S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/08/2018 - 12:23

న్యూఢిల్లీ: డీఎంకే అధినేత కరుణానిధి మృతికి పార్లమెంటులోని ఉభయ సభలు సంతాపం తెలిపాయి. పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాయుడు, లోకసభలో సుమిత్రా మహాజన్ సంతాప తీర్మానాలను ప్రవేశ పెట్టారు. ఉభయ సభల సభ్యులు రెండు నిమిషాలు వౌనం పాటించారు. అనంతరం ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి.

08/08/2018 - 04:04

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి రాసిన పుస్తకం అద్భుతంగా ఉన్నదని మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రశంసించారు. మంగళవారం ఢిల్లీలో జైపాల్ రెడ్డి రాసిన ‘టెన్ ఐడియాలజీస్’ పుస్తకాన్ని మన్మోహన్ సింగ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న పది సిద్ధాంతాలను క్రోడీకరిస్తూ జైపాల్ రెడ్డి చేసిన విశే్లషణ అత్యున్నత స్థాయిలో ఉన్నదని అన్నారు.

08/08/2018 - 04:01

న్యూఢిల్లీ, ఆగస్టు 7: జమ్మూలో తన నివాసం వద్ద జరిగిన కాల్పుల ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, ఎంపీ ఫరూక్ అబ్దుల్లా విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఇక్కడ కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్‌తో ఆయన భేటీ అయ్యారు. గత వారం తన నివాసం వద్ద జరిగిన భద్రత ఉల్లంఘన, యువకుడి మృతిపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపించాలని ఆయన కోరారు.

08/08/2018 - 04:00

అహ్మదాబాద్, ఆగస్టు 7: పరీక్షలు రాయడం పిల్లలకు ఎంత ముఖ్యమో, ఆ పేపర్లను మూల్యాంకనం చేసి సరైన మార్కులు వేయడం కూడా ఉపాధ్యాయులకు అంతే ముఖ్యం. ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా నిర్లక్ష్యంగా పేపర్లు దిద్దేవారిని దారిలోకి తెచ్చేందుకు గుజరాత్ ప్రభుత్వం నడుం బిగించింది.

08/08/2018 - 04:00

న్యూఢిల్లీ, ఆగస్టు 7: అసోం జాతీయ పౌర రిజిస్ట్రేషన్ అంశంపై రాజ్యసభలో త్రుణముల్ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగి సభా కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలిగించడంతో చైర్మన్ సభను వాయిదా వేయక తప్పలేదు. మధ్యాహ్నం రెండు గంటలకు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, కనీస మద్దతు ధర, ఖరీఫ్ పంటలకు ఉద్దేశించబడిన స్వల్పకాలిక చర్చను చైర్మన్ వెంకయ్య నాయుడు చేపట్టారు.

08/08/2018 - 03:55

న్యూఢిల్లీ, ఆగస్టు 7: న్యాయమూర్తుల నియామకంలో సీనియారిటీ వివాదం కొలిక్కిరాకముందే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కె.ఎం.జోసెఫ్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముగ్గురు న్యాయమూర్తుల జాబితాలో మూడవ స్థానంలో ఉన్న జోసెఫ్ మొదటి ఇద్దరు న్యాయమూర్తులు తర్వాతనే ప్రమాణం చేశారు. జోసెఫ్‌తో పాటు ఇందిరా బెనర్జీ, వినీత్ శరణ్‌లు కూడా సుప్రీం న్యాయమూర్తులుగా నియమితులైన విషయం విదితమే.

08/08/2018 - 03:50

న్యూఢిల్లీ, ఆగస్టు 7: బీజేపీ, టీడీపీ నాయకుల మధ్య రైల్వే మంత్రిత్వశాఖ కార్యాలయంలో వాగ్వివాదం చోటుచేసుకుంది. పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. బీజేపీ ఎంపీలు జీవీఎల్ నరసింహరావు, కంభంపాటి హరిబాబుతో రాష్ట్ర మంత్రులు అయన్నపాత్రుడు, కళా వెంకట్రావు, సుజయకృష్ణ రంగారావువాగ్వివాదానికి దిగారు.

08/08/2018 - 03:33

న్యూఢిల్లీ, ఆగస్టు 7: దేశంలో మహిళలు, బాలికలకు భద్రత కరవైందని, ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్రలో గత మూడువేళ ఏళ్లలో జరగని ఘోరాలు చోటుచేసుకుంటున్నాయని ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. మంగళవారం ఇక్కడ మహిళా అధికార సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఆశ్రమాల్లో బాలికలకు రక్షణ లేదని, మోదీ ప్రభుత్వం మాటలతో కాలక్షేపం చేస్తోందన్నారు.

08/08/2018 - 03:37

న్యూఢిల్లీ, ఆగస్టు 7: సామాజక న్యాయాన్ని కోరుకునే వ్యక్తిగా ఎస్సీ వర్గీకరణ జరగాలని ఎప్పుడూ అనుకుంటానని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిరక్షణకు దళిత సంఘాల నేతృత్వంలో ఢిల్లీలో జరుగుతున్న మూడు రోజుల దీక్షకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమ స్ఫూర్తితోనే అట్రాసిటీ చట్ట రక్షణ ఉద్యమం బలంగా నడుస్తోందని అభిప్రాయపడ్డారు.

08/08/2018 - 03:28

న్యూఢిల్లీ, ఆగస్టు 7: గ్రామీణ ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీటి సరఫరా లక్ష్య సాధనలో జాతీయ గ్రామీణ తాగునీటి పథకం విఫలమైందని కంప్రోలర్ అండ్ ఆటిటర్ జనరల్ (కాగ్) మంగళవారం పార్లమెంట్‌కు నివేదించింది. 2017 నాటికి కనీసం 50 శాతం గ్రామపంచాయతీ అనుబంధ గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలన్నది ఈ పథకం లక్ష్యం.

Pages