S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు

07/09/2017 - 01:15

ఎదురుగా...
ఎంతో గంభీరమైన సముద్రం.
తీరాన్ని ముంచేట్లుగా ప్రళయ భీకరంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి అలలు. అలలు ఆవేశంగా వచ్చి తీరానికి తగిలి మరణిస్తున్నాయి. సముద్రం తీరం వైపు చూస్తూ నాదంటూ వచ్చే ఓరోజు నా అలలతో నిన్ను కబళింపచేస్తానని అంతరంగంలో ఆవేశంగా ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగా ఉంది.
సముద్రం ఎప్పుడూ ఓ ప్రశే్న!

07/09/2017 - 01:14

బోరు వేసిన రైతుకి నీళ్లు పడితే
కళ్లల్లో ఆనందభాష్పాలు
నీళ్లు పడని బోరు నోరు తెరచి
మృత్యుకుహరమై
చిన్నారిని మింగేస్తే..?
అమ్మనాన్నల కళ్లల్లో అశ్రుజలాలు..
చీకటి కుహరంలో చిన్నారి
ఒంటరిదై.. ఉక్కిరిబిక్కిరై..
ఊపిరాడని పరిస్థితిలో..
అమ్మ పిలుపు విన్నా చెయ్యి అందుకోలేని
దౌర్భాగ్యపు విధి దాడికి బలి అయినావా చిన్నారి..?

07/09/2017 - 01:13

చాలాకాలం కిందట ఏదో దినపత్రికలో సంక్షిప్తంగా వెలువడిన ఒక వార్త తాలూకు ముఖ్యమైన వాక్యం రచయితను ప్రేరేపించి ఈ పద్యకావ్యం రచనకు పూనుకొనేటట్టు చేసింది. ఇందులోని ప్రాంతాలు, పాత్రలు, సన్నివేశాలు అన్నీ కల్పితాలే అని రచయిత అన్నప్పటికీ అవి మనమెరిగినట్లు మనచుట్టూ పరిభ్రవిస్తున్నట్లు తోస్తాయి.

07/09/2017 - 01:12

పనిపిల్లోడు కథ చాలా బాగుంది. జగదీష్, రైతు సిద్దయ్య మధ్య సాగిన సంభాషణలు చాలా బాగా ఆకట్టుకున్నాయి. పిల్లలపై కుటుంబ భారం పడితే వారి పరిస్థితి దారుణంగా తయారవుతుంది. అన్నీ వున్న పిల్లలకు చదువు విలువ తెలియక చెడుదారులు తొక్కుతున్నారు. కానీ బాలకార్మికులకు చదువుకోవాలనే ఆశ వున్నా వారికి విద్య ఇప్పటికీ అందని ద్రాక్షే.

07/09/2017 - 01:10

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.

07/02/2017 - 23:38

పొలం పనులు జోరుగా సాగుతున్నాయి. రైతు సిద్ధయ్య గట్టున కాలుమీద కాలు వేసుకొని ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. జగదీష్ పని జరిగేలా చూస్తున్నాడు.

07/02/2017 - 23:37

గోపాలా! గోకుల పాలా!
మా మొర వినవేలా!
పాప పుణ్యములెరుగని మూగ జీవులం మేము
పవిత్రమైన చరిత కలిగిన వారము మేము
నీకత్యంత ప్రియమైన పశుజాతులం మేము
మా‘నవు’లు చేసే దుష్కృత్యాలు కనలేవా!
విధాతనిచ్చిన గాలి, నీరు, గ్రాసము తింటూ
పరులకు ఏమాత్రము హానిచేయని
జంతువులం మేము
సాధు జీవులుగా బతికే మా కష్టాలు తీర్చలేవా గోపాలా!

07/02/2017 - 23:36

స్వచ్ఛ్భారత్ హాస్యనాటిక అదిరింది

07/02/2017 - 23:35

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.

06/25/2017 - 01:24

వ్యాఖ్యాత : ప్రియమైన ప్రేక్షక మహాశయులకి నా హృదయపూర్వక నమస్కారములు. మన భారతీయులకు సాటి మనిషిపై జాలి, దయ, కరుణ, ప్రేమ, సానుభూతి వగైరా చాలాచాలా ఎక్కువ. ఇప్పుడు ఉదయం పదిగంటలవుతుంది.. ఇక్కడ అంటే మన నెల్లూరు ట్రంకురోడ్డులోని నాలుగురోడ్ల కూడలిలో మనమంతా చూస్తున్నాం. ఇదిగో చీపిరి చేతిలో పట్టుకుని నడిరోడ్డులో ఒక శవం పడి వంది.
అదిగో అటు చూడండి, ఒక వ్యక్తి ఇటుగా వస్తున్నాడు.

Pages