S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం

04/16/2017 - 02:44

భువిలో పుట్టిన జీవరాశులు
కాలవాహిని జనపాత్రధారులు
ఈ రంగం నిమిత్త మాత్రం
ఇక్కడ ఒక్కరైనా మిగిలుంటారా?
అందరం అక్కడి వారమే
నీ నా భావం నెరుగక
విషకౌగిలి వలలు విసరక
సమభావనలు పాదుకొనక
సాగించిన మానవయానం
కళ్లు తెరచి నడిచే వానికి
సమరీతి న్యాయపు
నిజదర్శన మయ్యేదక్కడ
పూలజల్లు కురిసేదక్కడ
ఇక్కడి అందం ఆనందం
తాత్కాలికం

04/09/2017 - 23:21

ఆదివారం...
తీరిగ్గా పేపరు చూస్తూ కూర్చున్నాడు హరికృష్ణ.
పొద్దునే్న సింగారించుకుని పేరంటానికి వెళ్లిన స్వర్ణలత లబోదిబోమంటూ రావడం చూసి హతాశుడయ్యాడు.
‘‘ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు?’’ అంటూ గభాలున కుర్చీలో నుండి లేచాడు.

04/09/2017 - 23:17

ప్రభాత కిరణాలు పుడమిని తాకి
పులకించిపోయాయి
పక్షుల కిలాకిలారావాలు
ప్రకృతిని పరవశింపజేశాయి
గలగల పారే నదీమ తల్లి
రవికిరణాల తాకిడికి
ముగ్ద మనోహరంగా కనిపించింది
వాటి సోయగాల్ని మీలో కలబోతగా
నిండుగా తయారయిన నా ఊర్వశీ
దివిలోని తారలు అపురూపంగా
అచ్చెరువుగా నీ సౌందర్యాన్ని
అవలోకిస్తున్నాయి
పురి విప్పి నాట్యమాడే నెమలి

04/09/2017 - 23:12

లఘు కవితా ప్రక్రియలో అలఘతర భావ విస్ఫోటం ఉంటుందన్న సత్యం గ్రహించిన వారిలో మహ్మద్‌ఖాన్ ఒకరు. మినీ కవితలో శ్రావ్య ధ్వనులు, హైకూల్లో ఆనంద భైరవి రాగాలను మీటి సప్తస్వరాలుగా మన ముందుంచారు వీణ లాంటి పుస్తక సంపుటిలో. గుండెతో మీటి అక్షరాలకు స్వరకల్పన చేసి మనోజ్ఞ లయతో ఇందులో హైకూలు అలరారుతాయి.

04/02/2017 - 08:58

మొబైల్ రింగవడంతో ఒక్కసారిగా తెలివి వచ్చింది నాకు.
లేచి టైం చేసుకుంటే తెల్లవారు జాము రెండున్నరగా చూపిస్తుంది సమయం.
ఈ సమయంలో ఎవరబ్బా? అని నా మనసు కీడు శంకించింది.
ఫోన్ లిఫ్ట్ చేశాను.
అట్నుంచి ‘‘అన్నయ్యా నాన్న నాన్న అన్నయ్యా’’ అంటూ తమ్ముడి దీనాలాపన వినిపించింది.
‘‘ ఏమయిందిరా చెప్పు’’ అన్నాను.

03/26/2017 - 03:08

సంస్కృతీ సాంప్రదాయాలు పేరు చెప్పి ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనలను చూస్తే నిజంగానే ఆశ్చర్యంగా ఉంటుంది. తరాలు మారినా, మనుషులు మారినా వాళ్ల ఆలోచనల్లో మార్పు రాదేమో బహుశా. చిన్నప్పటి నుండి వినయవిధేయతలతో పెరిగి పెద్దదైన సుధ ఎన్నో మధురమైన ఊహల ఊసుల బాసలను మనసులో పెట్టుకుని ఒడిశాలో ఉన్న మేనమామ కొడుకుని పెళ్లి చేసుకుని అత్తవారింట్లో అడుగుపెట్టిన రెండవ రోజు...

03/26/2017 - 03:05

సోమనాథపురంలో సోమయ్య అనే ఒక సోమరిపోతు ఉండేవాడు. అతని భార్య సోమమ్మ ప్రతిరోజూ కూలిపనికి వెళ్లి, ఆ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుని వచ్చేది. ఆ ఊళ్లోనే భీమయ్య అనే ఒక భూస్వామి ఉండేవాడు. సోమమ్మ పడుతున్న కష్టాన్ని చూడలేక మంచి హృదయంతో సోమమ్మని పిలిపించి ‘‘నీ భర్త ఏ పనీ చేయకుండా అలా ఊరికే ఉంటే ఇల్లెలా గడుస్తుంది. అందుకే రెండెకరాలు కౌలుకు ఇస్తాను. సాగు చేసుకుని బతకండి’’ అన్నాడు.

03/26/2017 - 03:01

వనములన్ని కష్టించి వర్షమంత
ఆకులను రాల్చి అడవంత అలసిపోయె
అంతలోనె వసంతుడు అచటకేగి
విసర గాలులు వేగంగా వింజామరల
మోడుబారిన చెట్లన్ని మోజుపడుచు
చిగురుటాకులు తొడగంగ చింతలొదలి
మావిచిగురులు బహుమెక్కి మత్తుకెక్కి
కోయిలమ్మలు కూయంగా కోమలంగ
భవకవుల మనములన్ని భావమొంది
కలము సవరించి కథలు, కవితలు రాసి
పురము జనులకు వినిపించ పూనిరపుడు

03/19/2017 - 09:05

ఢిల్లీ మహానగరం!
శీతాకాలం కావడం వల్ల మంచు అదే పనిగా కురుస్తోంది.
సమయం ఉదయం పదిన్నర అయింది.
సీతారామయ్యగారు చేతిలో బ్యాగుతో పాటు రైల్వేస్టేషన్ ఏరియాలో వేగంగా నడుస్తున్నారు.
ఆ ప్రాంతమంతా గందరగోళంగా ఉంది.
ఎక్కడ చూసినా జనం కనిపిస్తున్నారు.
సీతారామయ్యగారు వేగంగా అక్కడున్న ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రధాన కార్యాలయంలోకి నడిచారు.

03/12/2017 - 04:42

వెంకట్రావు మాష్టారు ఒగ గవర్నమెంటు స్కూలు టీచరు. చాలీ చాలని జీతం. ముగ్గురు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. వచ్చే జీతం చాలక సంసార సాగరం ఈదలేక సతమతమవుతూ ఉంటాడు. పెద్ద కొడుకు ఎదిగి చేతికి అంది వస్తాడనుకొనేసరికి ప్రేమ. పెళ్లి అనే ముసుగులో అత్తారింటికి అల్లుడయ్యి ఇల్లరికం వెళ్లిపోయాడు. మాష్టారు జీవితములో ఇది కోలుకోని దెబ్బ. అప్పటికీ కూతురు పెళ్లీడుకొచ్చింది. రెండో కొడుకు సత్యారావు 8వ తరగతి చదువుచున్నాడు.

Pages