S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం

03/23/2016 - 02:09

విశాఖపట్నం, మార్చి 22: 2016-17 ఆర్ధిక సంవత్సరానికి రూ.10,340 కోట్లతో జిల్లా వార్షిక ప్రణాళిక ఖరారైంది. ప్రాధాన్యతా రంగానికి రూ.7,840 కోట్లు, ప్రాధానే్వతర రంగానికి రూ.2500 కోట్లను కేటాయిస్తూ రూపొందించిన ఈ ప్రణాళికను కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ మంగళవారం విడుదల చేశారు.

03/23/2016 - 02:08

విశాఖపట్నం, మార్చి 22: వచ్చే మూడు నాలుగు రోజుల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, వాతావరణశాఖ హెచ్చరించిన దృష్ట్యా ఎండ సమయంలో సాధ్యమైనంత మేరకు బయట ప్రయాణాలను నివారించుకోవాలని కలెక్టర్ డాక్టర్ యన్.యువరాజ్ సూచించారు. మఖ్యంగా వృద్ధులు, పిల్లలు, ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. జిల్లాలోని తహశీల్దార్లు, ఎండిపిడిఓలను ఇప్పటికే అప్రమత్తం చేసామన్నారు.

03/23/2016 - 02:07

విశాఖపట్నం, మార్చి 22: విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఖచ్చితంగా వస్తుందంటూ ఇప్పటికీ రైల్వే చెబుతోంది. అయితే దీనికి మరో కొత్త మెలికి పెట్టింది. రైల్వేజోన్ రావాలంటే ఈస్ట్‌కోస్ట్‌రైల్వే, దక్షిణమధ్య రైల్వే జోన్లను విభజించాల్సి ఉందట. ఇది జరిగితే తప్ప జోన్ ఏర్పాటుకు మార్గం సుగమం కాదంటూ కొత్త వంత పాడుతోంది.

03/23/2016 - 02:06

విశాఖపట్నం, మార్చి 22: సూర్యుడు మండుతున్నాడు. వేసవి ఆరంభంలోనే తన ప్రతాతాన్ని చూపుతున్నాడు. దీంతో జనం విలవిల్లాడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పుల మృతులు నగరవాసులను బెంబేలెత్తెలా చేస్తోంది. ఇప్పటి నుంచే ఎండల తీవ్రతతో శరీరం మండిపోవడం, వేడిగాలులను ఎదుర్కోవాల్సి వస్తోంది. రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

03/23/2016 - 02:05

విశాఖపట్నం, మార్చి 22: చాలాకాలం తరువాత నర్సుల పోస్టులు భర్తీ అవుతున్నాయి. అయినా ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోతోంది. వాస్తవానికి కేజిహెచ్‌లో దాదాపు 1500 మంది నర్సులు ఉంటే తప్ప రోగులకు సేవలందించలేరు. ఒక్క ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఒడిషా, చత్తీస్‌గడ్, రాయగడ, మధ్యప్రదేశ్ తదితర చోట్ల నుంచి దీర్ఘకాలిక రోగాలతోపాటు వారంతా తరలివస్తుంటారు.

03/23/2016 - 02:05

విశాఖపట్నం, మార్చి 22: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని తరచూ ఆర్టీసీ అధికారులు ప్రచారంతో హోరెత్తిసుంటారు. ప్రయాణికులకు సౌకర్యాల కల్పనకు అన్ని చర్యలు తీసుకుంటామని చెపుతుంటారు. కానీ నగర పరిధిలో ఆర్టీసీ సేవల తీరుపై ప్రయాణికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల అవసరాలకు తగిన విధంగా సిటీ బస్‌లను, అవసరమైన వేళల్లో నడుపుతున్న తీరు తెలిసిందే.

03/23/2016 - 02:04

విశాఖపట్నం, మార్చి 22: నౌకాదళంలో సుదీర్ఘకాలం సేవలందించిన విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విరాట్‌ను విశాఖ తీరానికి రప్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై నౌకాదళంతో పూర్తి స్థాయిలో చర్చించిన ప్రభుత్వం స్పష్టమైన హామీని పొందింది.

03/23/2016 - 02:03

విశాఖపట్నం, మార్చి 22: రాజధాని నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రభుత్వం అవసరమైన ఇంజనీరింగ్ అధికారుల నియామకాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది.

03/20/2016 - 00:03

నర్సీపట్నం: న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీకి వెళ్ళకుండా అడ్డుకోవడాన్ని నిరశిస్తూ వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ ఆందోళన నిర్వహించారు. శ్రీకన్య కూడలి నుండి వైకాపా నాయకులు, కార్యకర్తలు ఊరేగింపుగా అబీద్ సెంటర్‌కు చేరుకుని అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పార్టీ నియోజకవర్గం కన్వీనర్ పెట్ల ఉమాశంకర్ గణేష్ పూలమాలలు వేసి నివాళ్ళులర్పించారు.

03/20/2016 - 00:02

కె.డి.పేట: గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో నిర్మించ తలపెట్టిన సి.సి. రోడ్ల నిర్మాణాలు గడువు నెలాఖరులోగా ముగుస్తుండడంతో లేబర్ దొరక్క తగినంత మెటీరియల్ అందక ఇటు కాంట్రాక్టర్లు, అటు ఇంజనీరింగ్ అధికారులు పరుగులు తీస్తున్నారు. దీంతో గ్రామాల్లో సి.సి. రోడ్లు వేసేందుకు నిధులుండి ఖర్చు చేయలేని పరిస్థితి ఏజన్సీ, మైదాన ప్రాంతాల్లో చోటు చేసుకుంది.

Pages