S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/09/2018 - 16:39

న్యూఢిల్లీ: తమకు విధించిన శిక్షను తగ్గించాలంటూ నిర్భయ కేసులో నిందితులు వేసిన రివ్యూపిటిషన్‌ను సుప్రీంకోర్టు తొసిపుచ్చుతూ ఉరిశిక్షే సరైందంటూ తీర్పు నివ్వటం పట్ల నిర్భయ తల్లిదండ్రులు ఆశాదేవి, బద్రీనాథ్‌సింగ్ హార్షం వ్యక్తంచేశారు. నిర్భయ హంతకులను సాధ్యమైనంత వరకు వెంటనే ఉరితీయాలని కోరారు. జ్యూడిషియల్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని వారు కోరారు.

07/09/2018 - 16:35

న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఉరిని ఖరారుచేస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఉరికి బదులు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని నిందితులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. మరణశిక్షే సరైందంటూ ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసులో ముఖేన్‌సింగ్, అక్షయ్‌ఠాకూర్, వినయ్‌శర్మ, పవన్‌గుప్తా నిందితులు. గతంలోనే ట్రయల్ కోర్టు, హైకోర్టు వీరికి ఉరిశిక్షను ఖరారుచేసింది.

07/09/2018 - 12:55

ముంబయి: టాటా ఇండస్ట్రీస్ చైర్మన్‌గా మిస్ర్తి తొలగింపు సరైందేనని కంపెనీ లా ట్రిబ్యూనల్ పేర్కొంది. సోమవారంనాడు తీర్పు చెబుతూ మిస్ర్తి తొలగింపునకు లాబోర్డుకు పూర్తి అధికారం ఉందని పేర్కొంది. ఈ కేసును ఎన్‌సీఎల్‌టీలో న్యాయమూర్తులు ప్రకాశ్‌కుమార్, సేనాపతి వాదించారు. మిస్ర్తి తొలగింపు బోర్డు అనుమతితో జరిగిందని టాటాసన్స్ పేర్కొంది.

07/09/2018 - 12:54

ముంబయి:్భరీ వర్షాలకు ముంబయిలో జనజీవనం అస్తవ్యస్తం అయింది. గడచిన 24 గంటల్లో కోలాబ్‌లో 170.6, దహాణలో 380 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. మరో 24 గంటల పాటు వర్షాలు ఇలానే కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిని మోటార్లతో తోడిస్తున్నారు. సముద్రం అల్లకల్లోంగా మారింది.

07/09/2018 - 12:53

న్యూఢిల్లీ: ప్రభుత్వం వద్ద భూములు తీసుకుని ఆసుపత్రులు కట్టుకున్న ప్రైవేటు ఆసుపత్రుల వారు పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. పేదలకు ఎన్ని బెడ్స్ కేటాయించాలనేదానిపై ప్రభుత్వానికి, ప్రైవేటు ఆసుపత్రివారికి మధ్య జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కోర్టు పేర్కొంది.

07/09/2018 - 12:52

లక్నో: గ్యాంగ్‌స్టర్ ప్రేమ ప్రకాశ్‌సింగ్ అలియాస్ మున్నా భజరంగీని సోమవారంనాడు మరో గ్యాంగ్‌స్టర్ కాల్చి చంపాడు. ఈ ఘటన భగవత్ జైల్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..మున్నాభజరంగీని కోర్టులో ప్రవేశపెట్టేందుకు భగవత్ పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. కోర్టుకు తీసుకువెళుతుండగా.. మరో గ్యాంగ్‌స్టర్ సునీల్ రాతి అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

07/09/2018 - 12:50

కాన్పూర్: గంగానదిలో స్నానానిక వెళ్లి నీటమునిగిన ఆరుగురు విద్యార్థుల్లో ముగ్గురు మృతదేహాలను సోమవారంనాడు వెలికితీశారు. నీటమునిగిన వారంతా 10 నుంచి 12 ఏళ్ల లోపువారే. మిగిలినవారి మృతదేహాల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

07/09/2018 - 04:12

భోపాల్: క్షణికావేశంలో చేసిన తప్పుడు జీవిత ఖైదుతో అనుభవిస్తూ జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు వైద్య సేవలు అందించబోతున్నారు. ఇది నిజమేనా అని అనుకోవచ్చు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఖైదీలకు పారామెడికల్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలో జైళ్ల చరిత్రలో తొలిసారిగా వినూత్న విధానాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోంది.

07/09/2018 - 02:49

హిజిబుల్ ముజాహిదీన్ కమాండర్ బురాన్ వనీ రెండో వర్ధంతి సందర్భంగా శ్రీనగర్‌లో కాశ్మీర్ వేర్పాటు వాదులు ఇచ్చిన బంద్ పిలుపును పురస్కరించుకొని, ఆదివారం వీధుల్లో గస్తీ తిరుగుతున్న జవాన్లు. ఇటీవల జరిగిన అల్లర్లలో ముగ్గురు యువకులు ఎదురుకాల్పుల్లో మృతి చెందడంతో కాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు రెచ్చిపోయి, భద్రతా దళాలపై రాళ్ల వర్షం కురిపిస్తున్నారు.

07/09/2018 - 02:46

న్యూఢిల్లీ, జూలై 8: అమెరికాలోని కన్సాస్ నగరంలో ఆగంతకుల కాల్పులకు బలైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థి శరత్ కొప్పు ఘటన పట్ల కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శరత్ కుటుంబానికి అవసరమైన సహాయాన్ని చేసి ఆదుకుంటామని ఆమె ట్వీట్ చేశారు. రెస్టారెంట్‌లో పనిచేస్తున్న సమయంలో కాల్పుల్లో శరత్ కొప్పు మరణించిన విషయం విదితమే.

Pages