S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు

03/23/2016 - 04:43

నెల్లూరు టౌన్, మార్చి 22: జిల్లాలో స్ర్తినిధికి సంబంధించిన రుణాలు వసూలు చేయకపోవడంపై జిల్లా కలెక్టర్ ఎం జానకి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న డిఆర్‌డిఎ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం స్ర్తినిధి రుణాలకు సంబంధించి ఎపిఎంలు, సిసిలతో సమీక్షా సమావేశం జరిగింది.

03/23/2016 - 04:42

బిట్రగుంట, మార్చి 22: బిలకూట క్షేత్రం ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం భక్తుల గోవింద నామస్మరణలతో బిలకూట క్షేత్రం దద్దరిల్లింది. అల్లూరు మండలం శంభునిపాలెం చెందిన పురిణి తిరుపతయ్య, పుచ్చలపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో గురుడ సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. గురుడ వాహనంపై విష్ణుమూర్తిని దర్శించుకున్న అనంతరం పుష్కరణిలో భక్తులు స్నానం చేసి స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

03/23/2016 - 04:42

నెల్లూరు, మార్చి 22: నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని కొత్తకాలవ సెంటర్‌లో అక్రమ రీఫిల్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి 73 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను విజిలెన్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. అధికారుల కథనం మేరకు కొత్తకాలవ సెంటర్‌కు చెందిన షాన్‌వాజ్ గత కొంతకాలంగా ప్రభుత్వ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా చిన్నచిన్న సిలిండర్లలోకి రీఫిలింగ్ చేస్తుంటాడు.

03/23/2016 - 04:41

నెల్లూరు, మార్చి 22: స్థానిక బోసుబొమ్మ సెంటర్‌కు చెందిన సంచారజాతి జంటకు చెందిన పసిబిడ్డను గుర్తుతెలియని మహిళ మంగళవారం అపహరించింది. పోలీసుల కథనం మేరకు స్థానిక బోసుబొమ్మ సెంటర్‌కు చెందిన వెంకటేశ్వర్లు అలియాస్ శ్రీనివాసులు, గంగ దంపతులు సోమవారం రాత్రి తమ బిడ్డతోపాటు నిద్రకు ఉపక్రమించారు.

03/23/2016 - 04:41

కొండాపురం, మార్చి 22: సాగునీటి గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా నాన్‌డెల్టా పరిరక్షణ సమితి అధ్యక్షుడు కండ్లగుంట మధుబాబు అన్నారు. మంగళవారం రాళ్లపాడు రిజర్వాయరు వద్ద నుండి కొండాపురం ఎంపిడివో కార్యాలయానికి చేరుకున్న టిడిపి నాయకులు విలేఖరులతో మాట్లాడారు.

03/23/2016 - 04:40

కొండాపురం, మార్చి 22: కొండాపురం మండలం సాయిపేట, భీమవరప్పాడు రైతులు సాగునీటికి పడుతున్న ఇబ్బందులను జిల్లాకలెక్టర్ జానకి దృష్టికి తీసుకెళ్తానని కావలి ఆర్డీవో ఎంఎల్. నరసింహం తెలిపారు. మంగళవారం రాళ్లపాడు రిజర్వాయర్ వద్దకు వచ్చిన ఆయన అనంతరం కొండాపురంలో విలేఖరులతో మాట్లాడుతూ సోమశిల నీరు రాళ్లపాడు రిజర్వాయర్‌కు అందినప్పటి నుండి ఆ రిజర్వాయరులో తాగునీటి కోసం నిల్వ ఉంచాలన్నారు.

03/23/2016 - 04:39

నెల్లూరుసిటీ, మార్చి 22: నెల్లూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 2016-17 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఆమోదం పొందింది. మంగళవారం నెల్లూరు నగరపాలక కార్పొరేషన్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాల్లో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో బడ్జెట్‌పై చర్చించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది మెరుగ్గా ఉండే విధంగా బడ్జెట్ అంచనాల ప్రతిపాదనలను సిద్ధం చేశారు.

03/23/2016 - 04:39

గూడూరు, మార్చి 22: గూడూరు పట్టణంలోని శ్రీ అళఘనాథుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారిని హనుమంత వాహనంపై నగరోత్సవం నిర్వహించారు. ఉదయం స్వామివారికి తిరుచ్చి వాహనంపై ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్రి స్వామి వారిని హనుమంత వాహనంపై ఉంచి గ్రామోత్సవం జరిపారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలోపాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధప్రసాదాలను స్వీకరించారు.

03/23/2016 - 04:38

కోట, మార్చి 22: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక రవాణాలో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని హెచ్చరించారు. కోట మండలం పుచ్చలపల్లి గ్రామం వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుకరీచ్‌ను మంగళవారం ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఉచిత ఇసుక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.

03/23/2016 - 04:37

నెల్లూరు, మార్చి 22: గతేడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఈ ఏదాది రెండో పంట పండించుకోవచ్చని రైతులు సంబరపడ్డారు. అయితే తేలని నీటి లెక్కలతో రెండో పంటకు సాగునీరు ప్రశ్నార్ధకమయింది. సోమశిల నీటి లెక్కల్లో తేడాలు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు అంటుండగా, లేదు నీటి నిల్వలు సరిగానే ఉన్నాయని ప్రభుత్వం, పాలకపక్ష నాయకులు అంటున్నారు.

Pages