S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/12/2018 - 05:20

న్యూఢిల్లీ, జూలై 11: బాల్యంలో పుస్తకాల సంచి పట్టుకుని బడికి వెళ్లాల్సిన పిల్లలు బాల కార్మికులుగా పనిచేస్తున్నారు. నవ భారతంలో ఒకరు కాదు ఇద్దరు కాదు. ఎకాఎకిన 23 మిలియన్ల మంది బాలబాలికలు పనిచేస్తున్నారు. వీరి వయస్సు 15 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇందులో 19 మిలియన్ల మంది రకరకాల కారణాల వల్ల బడిని మధ్యలో మానేశారు. ఈ వివరాలను చైల్డ్ రైట్స్ అండ్ యూ (క్రై) సంస్థ విడుదల చేసింది.

07/11/2018 - 22:31

న్యూఢిల్లీ, జూలై 11: బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ జీవితచరిత్ర పుస్తకం తీసుకురావాలని ప్రముఖ ప్రచురణ సంస్థ హర్పర్ కొలిన్స్ నిర్ణయించింది. 2019 జూలై 29నాటికి దత్‌కు అరవై ఏళ్లు వస్తాయి. షష్టిపూర్తికి సంజయ్ ఆత్మకథ విడుదల చేస్తామని పబ్లిషర్స్ బుధవారం ఇక్కడ ప్రకటించారు.

07/11/2018 - 22:30

భోపాల్, జూలై 11: మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి ప్రజల ప్రయోజనార్ధం ప్రకటించిన కరెంట్ బిల్లుల సబ్సిడీ మాఫీ పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రభుత్వ ప్రకటనతో ప్రయోజనం పొందేందుకు దాదాపు 38 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు.

07/11/2018 - 16:14

లక్నో: తాజమహల్ పరిరక్షణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘తాజ్‌మహల్‌ను పునరుద్ధరించండి లేదా కూల్చేయండి లేకుంటే మేమే తాళాలు వేస్తాం’’ అని జడ్జిల బెంచ్ పేర్కొంది. తాజమహల్‌పై స్టాండింగ్ కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ పట్టించుకోవటం లేదని వ్యాఖ్యానించింది.

07/11/2018 - 16:02

న్యూఢిల్లీ: పరిపూర్ణానంద స్వామిపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం నగర బహిష్కరణ విధించటం హిందూ సమాజంపై జరిగిన దాడిగా బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పేర్కొన్నారు. ఆయన ఈమేరకు ట్వీట్ చేస్తూ నిజాం మత రాజకీయాలకు కేసీఆర్ ప్రభుత్వం నిదర్శనమని అన్నారు. స్వామి బహిష్కరణ మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు.

07/11/2018 - 13:54

మణిపూర్: తమాంగ్ జిల్లాలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఏడుగురి మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. మృతుల్లో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.

07/11/2018 - 12:18

వాషింగ్టన్: చైనా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై అమెరికా మరోసారి సుంకాలను పెంచింది. అమెరికా, చైనా దేశాల మధ్య మళ్లీ వాణిజ్య రగడ మొదలైంది. అమెరికా దిగుమతులపై చైనా సుంకాలు పెంచింది.దీనికి దీటుగా అమెరికా గతంలో సుంకాలు పెంచటమే కాదు మళ్లీ అదనంగా మరో 200 మిలియన్ డాలర్ల ఉత్పత్తులపైనా 10శాతం సుంకాలను అమెరికా పెంచటం గమనార్హం.

07/11/2018 - 12:14

ముంబయి: ముంబయి మహానగరం వరద నీటిలోనే ఉన్నది. గడిచిన 24 గంటల్లో 20 సెంమీ వర్షపాతం నమోదు అయింది. మరోవైపు రైల్వేట్రాక్‌పై వర్షం నీరు నిలిచిపోవటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఎన్డీఆర్‌ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

07/11/2018 - 04:41

షిల్లాంగ్: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, నవ భారత్ నిర్మాణంలో ఈశాన్య రాష్ట్రాలను భాగస్వాములను చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం పారదర్శకతతో కూడిన విధానాలను అమలు చేస్తోందన్నారు. మంగళవారం ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల మండలి 67 వార్షికోత్సవ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

07/11/2018 - 01:31

ముంబయి, జూలై 10: ముంబయి మహానగరం భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నగరంలో ప్రజా జీవితం స్తంభించింది.వరుసగా కురుస్తున్న వర్షాలతో రవణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రైల్వే సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడింది. పశ్చిమ రైల్వేలో సబర్బన్ రైల్వే సర్వీసులను సస్పెండ్ చేశారు. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా బయలుదేరుతున్నాయి.

Pages