S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం

06/11/2017 - 02:18

పేద గుండె ప్రమిదలు (మనోగీతికలు)

05/13/2017 - 23:50

కులమేరా మన బలం, కులమేరా మన ఆయుధం, కులమే మన సర్వస్వం... ఇవీ సంగమేశు నిత్యం జపించే మంత్రాలు. చదువు, సంస్కారం పక్కన పెట్టి ఉద్యోగం చేస్తున్నామనే ఇంగితం విడిచి ఇరవై నాలుగు గంటలూ కుల నామస్మరణలో మనుషుల మధ్య ఉండే అనుబంధాలు, ఆప్యాయతలను కుల జపంతో ఆవిరి చేస్తున్నాడు. పని చేస్తున్నది మండల రెవెన్యూ కార్యాలయంలో.

04/30/2017 - 03:02

పదవ తరగతి సోషల్ క్లాస్ జరుగుతోంది. సూర్య కుటుంబం కోసం, పాఠానికి సంబంధం లేకపోయినా, స్వప్న టీచర్ చెబుతుంటే విద్యార్థులంతా చక్కగా వింటున్నారు.
‘‘మీలో ఎవరైనా ఎప్పుడైనా వెనె్నల్లో విహరించారా?’’
పిల్లలందరూ అడ్డంగా తలూపారు లేదన్నట్లు.

04/30/2017 - 02:59

భానుడు భగ్గుమంటున్నాడు
భానుడి ప్రతాపానికి అల్లాడుతున్నారు జనం
నీళ్ల దర్శనం కానలేం
నింగి వైపు చూస్తుంటాం
పాదరక్షలు లేకుంటే
పుడమిపై నడవలేం
ఆరంభంలోనే ఆదిదేవుడు
కురిపిస్తున్నాడు ఆగ్రహం
భరించలేకున్నారు
భువిన జనం
కొండలు కోనలు
అగ్నిశిఖలవుతున్నాయి
గిరిజనం తాపంతో అల్లాడుతున్నారు
గుక్కెడు మంచినీళ్ల కోసం

04/30/2017 - 02:52

ఉగాది సందర్భంగా టివిలో ఒక మంచి ప్రోగ్రాం జరుగుతుంది. రామాయణంలో నుండి కొన్ని సన్నివేశాల్ని తీసుకుని వాటిని హాస్యం జోడించి చాలా చక్కగా ఒక్కొక్కరూ చెప్పసాగారు. పది సంవత్సరాల రాధిక కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని అందరినీ ఆకట్టుకుంది. ప్రోగ్రాం అయిపోయింది. అందరూ బయటికి వస్తుంటే ప్రోగ్రాం మేనేజర్ రాధికని చూసి ‘‘చాలా బాగా చెప్పావమ్మా. నీకు రామాయణం అంతా ఇంత చక్కగా ఎవరు నేర్పారు?’’ అంటూ అడిగాడు.

04/26/2017 - 20:37

శేషగిరి, నేను మంచి స్నేహితులం. రిటైర్ అయిన తర్వాత నేను విజయనగరంలో స్థిరపడితే వాడు విజయవాడలో సెటిలయ్యాడు. వాడి కూతురి పెళ్లికి వెళ్లిన నేను తిరుగు ప్రయాణమయ్యాను.
రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కాస్త అలసటగా ఉంది. నేను మా వూరికి చేరుకునే సరికి సాయంత్రం అయిపోయింది. శీతాకాలం కావడం వల్ల అయిదు గంటలకే చీకట్లు ముసురుకోవడం ప్రారంభం అయింది.

04/16/2017 - 03:08

సాహితీపరులకు చర్చా వేదికై, గొప్ప గొప్ప సాహితీవేత్తలకు స్ఫూర్తినిచ్చి, మహిళల్లో సామాజిక చైతన్యం నింపి, విశాఖపట్నంలో ఓ ‘సాహితీ చిహ్నం’గా నిలిచిన ‘ది హిందూ రీడింగ్ రూం’ (హిందూ పఠన మందిరం) వర్తమానంలో ఏ స్థాయిలో ఉందో గమనించినవారికి ‘ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహముల’నే కవి వ్యాఖ్యానం స్ఫురణకు రాకతప్పదు.

04/16/2017 - 03:02

1962, 63, 64 సంవత్సరాల్లో ఎయులో చదువుకునే రోజుల్లో రీడింగ్ రూంకు వెళ్ళాను. ఇతిహాసాలపై పరిశోధన చేసేందుకు అక్కడి పుస్తకాలు ఎంతో ఉపకరించాయి. విశాఖనగరంలో ప్రాచీన, ప్రసిద్ధి చెందిన గ్రంథాలయం ఇది. అప్పట్లో ఇదే గొప్పది. ఎటువంటి పుస్తకమైనా రీడింగ్ రూంకు వెళ్తేనే దొరికేది. కొన్ని పుస్తకాలు ఫస్ట్ ఎడిషన్ కూడా దొరికేవి.
*
- ఆచార్య కోలవెన్ను మలయవాసిని
**

04/16/2017 - 02:56

1942లో నేను విశాఖపట్నం వెళ్ళాను. నాకు రీడింగ్ రూంతో ఎక్కువగా అనుబంధం ఉన్నది. పదిహేనేళ్ళకు తక్కువ కాకుండా సంబంధం ఉన్నదని నాకు గుర్తు. అక్కడ పెద్ద టేబుల్ ఉండేది. దీనిపై రక రకాల మేగ్‌జైన్స్, పత్రికలు ఉండేవి. మేగజైన్స్ నన్ను బాగా ఆకర్షించేవి. రీడింగ్ రూం రెండు భాగాలుగా ఉండేది. మేడమీద రీడింగ్ రూం. కిందన లైబ్రరీ. ఈ లైబ్రరీ నాకు చాలా ఉపకారం చేసింది.

04/16/2017 - 02:49

* ఆంధ్ర సాహిత్యంలో నండూరి వెంకటసుబ్బారావు ‘ఎంకిపాటలు’కు విశిష్ట స్థానం ఉంది. 1953 మే 31న ఆయనను విశాఖ రచయితల సంఘం ఆహ్వానించింది. సాయంత్రం హిందూ రీడింగ్ రూంలో సభ జరిగింది. సుబ్బారావు తన ప్రసంగంలో కొన్ని ఎంకిపాటలను వినిపించారు.

Pages