S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం

12/29/2015 - 07:56

చోడవరం, డిసెంబర్ 28: అగ్రికల్చరల్ హబ్‌గా చోడవరం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజుతో కలసి స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ, ప్రేమసమాజం వద్ద గల రైతుబజార్‌లో సందర్సించి అక్కడి పరిస్థితులను అధికారులను, వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు.

12/29/2015 - 07:55

పాడేరు, డిసెంబర్ 28: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం ఇచ్చిన అన్ని రకాల అనుమతులను రద్దు చేయాలని కోరుతూ ఐ.టి.డి.ఎ. పాలకవర్గ సమావేశం తీర్మానం చేయాలని ప్రజాప్రతినిధులు పట్టుబట్టారు. బాక్సైట్ అంశంపై ప్రజాప్రతినిధుల నిరసనలతో పాలకవర్గ సమావేశం దాదాపు గంటన్నర సేపు స్థంభించిపోయింది. స్థానిక కుమ్మరిపుట్టు యువజన శిక్షణ కేంద్రంలో కలెక్టర్ యువరాజు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ఐ.టి.డి.ఎ.

12/29/2015 - 07:55

విశాఖపట్నం, డిసెంబర్ 28: పాత ఆటోలకు డిజిటల్ మీటర్లు పెట్టాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా ఆటోరిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు.

12/29/2015 - 07:54

విశాఖపట్నం, డిసెంబర్ 28: రాష్ట్రంలో పంచాయతీరాజ్ ద్వారా చేపడుతున్న సిసి రోడ్లు, అభివృద్ధి పనులను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు అధికారులను ఆదేశించారు. రోజుకు మూడు కిలోమీటర్ల రోడ్లను వేయడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు.

12/29/2015 - 07:53

విశాఖపట్నం, డిసెంబర్ 28: రాష్ట్రంలో వివిధ గ్రామాల్లో పారిశుద్ధ్యం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలపై అవగాహన పెంపొందించేందుకు మంగళవారం విశాఖ జెడ్పీలో రాష్ట్ర స్థాయి వర్క్‌షాపు నిర్వహించనున్నారు. ఈ వర్క్‌షాపులో స్వచ్ఛ భారత్‌పై అవగాహన కల్పించేందుకు డిల్లీ నుంచి ఐదుగురు సీనియర్ ఐఎఎస్ అధికారులు వస్తున్నారు.

12/27/2015 - 07:41

చోడవరం, డిసెంబర్ 26: ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కొత్త సంవత్సరంలో కీలక నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వెల్లడించారు. శనివారం కొణతాల మాడుగుల మండలం వెళుతున్న సమాచారం తెలుసుకున్న అభిమానులు ఆర్టీసి కాంప్లెక్స్ సమీపంలో రహదారిపై నిల్చుని ఆయన రాకకోసం ఎదురుచూస్తున్నారు. ఇది గమనించిన కొణతాల కారు దిగి వారి వద్దకు వచ్చి అభిమానులను పరామర్సించారు.

12/27/2015 - 07:40

నర్సీపట్నం, డిసెంబర్ 26: జన్మభూమి- మావూరు కార్యక్రమంలో రాష్ట్రంలో 44 లక్షల మందికి ఫించన్లు పంపిణీ చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. శనివారం తన స్వగృహంలో నియోజకవర్గ స్థాయి సమన్వయకమిటీ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పనితీరును సమీక్షించారు.

12/27/2015 - 07:40

విశాఖపట్నం, డిసెంబర్ 26: ఎంతో ఆర్భాటంగా ఇస్తున్న చంద్రన్న క్రిస్మస్ కానుకల సరఫరాలో డొల్లతనం సాక్షాత్తు మంత్రి గంటా శ్రీనివాసరావు కళ్ల ముందు సాక్షాత్కరించింది. క్రిస్మస్ కానుకగా నిత్యావసర వస్తువులను ఉచితంగా అందజేస్తున్న ప్రభుత్వం వాటి సరఫరా తీరుపై పెద్దగా దృష్టి సారించలేదు. అయితే జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు చంద్రన్న క్రిస్మస్ కానుక సరఫరాపై వస్తున్న ఫిర్యాదులపై స్పందించారు.

12/27/2015 - 07:39

విశాఖపట్నం, డిసెంబర్ 26: జన్మభూమిలో ప్రజలను భాగస్వాములను చేసి విజయవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాప్రతినిధులకు, అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన వీడియో కానె్ఫరెన్స్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు, జెసి నివాస్, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావులు పాల్గొన్నారు.

12/27/2015 - 07:38

విశాఖపట్నం, డిసెంబర్ 26: విశాఖ నగరంలో శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీన ప్రారంభమైన మార్గశివ మాసోత్సవాలు 15వ రోజుకి చేరుకున్నాయి. శ్రీ అమ్మవారి పంచామృతాభిషేకం, శ్రీ చక్రనవవర్ణార్చన విశేష కంకుమపూజ, శ్రీ లక్ష్మీపూజ, వేదపారాయణ, సప్తశతీపారాయణ, లక్ష్మీహోమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శ్రీ అమ్మవార్ని దర్శించుకున్నారు.
* సాంస్కృతిక కార్యక్రమం

Pages