S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/15/2018 - 06:18

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇండియాటుడే- ఆక్సెస్ మై ఇండియా వీక్లీ సర్వేల్లో వెల్లడైంది. అలాగే తెలంగాణలో కే చంద్రశేఖరరావు మళ్లీ సీఎం అవుతారని సర్వే పేర్కొంది. ఇండియా టుడే శుక్రవారం ఈ వీక్లీ సర్వేలను ప్రసారం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని తెలిపింది.

09/15/2018 - 05:25

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ఓడించేందుకు భావసారూప్యత గల పార్టీలతో పొత్తులకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పచ్చజెండా ఊపారు. అలాగే టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు రాహుల్ గాంధీ తెలంగాణలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తారు. రాహుల్ పది జిల్లాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు.

09/15/2018 - 01:48

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ప్రజల్లో సానుభూతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావువిమర్శించారు. బాబ్లీ ఆందోళనకు సంబంధించి మహారాష్ట్ర కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే దాన్నీ చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.

09/15/2018 - 05:19

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: సినీ నిర్మాత బండ్ల గణేశ్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో శుక్రవారం ఇక్కడ కాంగ్రెస్ కండువాకప్పుకున్నారు. వీరిద్దరితోపాటు టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నాయకులు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

09/15/2018 - 21:25

కిస్టావర్ (జమ్ముకాశ్మీర్): కాశ్మీర్‌లోని కిష్టావర్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది ప్రయాణీకులు మరణించారు. ఒక మినీ బస్సు లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. కేషావన్ ప్రాంతం నుంచి కిష్టావర్‌కు మినీ బస్సు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెప్పారు. స్టీరింగ్ అదుపుతప్పడంతో బస్సు పక్కనే ఉన్న 300 అడుగుల లోతు లోయలోకి దూసుకువెళ్లి పల్టీలుకొట్టింది.

09/15/2018 - 05:20

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: హిందీ భాష దేశ ఐక్యతకు చిహ్నంగా ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు అభివర్ణించారు. సామాజిక, రాజకీయ, భాషాశాస్త్రాన్ని సమ్మిళితం చేస్తూ ఐక్యతను చాటిచెబుతోందని శుక్రవారం ఇక్కడ హిందీ దివస్ కార్యక్రమంలో స్పష్టం చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో హిందీ భాష కీలక భూమిక పోషించిందని ఆయన చెప్పారు. స్వాంతత్య్ర సమరయోధులకు సమాచారం వారధిగా హిందీ ఉపయోగపడిందని ఆయన తెలిపారు.

09/15/2018 - 01:13

అమృత్‌సర్, సెప్టెంబర్ 14: ఆందోళన కారులపై 2015లో జరిగిన పోలీసు కాల్పుల ఘటనతో సంబంధం ఉన్న పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, ఆయన తనయుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌లను మతం నుంచి బహిష్కరించాలని మాజీ క్రికెటర్, ప్రస్తుత పంజాబ్ మంత్రి నవ్‌జోత్ సింగ్ సిద్ధూ సిక్కుమత అత్యున్నత పీఠం అకల్‌తక్త్‌ను కోరారు.

09/15/2018 - 06:00

వారణాసి: వారణాసిలోని శ్రీరామతారకాంధ్రాశ్రమంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమం మేనేజింగ్ ట్రసీ వీవీ సుందరశాస్ర్తీ మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక చవిత ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఆశ్రమాన్ని శ్రీరామభద్రేంద్ర సరస్వతి స్థాపించారన్నారు.

09/14/2018 - 15:36

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్టావర్ జిల్లాలోని థాక్రీ వద్ద ప్రయాణీకులతో వెళుతున్న ఓ మినీ బస్సు అదుపు తప్పి చీనబ్ నదిలో బోల్తా పడింది. ఈ సంఘటనలో 13 మంది అక్కడికక్కడే చనిపోయారు. బస్సులో మొత్తం 25మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలిసింది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

09/13/2018 - 06:27

న్యూఢిల్లీ: తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై ఎనిమిది వారాల్లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది విద్యార్థులు మానసిక కారణాలతో ఆత్మహత్యలు చేసుకొంటున్నారని, కనీస వసతులు లేకుండా కార్పొరేట్ విద్యా సంస్థలు వ్యవహారిస్తున్నాయని న్యాయవాది శ్రవణ్‌కుమార్ ఎన్‌హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు.

Pages