S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి

07/10/2016 - 00:18

75పేజీలు, వెల:75/-
ప్రతులకు:
కమల కృపామణి
12-129/1, అశోక్‌నగర్,
కొయ్యలగూడెం, పిన్: 534312
ప.గో.జిల్లా. సెల్: 9912131327
**

07/10/2016 - 00:17

ఇదొక అపూర్వమైన, అద్భుతమైన వచన రచన. స్వామి వివేకానంద తన జీవితకాలంలో ఆధ్యాత్మిక, చారిత్రక, సామాజిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశారు. స్వామి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అవన్నీ గ్రంథస్థం అయ్యాయి. కాని శివాజీ గురించి ప్రస్తావించిన ప్రసంగం ఆ సంకలనంలో ఎక్కడా లేదు. ఇది కాకతాళీయమో, మరొకటో తెలియదు.

07/03/2016 - 05:38

వసుమతి డిగ్రీ పూర్తయిన వెంటనే ఓ పెళ్లి సంబంధం వచ్చింది... పెళ్లిచూపులకు వచ్చిన వ్యక్తి ఆనంద్. పవర్ ప్లాంటులో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు
‘అమ్మాయి బాగుంది’ అని ఆనంద్ అనగానే ఇరు కుటుంబాల వారు ఆనందపడ్డారు.
‘మీరు డిగ్రీలో ఏ గ్రూపు’ అడిగాడు ఆనంద్ వసుమతిని.
‘బిఎ స్పెషల్ తెలుగు’ సమాధానమిచ్చింది వసుమతి.
ఆనంద్‌తో పాటు పెళ్లిచూపులకు వచ్చిన వారంతా ఫక్కున నవ్వేశారు.

,
06/27/2016 - 22:18

ఆకాశంలో హాయిగా విహరించాలని ఆశ
పాడు పక్షులు పసికట్టి పోటీ పడతాయని నిరాశ

గళం విప్పి బిళహరినే పాడాలని ఆశ
కబురు తెలిసిన కోయిలమ్మ కంఠం విప్పేనని నిరాశ
నడుము వంచి అడుగువేసి నర్తించాలని ఆశ
నిజము తెలిసిన నెమలి నాట్యమాడేనని నిరాశ

ఆకాశంలో హాయిగా విహరించాలని ఆశ
పాడుపక్షులు పసికట్టి పోటీ పడతాయని నిరాశ

06/27/2016 - 22:13

‘నా దగ్గర ఇక డబ్బు లేదు. బ్రతకటం కూడా అనవసరమేమో’ బాధగా అన్నాడు సుబ్బారావు.
‘అదేంటండీ! విషయం చెప్పకుండా అలా మాట్లాడుతున్నారు... ఒరే చందూ, శిరీష రండి.. మీ నాన్నగారేదో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు’ అంది శాంతమ్మ.
‘ఏంటి నాన్నగారు! ఏమయ్యింది?’ కంగారుగా అన్నాడు చందు.
‘నాన్నగారూ ఒంట్లో బాగుందా’ శిరీష నుదురు తడుముతూ అంది.

06/27/2016 - 22:11

సాధారణంగా కవి జీవితంలో అతి మధురమైన సంఘటనలు - పుస్తకావిష్కరణలు, సమీక్షలు వల్లనే జరుగుతుంటాయి. అదీ ఒక కవి, సమీక్షకుడు మరో కవి పట్ల అతని కవిత్వాన్ని విశే్లషిస్తూ వెలువరించిన పుస్తకం ఇరువురికీ ఉభయతారకంగా లబ్ద ప్రతిష్టతల్ని తీసుకుని రావటం విశేషం.

06/27/2016 - 22:08

అది రిటైర్డ్ ఐఎఎస్ ఆఫీసర్ గారికి కొత్తగా ఏర్పాటు చేసిన కార్యాలయం. పరీక్షల నిర్వహణ మీద వేసిన కమిటీ అది.
ఒక్కొక్కరుగా ఆ గదిలోకి వస్తుండడం వల్ల కాన్ఫరెన్స్ హాలు క్రమంగా నిండసాగింది.

06/19/2016 - 08:15

విజయవాడలో ఓ అడ్రసు కాగితం పట్టుకుని సందుల్లో అపార్ట్‌మెంట్ల పేర్లు చదువుతూ, అలా చూసుకుంటూ తన వేలు విడిచిన మేనమామ ఇంటి కోసం ఎండన పడి తిరుగుతున్నాడు వంశీ.
అమ్మకి దూరపు బంధువైన చలపతిరావుని కలవమని ఆమె ఎన్నాళ్లగానో అతనికి చెబుతోంది. వీలైతే అతన్ని ఒకసారి తీసుకురమ్మని కూడా చెబుతోంది. తీరిక లేక వంశీయే అతన్ని తీసుకురాలేకపోయాడు.

06/12/2016 - 01:11

నోరూరించే
మామిడి పిందెలూ!
విరబూసే వేప పూలు!
శృతి పేయంగా
కోకిలల కుహుకుహూ రావాలు...
ఇవన్నీ! ఒకప్పటి వసంత సంకేతాలు!
ఇప్పుడో!
కుటిల కులమత రాజకీయాలు
భూకబ్జాలూ! కాల్ మనీలూ!
ఇసుక మట్టి మాఫీయాలూ!
లక్షల కోట్ల అవినీతి భాగోతాలూ!
బడాదొరల
బ్యాంకు రుణాలు ఎగవేతలూ!
యాసిడ్ దాడులూ, భ్రూణహత్యలూ!
యూనివర్శిటీ రాజకీయాలూ!

06/12/2016 - 01:09

పుచ్చపువ్వు మోము యనుచు పూజిస్తానని సఖుడా!
దూరవౌచుడుర పిల్లుచు వేధిస్తావేమి సఖుడా!

అమ్మనాన్న మాట కొరకు అగ్నిలోన ముంచే వానను సఖుడా!
కమ్మనైన ప్రేమగ్రోల ఆనాడేమైంది సఖుడా!

నటన జేయుచున్నానని నాకూ కష్టమని సఖుడా!
నలుగు పిండితోన నీవు నలమహారాజు వయ్యావట

దిగులు గుబులు లేక పెండ్లి జరుపుకునే ఓ సఖుడా!
తన స్పర్శ, తన చూపులు, తన మాటలు విను సఖుడా!

Pages