S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/19/2019 - 14:01

పనాజీ: గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు. గోవా మాజీ స్పీకర్‌గా చేసిన 45 సంవత్సరాల సావంత్‌కు సీఎం పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు భావించారు. పారికర్ అంత్యక్రియలు సాయంత్రం జరిగిన తరువాత సమావేశంలో సావంత్‌ను సభానేతగా ఎన్నుకున్నారు. వాస్తవానికి రాత్రి 11 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని భావించారు. కాని ఆ సమయం అర్థరాత్రి దాటిన తరువాత 1.50 నిమిషాలకు మారింది.

03/19/2019 - 12:43

చెన్నై: డీఎంకే తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు మేనిఫెస్టోను విడుదల చేసినవారిలో ఉన్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఉచిత రైలు ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. అలాగే విద్యా రుణాలు మాఫీ చేస్తామని, దక్షిణ భారత నదుల అనుసంధానానికి కృషిచేస్తామని చెప్పారు.

03/19/2019 - 12:42

న్యూఢిల్లీ: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన పూల్వామా ఉగ్రదాడిని ఈ దేశం మరువదని జాతీయ భద్రతా సలహదారుడు అజిత్ ధోవల్ అన్నారు. ఆయన హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగిన 80వ సీఆర్‌పీఎఫ్ పెరేడ్ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పూల్వామా ఉగ్రదాడిలో మృతిచెందిన జవాన్లకు ఆయన నివాళులర్పించారు. పూల్వామా ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.

03/19/2019 - 12:39

జమ్మూకాశ్మీర్: పూల్వామా ఉగ్రదాడి తరువాత పాక్ సైనికులు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించి పాక్ జవాన్లు సోమవారం అర్థరాత్రి నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు కాల్పులు జరిపారు. ఈ కాల్పులను భారత సైనికులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. సరిహద్దుల్లోని అఖనూర్, సుందరబనీ తదితర ప్రాంతాల్లో కాల్పులు జరుపుతూనే ఉన్నారు.

03/19/2019 - 12:38

న్యూఢిల్లీ: సైన్యంలో విశేష సేవలందించిన సైనికులకు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పురస్కారాలను అందజేశారు. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొంటూ ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. ఇందులో ఇద్దరికి మరణానంతరం పురస్కారాలు అందజేశారు. సీఆర్‌పీఎఫ్ జవానుగా పనిచేసిన ప్రదీప్ కుమార్‌కు మరణానంతరం కీర్తిచక్ర అందజేశారు. ఈ పురస్కారాన్ని ఆయన భార్య అందుకున్నారు.

03/19/2019 - 03:58

పనాజీ: అనారోగ్యంతో కన్నుమూసిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌కు సోమవారం సైనిక లాంచనాలతో అంత్యక్రియలు జరిగాయి. చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం పారికర్(63) కన్నుమూశారు. ఎలాంటి పదవుల్లో ఉన్నప్పటికీ ఆయన అత్యంత నిరాడంబర జీవితాన్ని గడిపేవారు. గోవా ప్రజలంతా ఆయనను ‘సామాన్యుడి’గా పేర్కొంటారు. ఆయన మృతి బీజేపీ కార్యకర్తలు, అభిమానులకు తీరని విషాదాన్ని మిగిల్చింది.

03/19/2019 - 03:55

కాల్‌బుర్గి, మార్చి 18: లోక్‌సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా విమర్శల దూకుడును మరింత ఎక్కువ చేశారు. మోదీ ఆదివారం నాటి తన ఎన్నికల ప్రచారంలో తాను దేశానికి చౌకీదారుడునని, తనలాగే దేశంలోని ప్రతిఒక్కరూ కాపలాదారులుగా మారాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

03/19/2019 - 02:01

కేంద్రంలో అధికారంలోకి రావాలంటే యూపీలో మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవడమే ఏకైక మార్గమని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయ. 1951 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతమే కేంద్రంలో అధికారాన్ని సంపాదించుకోవడంలో ఆయా పార్టీలకు కేంద్ర బిందువు అయింది. 2014 ఎన్నికల్లో అమిత్ షా రాజకీయ వ్యూహం ఫలించి తూర్పు యూపీలో బీజేపీ ప్రభంజనానే్న కొనసాగించింది.
*

03/19/2019 - 01:48

బెంగళూరు, మార్చి 18: కర్నాటకలోని మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని దివంగత కాంగ్రెస్ నేత అంబరీష్ సతీమణి సుమలత నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణంలో ఆమెకు సీటు దక్కలేదు. సమీకరణల్లో భాగంగా టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించింది. పొత్తుల్లో భాగంగా మాండ్య సీటు జేడీఎస్‌కు కేటాయించారు. ఇక్కడ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు పోటీచేయనున్నాడు.

03/19/2019 - 01:46

భోపాల్, మార్చి 18: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాందీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా లోక్‌సభకు పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు.

Pages