S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర తెలంగాణ

08/06/2017 - 23:52

ఆది నుండి మూగదైన ప్రకృతిని
అనాదిగా కొల్లగొడుతూనే ఉన్నాడీ మనిషి
నది ఒడ్డున వెలసి
నాగరికతలు నేర్చిన
మనిషి ఆ నదులనే మింగేసి
కాలుష్యాన్ని కడవలతో గుమ్మరించి
చేసిన నిర్లక్ష్యానికి ఫలితం
ప్రక్షాళనకి కోట్లు గుమ్మరించినా
తడారిపోయిన నది గొంతు
బీటలు వారిన నదీగర్భం
చివరికంటా ఎండిపోయిన చెమ్మ
ధనం మాయలో కొట్టుకుపోతూ

07/30/2017 - 01:21

‘ఏమండీ బయటికి వెడుతున్నారా? ఆ

పిచ్చిదాన్ని చూడండి... ఎలా ఉందో ఏమో!’

అంటూ సుధీర్‌తో అన్నది రజిత. ‘సరేలే

నేను చూస్తాను. నీవు విశ్రాంతి తీసుకో’

అంటూ సుధీర్ తలుపు దగ్గరగా వేసి

బయటకు వెళ్లాడు.
సుధీర్, రజిత భార్యాభర్తలు. వారికి ఈ

మధ్యనే ట్రాన్స్‌ఫర్ అయింది. సుధీర్

ఉపాధ్యాయుడు. అదే వూళ్లో పని చేస్తాడు.

07/30/2017 - 01:20

ఆకలి శత్రువై
మగారణ్యంలో ‘లేడి’ పిల్లని చేసి
వేటాడుతుంటే
గుప్పెడు మెతుకుల కోసం
జీవశ్చవమైన మనసుతో
దేహాన్ని కామ మృగాలకు
భోజ్యంగా పరుస్తుంది
పొగులుతున్న కన్నీటి ప్రవాహాలను
పౌడరు ఆత్మరుల కింద దాచిపెడుతుంది..
దాడి చేసిన పంటి గాట్లు
పెదవులపై ఎర్రటి మందారాలు పూయిస్తుంటే
బాధను నొక్కిపట్టి
బరువైన నవ్వు పర్వతాన్ని అధరాలపై

07/30/2017 - 01:18

సమాజంలోని సమస్యలే తనను కవయిత్రిని

చేశాయని సవినయంగా ప్రకటించుకున్న

కవయిత్రి వృత్తిరీత్యా మంచిర్యాల జిల్లా

బెల్లంపల్లిలో తెలుగు అధ్యాపకులుగా

పనిచేస్తున్నారు. పాఠకులను రంజింపజేసేలా

కవిత్వం ఉండాలని భావించే ఆమె తన

చిన్ననాటి నుంచే రచనా వ్యాసంగాన్ని

ప్రవృత్తిగా మలచుకున్నారు. తెలంగాణ

ఉద్యమ సమయంలో ఉడుతా భక్తిగా

07/23/2017 - 00:53

బూరుగుపల్లి గ్రామంలో దేవయ్య, కాంతయ్య అనే మిత్రులు ఉండేవారు. కాంతయ్య ఏ పని చేయక కాలం గడిపేవాడు. దేవయ్య మాత్రం ప్రతి రోజు పనికి వెళ్తూ బాగా సంపాదించుకునేవాడు. దేవయ్య తను పని చేసుకుంటూనే, మిత్రునికి పనిచేసుకోవాలని చెబుతుండేవాడు. కాంతయ్య దేవయ్య చెప్పేది ఏమాత్రం వినక నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడు.

07/23/2017 - 00:52

సాహిత్య అకాడమీ ఏర్పాటుతో తెలంగాణ భాషా పరిమళాలు విశ్వవ్యాప్తి చెందుతాయని అభిప్రాయపడే ప్రముఖ కవి, సమీక్షకులు రమణ వెలమకన్ని గారి జన్మస్థలం సికింద్రాబాద్‌లోని జీరా. ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో నలుబది సంవత్సరాలు పనిచేసి.. చీఫ్ మేనేజర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. ‘రమణ వెలమకన్ని’ కలం పేరు.. అసలు పేరు వెలమకన్ని సత్యనారాయణ మూర్తి..

07/23/2017 - 00:51

వృత్తిరీత్యా తెలుగు పండితులైన అమరవాది రాజశేఖర శర్మ రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా మలచుకొని.. ‘ప్రబోధ గీతమాలిక’ పేరుతో చతుషష్టి గీతాలను పాఠకులకు అందించారు. అమ్మ జన్మనిస్తే..

07/23/2017 - 00:49

అమ్మంటే..
ఆప్యాయతానురాగాల ప్రోది
ఇలపై వెలసిన ఆరాధ్యదైవం
తాపోపశమనార్థం వీచే
చల్లని ప్రభాత పవనాంకురం
త్యాగానికి తల్లివేరు
నిస్వార్థానికి మరో పేరు
తనవాళ్ల సంక్షేమార్థం
హరించుకుపోయే హారతి కర్పూరం
అమ్మంటే అనిర్వచనీయమైన
ఓ మధుర స్పర్శ!
బిడ్డలే నగలుగా
భవబంధాలే పసుపు కుంకాలుగా
ఐదవతనమే ఆహార్యంగా

07/16/2017 - 01:42

‘సుధీర్ లే, లేరా! ఏమిట్రా ఈ మొద్దు నిద్ర.. లే..’
పెళ్లి చూపులకు వెళ్లాలని చెప్పాను కదా!
‘అమ్మా నేను రాను. మీరు అక్కడికి తీసుకువెళ్తారా? తీరా అక్కడికి వెళ్లాక, అక్కడ చూస్తే ఆ అమ్మాయిలు మోడ్రన్ అమ్మాయిలుంటారు. మీకు చెప్పాను కదా, నాకు సంప్రదాయబద్ధమైన తెలుగుదనం ఉట్టిపడేలా ఉండే అమ్మాయి కావాలని’
అలాంటి అమ్మాయిలు ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతారురా అంటుండగానే,

07/16/2017 - 01:40

వాస్తవాల కోట తలుపులు
మూతపడగానే
స్వప్న సౌధల దర్వాజా
ముంగిట వాలిపోతాను
నాకే తెలియని నా ఆలోచనలు
మెదడు మూలలు పెకిలించుకుని
బయటపడటం మొదలెడతాయ్
ఏవేవో రూపాలు సంతరించుకుంటూ
నాముందవి తిరుగాడుతుంటే
సంభ్రమంగా చూస్తూ ఉంటాను
ఆ పాత్రలు కొన్ని చిరపరిచితాలు
మరికొన్ని అపరిచితులు
ఎప్పుడు రూపుదిద్దుకున్నాయో
రెప్పల వాకిలి మూయగనే

Pages