S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/08/2018 - 20:57

హైదరాబాద్, జూలై 7: ఏటా రెండుమార్లు నీట్, జేఈఈలను నిర్వహించనున్నట్టు కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ శనివారం నాడు చెప్పారు. ఈ ప్రవేశపరీక్షలతో పాటు సీ మ్యాట్‌ను, నెట్‌ను నిర్వహించే బాధ్యతను నేషనల్ టెస్టింగ్ ఏజన్సీకి అప్పగించినట్టు ఆయన ట్వీట్ చేశారు.

07/07/2018 - 02:28

న్యూఢిల్లీ, జూలై 6: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు అధిపతి, మాస్టర్ ఆఫ్ రోస్టర్, సీనియర్ న్యాయమూర్తి, సమానుల్లో ప్రథములు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తికి ఏఏ ధర్మాసనాలకు ఏ కేసును కేటాయించాలనే అంశంపై సర్వాధికారాలు ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఏకె సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

07/07/2018 - 02:10

న్యూఢిల్లీ, జూలై 6: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు అధిపతి, మాస్టర్ ఆఫ్ రోస్టర్, సీనియర్ న్యాయమూర్తి, సమానుల్లో ప్రథములు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తికి ఏఏ ధర్మాసనాలకు ఏ కేసును కేటాయించాలనే అంశంపై సర్వాధికారాలు ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఏకె సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

07/07/2018 - 05:25

ఇస్లామాబాద్, జూలై 6: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు అవినీతి కేసులో పదేళ్ల కఠినజైలు శిక్షను విధిస్తూ పాకిస్తాన్ అకౌంటబులిటీ (జవాబుదారీ) కోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. ఇదే కేసులో కుమార్తెకు ఏడేళ్లు, అల్లుడికి ఏడాది జైలు శిక్షను విధించింది. కాగా ఈ కేసులో నవాజ్ షరీఫ్‌కు శిక్షతో పాటు ఎనిమిది మిలియన్ పౌండ్ల జరిమానాను, కుమార్తెకు రెండు మిలియన్ పౌండ్ల జరిమానాను కోర్టు విధించింది.

07/06/2018 - 23:26

న్యూఢిల్లీ, జూలై 6: పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలు, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆ రాష్ట్ర నాయకులతో శుక్రవారం సమావేశమయ్యారు.

07/06/2018 - 23:24

న్యూఢిల్లీ, జూలై 6: కాంగ్రెస్‌కు భావ ప్రకటన స్వేచ్ఛపై ఏమాత్రం నమ్మకం లేదని, కానీ, అదే పార్టీ మాట్లాడే హక్కు గురించి వాదించడం విచిత్రంగా ఉందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. బీజేపీకి మాతృ సంస్థ భారతీయ జన సంఘ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా శుక్రవారం పోస్ట్ చేసిన ట్విటర్‌లో ఆయన కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు.

07/06/2018 - 23:21

చండీగఢ్, జూలై 6: జలసంరక్షణ, భద్రతా అంశాలపై సాంకేతిక నైపుణ్యం, ఇతర అంశాలను ఒకరికొకరు పంచుకోవడానికి పంజాబ్, ఇజ్రాయిల్ దేశం మధ్య అంగీకారం కుదిరింది. ముఖ్యంగా వ్యవసాయం, సామాజిక అభివృద్ధి అంశాలలో ఇరువురు ఒకరుకొకరు సహకరించుకోవాలని నిర్ణయించారు.

07/06/2018 - 23:20

న్యూఢిల్లీ, జూలై 6: సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నదని కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీసెస్ విభాగాన్ని తన గుప్పిట్లోనే ఉంచుకోవడానికి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ప్రయత్నిస్తున్నారని, ఇటీవల సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలకు ఇది పూర్తి విరుద్ధమని శుక్రవారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేజ్రీవాల్ అన్నారు.

07/06/2018 - 17:37

మలేసియా: వివాదాస్పద ప్రసంగాలు చేసే ఇస్లామిక్ మత ప్రబోధకుడు జాకీర్‌నాయక్‌ను భారతదేశం పంపించబోమని మలేసియా ప్రధాని మహతీర్ మొహమద్ స్పష్టంచేశారు. ఆయనకు మలేసియాలో శాశ్వత నివాస హోదా ఉందని తెలిపారు. ఉగ్రవాదులను ప్రేరేపించే విధంగా జాకీర్ ప్రసంగాలు ఉన్నాయని భారత్‌లో ఆయనపై కేసు నమోదైంది. జాకీర్ రెండు రోజుల్లో భారత్ వస్తున్నాడని, ఆయనను భారత్‌కు తిరిగి పంపించాల్సిందిగా భారత్ కోరిన విషయం విదితమే.

07/06/2018 - 17:35

అసోం: పిల్లలను అపహరించుకుపోయే ముఠా అని భావించిన స్థానికులు ముగ్గురు సాధువులపై దాడిచేసి కొట్టారు. చివరకు ఆర్మీ ఆధికారులు వచ్చి వారిని సంరక్షించారు. అసోంలోని దిమా హసావ్ జిల్లాలోని మహుల్ రైల్వే స్టేషన్‌లో కాషాయ వస్త్రాలు ధరించిన ముగ్గురు వ్యక్తులు సంచరించటం తెలుసుకుని స్థానికులు వారిని పిల్లలు అపహరించుకుపోయే ముఠాగా భావించి దాడి చేయటం జరిగింది.

Pages