S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం

10/09/2016 - 07:18

జూలై నెల 15వ తేదీ. రోజులానే ఈరోజు కూడా మళ్లీ బస్ మిస్ అయింది. తర్వాత వచ్చిన బస్సు ఎక్కి ఒక ఖాళీ సీట్లో కూర్చున్నాను. ఇంతలో ‘‘ఎక్స్‌క్యూజ్‌మీ’’ అని ఓ తీయటి గొంతు వినిపించి తిరిగి చూశాను.
పసుపు చుడీదార్‌లో ఉన్న ఒక అమ్మాయి నిలబడి ఉంది.
విండో సీటు చూపిస్తూ ‘‘కెన్ ఐ...’’ అంది. ‘‘యా’’ అని నేను పక్కకి కూర్చున్నాను. తను నన్ను దాటుకుంటూ వెళ్లి కూర్చుంది.

10/02/2016 - 05:23

‘‘మా నాన్న చనిపోయే ముందు మీ నాన్నకి ఏం చెప్పారు?’’ అడిగాడు రాంప్రసాద్ భార్య కౌసల్యని.
‘‘నేను విన్నానా’’ అంది కౌసల్య.
‘‘నాకు తెలియాలి అది’’
‘‘అయితే మా నాన్నని అడగండి’’
‘‘మీ నాన్న నిజం చెబుతాడని అనుకోను’’
‘‘అయితే ఊరుకోండి’’
‘‘నీ జవాబేం బాలేదు’’ కోపంగా అన్నాడు రాంప్రసాద్.
‘‘నాకు తెలియని విషయం అడిగితే జవాబిలాగే ఉంటుంది మరి’’

09/27/2016 - 22:05

విజయకాహళులు మిన్నుముట్టి
విజయలక్ష్మి నన్ను వరించిన నాడు
అసూయా దృక్కులు
కాటేయ చూస్తే
ఆనందంగా భరిస్తాను!
విశ్వమంతా నిండిన జ్యోత్స్నలా
యశస్సు ధరణి నిండిన నాడు
నిశీధి నన్ను చుట్టేసేలా చూస్తే
రవిలా, ప్రధభల తరిమేస్తాను.
ఆమనిని ఎరబూయు తరవులా
ఫలములు, తేనెలు పంచునపుడు
ప్రళయ ఝంఝూమారుతం వీచితే
ఇలపైని బలంగా, నిలదొక్కుకుంటాను.

09/27/2016 - 22:00

సిద్ధూ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.
జీతం మన కరెన్సీలో చూసుకుంటే లక్షల్లో ఉంటుంది. మంచి రూపం, రంగు ఉండడంతో మంచి సంబంధమే వచ్చింది. అమ్మాయి కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా అమెరికాలోనే పని చేస్తోంది.

09/27/2016 - 21:55

ప్రాప్తిస్థానం
వెల: ఇండియా-రూ. 279.00
విదేశాల్లో- పది (డాలర్లు)
పిఎల్ నారాయణరావు,
డో.నెం. 43-7-32/1,
గణేష్‌సాయి కార్తికేయ
అపార్టుమెంట్సు,
ప్లాట్ నెం. 101, ‘శ్రీరామ మారుతి’,
రైల్వే న్యూకాలనీ, విశాఖపట్నం-16,
ఫోన్-0891-2561603,
సెల్: 9550294395.
***

09/27/2016 - 22:08

కవి, ఉపాధ్యాయుడు ఒక్కడే అయితే అతని రచనా సంవిధానం, పామర రంజకంగా, విద్యార్థులకానందదాయకంగా ఉంటుంది. పాటైనా, కవితైనా సామాజిక స్పృహ ఉంటే అది నలుగురి నాల్కలపైన నాటుతుంది. సభల్లో కవితా పుష్పాలనందిస్తుంది.

09/18/2016 - 20:55

హీరోలు, రాజకీయ నాయకులు, కార్పొరేట్ ఉద్యోగస్థులు ఊర్లు దత్తత తీసుకోవడంతో హీరో ప్రశాంత్ మీద ఒత్తిడి పెరిగింది.

09/11/2016 - 08:12

‘‘చక్రపాణిగారు నమస్కారమండీ’’ అంటూ పట్ట్భా వచ్చి ఆయన ముందు కూర్చున్నాడు.
చక్రపాణి చిరు మందహాసంతో పట్ట్భాని చూశారు. పట్ట్భా అందరికీ తలలో నాలుకలాంటివాడు. ఆ హోమ్‌లో అడ్మినిస్ట్రేషన్, ఆఫీసు పనంతా తనే చూసుకుంటుంటాడు.

09/03/2016 - 23:38

మధు బెంగళూరు నుండి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో వస్తోంది. దాన్ని రిసీవ్ చేసుకోవడానికి స్టేషనుకి వెళ్లాను. అసలే ఎండాకాలం. ఉక్కపోతగా ఉంది. వేడిగాలులు వీస్తున్నాయి. బెంగళూరులోని చల్లని వాతావరణాన్ని వదిలిపెట్టి ఇక్కడికి మధు రావడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది.

09/03/2016 - 23:36

ఒకనాటి మా ఊరి చెరువది
సందళ్లు సరదాలకు నెలవది
నాలుగు దిక్కుల గట్లు
ఒడ్డు చుట్టూతా చెట్లు
నిండుగా చెరువెపుడు నీటితో గలగల
బిందెలు పెరుగుతూ పడుచుల కళకళ
ఆనాటి మనుషులు పల్లె చెరువెంతో నిర్మలం
చెరువు గట్టున కూచుంటే మనసుకు కలిగేది నిమ్మళం
చెట్లపై పక్షులు, నీటిలో చేపలు
కుర్రాళ్ల ఈతలు, వీచేటి గాలులూ
మదికెంతో ముదమిచ్చు మధురానుభూతులు

Pages