అన్న కొడుకు అశోక్‌ను కథానాయకుడిగా చేసి త్వరలో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు సుకుమార్. ఈ చిత్రానికి ఆయన శిష్యుడు హరిప్రసాద్ దర్శకత్వం వహించనున్నాడు.

06/02/2016 - 21:03

ప్రముఖ హాలీవుడ్ నటులు రిచాజెన్, సెసిలియా చియాంగ్ జంటగా ఓవర్సీస్ బ్యానర్‌పై ఫ్రాంకీఛాన్ దర్శకత్వంలో 500 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో జాకీచాన్ నిర్మించిన చిత్రం ‘ది లెజండరీ అమెజాన్స్’.

06/02/2016 - 21:01

శ్రీ ఓం డి ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ఆదర్శబాబు, పావని జంటగా అజ్మీర చందు దర్శకత్వంలో ఎ.ఎస్.రావు రూపొందిస్తున్న చిత్రం ‘నాన్న నేను వర్ష’. ఈ చిత్రానికి సంబంధించిన తొలి కాపీ సిద్ధమైంది.

06/02/2016 - 20:51

ప్రస్తుతం ‘బాహుబలి-2’ చిత్రంలో నటిస్తున్న ప్రభాస్, ఈ సినిమా తరువాత ఆయన చేసే మరో చిత్రానికి సన్నాహాలు పూర్తికావచ్చాయి. అక్టోబర్‌తో ‘బాహుబలి’ సినిమా షూటింగ్ పూర్తవగానే ప్రభాస్ నెక్ట్స్ సినిమా నవంబర్‌లో మొదలుకానుంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంలో బ్రిటన్ భామ అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోందట. ఇప్పటికే ఆమెతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.

06/02/2016 - 20:47

అమ్మోరు, దేవి, అరుంధతి లాంటి సినిమాలతో విజువల్ ఎఫెక్ట్‌తో ఈతరం ప్రేక్షకుల్లోనూ తనకంటూ ఓ స్థానాన్ని స్థిరపరచుకున్నాడు కోడిరామకృష్ణ. ఇక తాజాగా ఇదే విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యంగా కన్నడలో ఆయన చేస్తోన్న ఓ అతిపెద్ద సాహసం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇండియన్ సినిమాలోనే ఈ తరహా విజువల్ ఎఫెక్ట్స్ వాడడం మొదటిసారిగా ప్రచారం జరుగుతోంది. కోడి రామకృష్ణ ప్రస్తుతం కన్నడలో ‘నాగరహవు’ అనే ఓ సినిమా చేస్తున్నారు.

06/02/2016 - 20:44

ముంబైలోని ఓ టీవీ ఛానల్‌లో ప్రసారమయ్యే రియాల్టీషో ‘స్ప్లిట్‌విల్లా 9’ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ తార
సన్నీలియోన్

06/02/2016 - 04:48

నిఖిల్, హేబాపటేల్, నందితాశే్వత ప్రధాన తారాగణంగా మేఘనా ఆర్ట్స్ నిర్మాణంలో వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’. ఈ చిత్రానికి సంబంధించిన 80 శాతం షూటింగ్ పూర్తిచేశారు. కథానాయకుడు జన్మదినోత్సవ సందర్భంగా చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..

Pages