S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు

04/02/2017 - 08:32

నెల్లూరులో చైన్నై బస్సు ఎక్కిన కిరణ్ కండక్టర్‌కు టిక్కెట్‌కు సరిపడా డబ్బులు చెల్లించి లోనికెళ్లి కిటికీ పక్క సీటు ఎంచుకుని అందులో కూర్చున్నాడు. బస్సు ముందుకు కదులుతుంటే ప్రకృతి వెనక్కు వెళ్లడాన్ని చూసి ఆనందిస్తున్నాడు. అనుకోకుండానే తన చిన్ననాటి జ్ఞాపకాలు మనోఫలకంపై కదలాడాయి.

03/26/2017 - 02:23

పరిమళ దీర్ఘంగా ఆలోచిస్తోంది. ఆమె ఆలోచనల్లో రెండు విషయాలున్నాయి. రాబోయే ఉగాదితో పాటు తన పిల్లల గురించి. వ్యవసాయం చేస్తూ ఆ ఊళ్లో మంచిపేరు తెచ్చుకున్న తన భర్త పరంధామయ్య చనిపోయి పదేళ్లవుతోంది. ఆ ఇంటికి కోడలిగా వచ్చి తను ఆ ఇంటికి, ఆ ఊరికి ఆప్తురాలైపోయింది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న సామెత తన పాలిట నిజమైంది.

03/26/2017 - 02:20

చైత్రమాస తొలి తిథి ఉగాది
మామిడి తోరణాలు,
మావి చిగురుల సవ్వళ్లు
ఉనికికి తెలియజేస్తున్నాయి
షడ్రుచులతో చక్కగా అమరి
రాబోయే సంవత్సరాదికిదే
మా స్వాగతం
దుర్మిఖికి వీడ్కోలు పలుకుతూ,
జీవన గమనంతో అనుభూతులు పంచటానికి
సిద్ధమవుతున్న
‘‘హేమలంబ’’
నీకిదే మా స్వాగతం
సామాజిక రుగ్మతల నుంచి
కాపాడుతూ
మళ్లీ మళ్లీ సమస్యల నుంచి

03/26/2017 - 02:17

ఖగోళ దూరాల నుండి
నక్షత్రశాలలు దాటుకొంటూ
గ్రహాలు, ఉపగ్రహాలను
పలకరించుకొంటూ
భూగోళమంతా నవ్యకాంతులు నింపుతూ
వెలుగుల వాకిట నిలబడమని
ఉగాదిని ఆహ్వానిస్తున్నా...

03/26/2017 - 02:17

గతవారం మెరుపులో ప్రచురించిన పెట్టుపోతలు కథ చాలా బాగుంది. అసలు పెట్టుపోతలు అంటే మన సంప్రదాయాలను గౌరవించడం. మన ఇంట్లో ఏ శుభకార్యమైనా జరిగితే మన బంధువులను మనకున్నంతలో గౌరవించడం మన సంప్రదాయం. కానీ వచ్చిన తమకు ఇవి కావాలి, ఈ స్థాయిలో మర్యాదలు వుండాలని ఆశించడం సబబు కాదు. అవతల వారి స్థితిగతులను కూడా అర్ధం చేసుకుని మసలుకోవాలి.

03/19/2017 - 08:36

అరుణ, పవన్ భార్యాభర్తలు. ఇద్దరూ ప్రైవేట్ రంగంలో చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. కార్తీక్, నవ్య. వారివి చిన్న ఉద్యోగాలైనా పిల్లలిద్దరికీ మంచి చదువులు చెప్పించారు. కావ్యకి పెళ్లీడు వచ్చింది. కార్తీక్ ఫైనల్ ఇయర్ బిటెక్ చదువుతున్నాడు.

03/05/2017 - 08:13

ఒక తరానికే పరిమితమైన తెలుగు సాహిత్యాన్ని యువతరానికి స్ఫూర్తి నిచ్చేలా తీర్చిదిద్దేందుకు ఆంధ్రభూమి చేస్తున్న ప్రయోగమే ‘మెరుపు’ ప్రత్యేక శీర్షిక. తెలుగు పత్రికా రంగంలో మెరుపు శీర్షిక నిర్వహణ ఒక పెద్ద సాహసం అని ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ అన్నారు.

02/26/2017 - 23:01

బంగారానికి తుప్పు పట్టదు. కానీ నిత్యానందానికి ఆ జబ్బు రావడం.. బంగారానికి తుప్పు పట్టినట్టే అనిపించింది అతగాడి భార్య నీరజకి. లేకపోతే నిత్య నిద్రలోలుడికి ఆ రోగం రావడం ఏంటి?ఒకప్పుడు తనలో కుంభకర్ణుడి అంశ ఏదో ఉన్నట్టు - ఏ కాస్త సందు దొరికినా చాలు చటుక్కున కునుకు తీస్తుండేవాడు నిత్యానందం. కునుకంటే కునుకేం కాదు - గాఢనిద్ర.

02/26/2017 - 22:59

చెత్తకుప్పపై విసిరెయ్యటానికి
అది చెత్తా, చెదారమా?
పనికిరాని వస్తువా? లేక
పగిలిపోయిన వస్తువా?
రక్తమాంసాలతో రూపుదిద్దుకున్న ప్రాణం
గర్భమనే గుడిలో వెలసిన బ్రహ్మతేజం
ఆడపిల్ల అయినంత మాత్రాన
ముళ్లకంపల్లోకి విసిరేస్తారా?
నవమాసాలు మోసి, నవనాడుల బొమ్మను
కనేది, ఈ రాక్షస కృత్యానికేనా?
కట్నమిచ్చుకోవాలన్న భయమే కాని

02/26/2017 - 22:55

గతవారం మెరుపులో ఓ మంచి కథను అందించారు రచయిత అవ్వారు శ్రీ్ధర్‌బాబు గారు. చదివిన వెంటనే ఆయనకు ఫోన్‌చేసి మాట్లాడాలి అనిపించినా ఫోన్ పనిచేయలేదు. కథలోని పాత్రల చిత్రీకరణ బాగుంది. ఉమ్మడి కుటుంబాల్లోని విలువలను చక్కగా వివరించారు. నిజంగా ఉమ్మడి కుటుంబాలన్నీ నేడు పూసలు వీడిన హారంలా మారిపోయి ఎవరి కుటుంబం వారిది అన్న చందంగా మారిపోయింది. ఒకింత బాధగా అనిపించినా వాళ్లనూ తప్పుపట్టలేం ప్రస్తుత ఆధునిక సమాజంలో.

Pages