S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం

07/15/2017 - 23:50

‘‘నాన్నా మా ఆయనకు చెక్ చెప్పేశా. మరి నేను వెళ్లేది లేదు’’ అంటూ ఉరుము లేని పిడుగులా నా కూతురు చెప్పిన వార్త విని బిత్తరపోయాను.
‘‘అదేమిటే అమ్మడూ ఆ మాటలు’’ అంటూ వంట గదిలో నుండి బయటిచి వచ్చిన నా భార్యకు ‘‘నువ్వు మరేం మాట్లాడకమ్మా నీకేం తెలియదు’’ అంటూ నా కూతురు గదిలోకి పోవడంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం.
దాని తీరుకు మీరే కారణం అన్నట్లు నా భార్య ఒకసారి నా వైపు చూసింది.

07/15/2017 - 23:49

మానవజాతి మనుగడకు వాల్మీకి మహర్షి అందించిన అపురూపమైన ఆదికావ్యం రామాయణం. లోకంలో దాదాపు అందరికీ ఈ కావ్యం పరిచయమే. అయితే, రామయణంలో నాయకుడు శ్రీరాముడైతే, అంతటి ప్రాధాన్యం గలవాడు ఆంజనేయుడు! రామాయణంలోని బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండలలో హనుమాన్ సంగతి కనిపించదు. మొదటిగా కిష్కంధకాండలో ప్రారంభమవుతుంది.

07/09/2017 - 01:29

మటన్‌కొట్టు మస్తాన్ తన పదునైన కత్తితో దడదడా మాంసాన్ని కొట్టేస్తున్నాడు. అతగాడి పనితనాన్ని పరికిస్తూ తన తోకాడిస్తూ నాలుక బయటకు వదిలేస్తూ, కళ్ళప్పగిస్తూ చూస్తోంది కనకమనే శునకం. మస్తాన్ తనకు అవసరం లేని అడుగూ మడుగూ, దుమ్ము, వ్యర్థమూ దానికి గిరవాటెట్టడం, దానిని చకచకా నోట కరుచుకొని పారిపోవడం జరుగుతూ ఉంటాయి. అప్పుడు గట్టిగా పిక్కున్న కుక్కకే కక్క ముక్క చిక్కుతుంది.

07/09/2017 - 01:27

ఇంటికెపుడు గుంటు ఒంటి వ్యాధికి రట్టు
మడికి గట్టు పలుకుబడికి విట్టు
మీటు వీణకేమొ మెట్టు టార్గెట్టురా
నారిలేని విల్లు నారియు లేనట్టి
ఇల్లు వ్యర్ధములుర ఎంచి చూడ
విల్లు కన్న గొప్ప థ్రిల్లు ఇల్లురా
ఇంటిలోన ఎపుడు ఈగల మోతయే
పల్లకీల మోత బయట చూడ
అడరు ఉగ్రవాద మెడ పెడ మోతరా
ప్రార్థనంబు చేయు పైపై పెదవి కన్నా
సాయమిచ్చునట్టి చేయి మిన్న

07/09/2017 - 01:26

సాహితీవనంలో జీవిస్తున్న విశాఖపట్నంకు చెందిన రచయిత అడపా రామకృష్ణ ఆధ్వర్యంలో వెలువడిన మరో సంపుటి ‘సాహితీ ఉద్యమంలో కరదీపికలు’. ఉత్తమమైన కవితలు, కథలు, కథానికలు ఏర్చి ఒక సంపుటిలో వెలువరించడం రివాజు. అలాగే అప్పుడప్పుడు వ్యాసాలు వస్తుంటాయి. ఇలానే.. తాజాగా రామకృష్ణ కూడా అటువంటి పనిచేశారు. వివిధ దిన, వార తదితర పత్రికల్లో వెలువడిన వ్యాసాలను ఇందులో పొందుపరిచారు.

07/09/2017 - 01:25

అమరవీరుల దినోత్సవం నాడు భర్త ఫొటోకు పుష్పాంజలి ఘటించి తదేకంగా ఫొటోను చూస్తూ ‘ఏమండీ మీ ఆశయ సిద్ధికోసం నేను నిరంతరం శ్రమిస్తున్నాను. మీరు మమ్ము వీడి పైలోకం చేరినా, మీ ఆశయాలు మా హృదయాలలో వికసిస్తున్న కమలాలే. పెద్దవాడు భరత్ కర్షకునిగా నాలుగు నోళ్లకు ఇంత ముద్ద పెట్టగలగుతున్నాడు.

07/09/2017 - 01:24

బలివాడ కాంతారావు స్మారక జయంతి-2017 సందర్భంగా విశాఖపట్నంలో భారతనిధి ఫౌండేషన్ ఛైర్మన్ డి. ఎస్.వి. గోపీకృష్ణ, విశాఖ రచయితల సంఘం, విశాఖ మాసపత్రిక సంయుక్తంగా బలివాడ కాంతారావు రచనలపై నిర్వహించిన సమీక్ష/వ్యాసరచన పోటీల ఫలితాలను విశాఖ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి అడపా రామకృష్ణ తెలిపారు.
పోటీ విజేతలకు
రూ. 15 వేలు చొప్పున నగదు బహుమతి

07/03/2017 - 00:59

‘‘బాబాయ్ జానకి ఎలా ఉంది? దాన్ని చూసి చాలా కాలం అయింది. ఇక్కడికి వస్తూ ఉంటుందా?’’ జానకి తండ్రి శంకరం గారిని అడిగాను సంక్రాంతి పండగకి మా వాళ్లింటికి వచ్చిన నేను.

07/03/2017 - 00:57

వాడెప్పుడో చిన్నప్పుడు కనిపించాడు
మళ్లీ అదేదో ఫంక్షన్లో కనిపించాడు
క్లాస్‌మేటని పేరే గాని
చదువు పూర్తయ్యాక కనిపించనేలేదు
జీవితాల్లోకి పేజరొచ్చింది
అయినా సందేశాల్లేవు
మొబైల్ ఫోనొచ్చింది
అయినా మాటల్లేవు
ఫేసు బుక్కొచ్చింది కానీ
వాడి ఫేసు కనబడదు
ట్విట్టరొచ్చింది
వాడు తప్ప ప్రపంచమంతా
ఏం చేస్తుందో చెప్తాడు

07/03/2017 - 00:56

కవి జాని తక్కెడశిల మనసులో తనెలా అనుకుంటే అలా పదాల అమరికతో కవితలల్లారనే చెప్పాలి. ఎందుకంటే ఏభై ఒక్క కవితల కదంబమాల అంటే రంగు రంగుల పుష్పాల మాలనే కదంబ మాటల అంటారు. అలాగే రకరకాల కవితా వస్తువులతో అల్లిన కదంబ కవితా సంపుటి ఈ అఖిలాశ.

Pages