S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం

11/12/2016 - 23:24

మీరు అక్షరాలను కవితగా కూర్చేవేళ
నేను దీనుల కన్నీటిని తుడవ చూస్తాను
మీరు మనసును మధించి కవిత రాసేవేళ
నేను రోగుల కన్నులలో ఆనందమై నిలుస్తాను
మీరు వేదికలపై కవితాగానం చేసే వేళ
నాలోకి నేను తొంగి చూస్తూ
నన్ను నేనే వెతుక్కుంటాను
మీరు కవులుగా భుజకీర్తులు తగిలించుకున్న వేళ
నేను మనిషిని అని దృఢంగా చెప్పుకుంటాను
సందేహం లేదు మీరు గొప్పవారు

11/12/2016 - 23:21

‘‘రాజా! ఆ ఇన్స్‌పెక్టర్ ఓసారి కనిపించి వెళ్లమన్నాడు’’
‘‘వెళతానమ్మా’’ విసుక్కుంటూ అన్నాడు రాజు.
‘‘అలా కాదురా వాళ్లొచ్చారంటే మనం వెళ్లి మాట్లాడాల్సిందే. లేకపోతే రోజూ ఏదో ఒక గొడవ’’
‘‘అలాగేలే’’ అన్నాడు ఆటో బయటికి తీస్తూ.
ఆటో స్టార్ట్ అయింది. దాంతో పాటే సెల్‌ఫోనూ.

11/06/2016 - 08:46

ప్రజాపతిశర్మ హుషారైన కుర్రాడు. ఊర్లో మంచిపేరు, పలుకుబడి ఉన్న యువకుడు. మంచి మాటకారి, స్నేహశీలి. అతనికి ఉద్యోగం చేయడం కంటే వ్యాపారం చేయడమంటేనే ఇష్టం. ఎప్పటికైనా బిజినెస్‌లో వెల్‌సెటిల్డ్ పర్సన్‌గా పేరు, పైసలు సంపాదించుకోవాలని కలలు కంటూ ఉండేవాడు. అగ్రవర్ణానికి చెందిన శర్మని అందరూ అనుకోకుండానే గౌరవిస్తుండేవారు. శర్మ చిన్నచిన్న వ్యాపారాలు మొదలుపెట్టాడు. కొన్నాళ్లు అన్ని వ్యాపారాలు చక్కగా నడిచాయి.

10/29/2016 - 22:24

పంచభూతాల సాక్షిగా
ముక్కోటి దేవతలు ఆనందిస్తుండగా
గ్లోబల్ గేము మాయలో చిక్కుకుని
మహాసరదాగా ముందుకు దూసుకుపోవాలని
ఆరాటపడుతున్న ఓ నేటి మానవుడా...
ఒక్కసారి కళ్ళు తెరువు
ఆట ఆపి నిన్ను నువ్వు చూసుకో
వానపాముల్లా మెల్లగా నీప్రక్కన
కాస్త నీడ కోసముచేరి,
కొండ చిలువల్లా బలిసి
నిన్ను మింగటం కోసం ఆరాటపడుతున్నాయి
ఆదమరిచి ఆటలో మునిగిపోయావో

10/29/2016 - 22:20

ఇందిరకి కొద్ది రోజులుగా ఒంట్లో బాగుండడంలేదు. ఇంట్లో తండ్రికి, చెల్లెలికి అన్ని పనులూ చేసి, వండి పెట్టి స్కూలుకెళుతోంది, వస్తోంది కానీ ఏదో నలతగా ఫీలవుతోంది.
తన క్లాస్‌మేట్ లలిత డాక్టరుగా చేస్తోందని ఆ మధ్య కనిపించి చెప్పింది. చెకప్‌కి తన దగ్గరకి వెళదాం అనుకుంది. భీమిలిలోని ఆమె ఆసుపత్రికి వెళ్లింది.

10/29/2016 - 22:15

గ్రంథాలయాలు వౌన విశ్వవిద్యాలయాలు. చైతన్య స్ఫూర్తికి, విజ్ఞానానికి, వికాసానికి గ్రంథాలయాలు సోపానాలు. గ్రంథాలయోధ్యమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా గ్రంథాలయ సంఘం తాజాగా ప్రచురించిన ‘గ్రంథాలయ కుసుమాలు’ కవితా, కథా సంకలనం ఆకట్టుకుంటుంది. మహమ్మద్ రఫీ ( ఈవేమన), డబ్బీరు శ్రీనివాసరావు సంపాదకత్వాన విడుదలైన ఈ పుస్తకంలో 35 కవితలు, 7 కథలకు స్థానం కల్పించారు. పాఠశాల విద్యార్థుల రచనలకు ప్రోత్సాహం కల్పించారు.

10/23/2016 - 04:45

సమీప బంధువు మరణవార్త సుందరాన్ని ఎంతగానో కలసివేసింది. అవును చావు ఎన్నో రకాలు. ఇంట్లో, వీధిలో, పూజగదిలో, ఆక్సిడెంట్‌లో, మనమెవరో గుర్తు పట్టలేని చోట... ఎన్నో ఎనె్నన్నో...

10/17/2016 - 23:58

నాగావళి నదొడ్డున ఉన్న గ్రామం అది. పేరు కరజాడ. ఆ వూర్లోని గ్రామీణ బ్యాంకు అది. దానికి మేనేజరుగా వరప్రసాద్ బదిలీపై వచ్చాడు. వచ్చీ రావడంతోనే బ్యాంకులో పాత రుణాలు ఇంకా ఎవరెవరు చెల్లించారో లేదో అని ఓ లిస్టు ముందేసుకు పరిశీలిస్తున్నాడు. పాతబకాయిల వసూలులో అశ్రద్ధగా ఉంటే ప్రధాన కార్యాలయం వారు పీక్కు తినేస్తారు. అందుకే ఆ బ్యాంకు శాఖలో ఉన్న ముదరా కేసుల్ని వరప్రసాద్ పరిశీలించడం మొదలుపెట్టాడు.

10/17/2016 - 23:53

చీపురుపట్టుకుంటే ఊడిచినట్టుకాదు
ఫోటోకు ఫోజిస్తే శుభ్రం చేసినట్టు కాదు
ఒళ్ళువంచితే పని అవుతుంది
అసలు పనిచేస్తేనే సార్థకం అవుతుంది

ఫోటోకల్చర్ మానేద్దాం
చేసేదేదో చిత్తశుద్ధితో చేద్దాం
మొక్కుబడి తంతుమనకొద్దు
ప్రచార ఆర్భాటాలు అసలే వద్దు

నాయకులు వెళ్ళిపోగానే
వెంటనే జనం వెళ్ళిపోతారు
తంతు పూర్తి అవగానే
ఎక్కడని అక్కడ వదిలేస్తారు

10/17/2016 - 23:49

ఇటీవల విడుదలైన ‘మా దేవుడు మీరే మాస్టారు’ సంపుటి మంచి పుస్తకాల జాబితాలో చేరుతుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రముఖ దాతగా, విద్యా ప్రదాతగా మొత్తం 34 అవార్డులు అందుకున్న ఓ ప్రధానోపాధ్యాయుడు మెండ తవుడు మాస్టారి జీవితం గురించి ఈ పుస్తకంలో పొందుపరిచారు.

Pages