S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/09/2018 - 13:38

మహారాష్ట్ర : ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మరాఠాలు నేడు మహారాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బంద్‌ కొనసాగుతోంది. పలు జిల్లాల్లో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేపట్టారు. బస్సులు, వాహనాలను అడ్డుకున్నారు. అన్ని చోట్లా భద్రతను కట్టుదిట్టం చేశారు.

08/09/2018 - 12:25

న్యూఢిల్లీ : నేడు జరగనున్న రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ ఎన్నికలను అరవింద్‌ కేజ్రీవాల్‌ పార్టీ ఆప్‌ బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. రాహుల్‌గాంధీ వ్యక్తిగత అభ్యర్థనపై ఈ ప్రకటన చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికకు దూరంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ నిర్ణయించిన టీఆర్ఎస్ పార్టీ ఆఖరి నిమిషంలో ఎన్డీయే అభ్యర్ధికి ఓటు వేయడం సంచలనానికి దారితీసింది.

08/09/2018 - 12:12

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో నటి, సింగర్‌ను ఆమె భర్త హత్య చేశాడు. నటి రేష్మ పలు సినిమా నటిగానే కాక గాయనిగానూ ఆమెకు మంచి పేరుంది. భర్తతో విభేదాలు ఉండటంతో రేష్మ గత కొన్నిరోజులుగా నౌషెరా కలాన్‌ లోని హకిమాబాద్‌లోని తన సోదరుడి ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన రేష్మ భర్త ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఆమె మృతిచెందగా, నిందితుడు అక్కడినుండి పరారయ్యాడు.

08/09/2018 - 12:10

తిరువనంతపురం : కేరళలో భారీ వర్షాల ధాటికి వాయనాడ్‌, ఇడుక్కిలలో 16మంది మృతిచెందగా, 12మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. నిలంబూర్‌ అటవీ ప్రాంతంలో చలియార్‌, దాని ఉపనదులు పొంగి ప్రవహిస్తుండటంతో ఇడుక్కి, ఇళక్కి, తామరాస్సేరి, కుటియడి జిల్లాల్లోని రాజాపురం, అడిమలై, వాయనాడ్‌ జిల్లాల్లో పెద్ద ఎత్తున వరదలు సంభవించాయని, ఈశాన్య ప్రాంతం పూర్తిగా జలమయమైనట్లు అధికారులు తెలిపారు. అధికారులు తెలిపారు.

08/09/2018 - 12:09

ఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీయే అభ్యర్థిగా పోటీలో దిగిన హరివంశ్(జేడీయూ) ఎన్నికయ్యారు. ప్రతిపక్షాల అభ్యర్ధిగా బీకే హరిప్రసాద్(కాంగ్రెస్‌) బరిలో ఉన్న సంగతి తెలిసిందే. మొత్తం 222 మంది సభ్యులు సభకు హాజరవగా ఆప్, వైసీపీ సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. కాగా... ఎన్డీయే అభ్యర్ధి హరివంశ్ సింగ్‌కు 125 ఓట్లు వచ్చాయి. అలాగే వ్యతిరేకంగా 98 ఓట్లు వచ్చాయి.

08/09/2018 - 05:35

ఇస్లామాబాద్: పాకిస్తాన్ దళాలు రష్యాలో శిక్షణ పొందుతున్నాయి. అమెరికాతో సంబంధాలు రానురాను సంక్లిష్టమవుతున్న తరుణంలో రష్యాతో సంబంధ బాంధవ్యాల బలోపేతం వైపు పాకిస్తాన్ ముందడుగేసింది. ఈక్రమంలో పాక్ సైనిక దళాలకు రష్యన్ మిలటరీ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ ఇచ్చేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.

08/09/2018 - 05:22

న్యూఢిల్లీ, ఆగస్టు 8: అక్రమ సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించాలన్న చట్టం రాజ్యాంగపరమైన చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన కేసుపై తుదితీర్పును సుప్రీం కోర్టు బుధవారం రిజర్వ్‌లో ఉంచింది. చీఫ్ జస్టిస్ దీపక్‌మిశ్రా నేతృత్వంలోని జస్టిస్‌లు ఆర్‌ఎఫ్ నారిమన్, ఏఎం కన్విల్కర్, డివై చంద్రచూడ్, ఇందు మల్హోత్రాలతో కూడిన ఐదుగురి సభ్యుల విస్తృత ధర్మాసనం కేసును విచారించింది.

08/09/2018 - 00:49

నూఢిల్లీ, ఆగస్టు 8: రాజ్యసభ ఉపాధ్యక్ష పదవికి ఎన్‌డీఏ తరపున జేడీ(యూ) సీనియర్ నేత హరివంశ్ నారాయణ్ సింగ్, ప్రతిపక్షం తరపున కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బీకే హరిప్రసాద్ బుధవారం నామినేషన్లు దాఖలు చేయటంతో ఇరువర్గాల మధ్య ముఖాముఖి పోటీకి రంగం సిద్ధమైంది. హరివంశ్‌కు మద్దతిచ్చేందుకు అకాలీదళ్, బీజేడీతోపాటు టీఆర్‌ఎస్ కూడా అంగీకరించినట్లు తెలిసిందే.

08/09/2018 - 00:45

న్యూఢిల్లీ, ఆగస్టు 8: గృహాలను నిర్మించి ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసిన ఆమ్రపాలి గ్రూపును సుప్రీంకోర్టు తీవ్రస్వరంతో మందలించింది. కోర్టుతో ఆడుకోకండి, మీకు ఇల్లు లేకుండా చేస్తాం జాగ్రత్త అంటూ కోర్టు ఆమ్రపాలి నిర్వాహకులను హెచ్చరించింది. గృహాలను కొనుగోలు చేసే వారి వద్ద నుంచి ఇక డిపాజిట్లు వసూలు చేస్తే సహించే ప్రసక్తిలేదని కోర్టు స్పష్టం చేసింది.

08/08/2018 - 16:41

ముంబయి: ముంబయిలోని చంబూర్ భారత్‌కు చెందిని పెట్రోలియం రిఫైనరీ ఫ్లాంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్దఎత్తున చెలరేగటంతో ఏడు అగ్నిమాపక దళాలతో మంటలను అదుపులోనికి తెచ్చారు. ప్రాణ నష్టం సంభవించలేదు.

Pages