S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి

02/20/2017 - 00:40

‘‘సూర్యుడు తూర్పున బంగారు బంతిలా ధగధగలాడుతున్నాడు’’. కిటికీలోంచి సూర్యకిరణాలు వేగంగా వచ్చి - బెడ్‌రూమ్‌లో పరచుకుంటున్నాయి.
‘‘సకల మానవాళి - మేల్కొని వారి వారి పనుల్లో బిజి అయిపోతున్నారు.’’

02/13/2017 - 22:48

బాల్కనీలో నుండి హాల్లోకి హాల్లో నుండి బాల్కనీలోకి తిరుగుతున్న వసంత భర్త రాక కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోంది.
‘ప్రతిరోజూ ఆరున్నరకే వచ్చేసేవారు. ఈరోజు ఏడవుతున్నా రారేమిటబ్బా?’ అనుకుని నిముషాలు లెక్క పెడుతోంది.
అపార్ట్‌మెంట్ కింద స్కూటర్ హారన్ వినిపించడంతో ‘హమ్మయ్యా ఆయన వచ్చేసారు’ అనుకుంటుండగానే వసంత భర్త తరుణ్ ఇంట్లోకి వచ్చాడు.

02/13/2017 - 22:46

ఏపుగా పెరిగిన కొమ్మల్లోంచి
గుత్తులు గుత్తులుగా
భూత భవిష్యత్ వర్తమానాలనే
త్రికాలాలను సూచిస్తూ
మొగ్గలై పూవులై వడలిన పూరేకులై
నేలంతా పరుచుకుని పరిమళాలను వెదజల్లుతూ
నీలమేఘశ్యాముని మెడలో
తెలతెల్లని పూమాలగా మురిసిపోయే వేళ
దారమే అవసరం లేని కాడలని మడచి
మాలగా అల్లిన రోజులు
మరి నేడు ఈ పూవులిపుడు పనికి రావటగా

02/13/2017 - 22:42

గతంతో పోల్చుకుంటే వర్తమానంలో నవల, కథల పఠనం కొంతమేర తగ్గింది. ఈ పరిణాం వల్ల ఔత్సాహిక రచయితలు, చేయి తిరిగిన రచయితలపై మరింత భారం లేదా బాధ్యత పడిందనే చెప్పాలి. కొంతమంది తమ రచన పేరొందిన పత్రికల్లో అచ్చయ్యాక పుస్తక రూపంలో తీసుకొస్తున్నారు. ఇంకొందరు ఉత్సాహంతో పుస్తకంగా మార్కెట్‌లోకి వదులుతున్నారు. తీరికలేని పాఠకుడు ఈ రెండో రకం నవల్లోకి వెళ్ళేముందు ఏదైనా పత్రికల్లో పడిందా లేదా అని పరిశీలిస్తాడు.

02/05/2017 - 23:58

చాలా రోజులకి సదానందకి తన చిరకాల మిత్రుడు, చిదానందం యింటికి వెళ్లాలనిపించింది.
అంతే ఆదివారం ఉదయం చిదానందం యింట్లో ప్రత్యక్షమయ్యాడు.
ఎదురుగా...చిదానందం పద్మాసనంలో కూర్చుని.. చుట్టూ అయిదారు పత్రికలు వేసుకుని తపోదీక్షతో మునిగి ఉండడం చూశాడు.
కూర్చీ లాక్కుని అతన్ని ఎందుకు డిస్ట్రబ్ చేయడం అనుకుంటూ.. ఎదురుగా కూర్చున్నాడు.

02/05/2017 - 23:57

ఎడతెగని ఆలోచనా తరంగాలు
పుంఖాను పుంఖాలుగా
హృదయ తీరాన్ని
కల్లోల పరుస్తుంటే..
కలత చెందుతు
కలవరపడుతూ
కలలు కనడం
మానివేస్తున్నప్పటికీ..
వేదనకు అంతులేదు!
ప్రతి రేయి కళ్లు చెమర్చే రోదనే
నన్ను వెంటాడుతుంటే...
ఏమి చేయను?
ఎలా ముందుకు సాగను?
పనులలో అవరోధాలు
నడకలో అడ్డంకులు
నన్ను వెక్కిరిస్తుంటే..

02/05/2017 - 23:48

- ప్రతులకు -
నేలపూరి రత్నాజీ,
చాగల్లు (పోస్టు - మండలం) ప.గో.జిల్లా., సెల్: 9440328432
**

01/29/2017 - 04:42

ఎనె్నన్ని కలలు కన్నాను. చిన్నతనం నుండీ చాలా తెలివైన వాణ్ణని అందరూ పొగుడుతుంటే ఉబ్బితబ్బిబ్బు అయ్యేవాణ్ణి. నాన్న కష్టపడి అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ చదివించాడు. తనను ఇంజనీరుగా చూడాలన్న నాన్న కోరిక తీర్చడానికి హైదరాబాదు వెళ్లి చేసిన ఉద్యోగానే్వషణ తాను పేరుకు మాత్రమే ఇంజనీరునన్న సత్యాన్ని తెలియచేసింది.

01/24/2017 - 23:54

ఇంటి ముందు నీరజమ్మగారు వడియాలు, ఊర మిరపగాయలు ఆరబెడుతున్నారు. కాకులు రాకుండా క్యాట్‌బాల్ పెట్టి లోనకి వస్తుండగా కశ్యప్ గావుకేక వినబడింది.
‘అమ్మా! నేను ఇది లాగలేకపోతున్నాను’
‘ఏరా! అక్క పురిటికి వస్తుంది. నీవది ఊడదీయ లేకపోతే ఇంకా అది ఉతికి నీలిమందు బెట్టి ఆరవేసి ఉండచుట్టాలి. ఇంక నేనెంత కష్టపడాలి?’
‘ఏమైనా భారతంలో దుశ్శాసనుడే హీరో. బాహుబలి విసుగ్గా లాగుతూ అన్నాడు’.

01/24/2017 - 23:52

పురాణేతిహాసాల భారతంలో
నలకూబరుడికి కథ ఉంది!
మానవేతిహాసంలో - రూపాయి - రూపాల్లో
నల్లకుబేరుల కథలు కోకొల్లలు!
హతవిధీ - పాపాయిల్లా (దో)దాచుకున్నందుకు
పాపాల్లా - పెనుభూతంలా వెంటాడుతున్న సందర్భాలు
తెలుపు నలుపు వర్తమానం - మనిషికి వెతల కథల్నిస్తోంది!!
మార్తున్న ప్రపంచకంలో మొన్నటి బ్రెగ్జిట్‌లు -
ట్రంప్‌కార్డులు చర్విత చరణాలైనాయి

Pages