S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/05/2018 - 04:45

అమేథీ (ఉత్తర ప్రదేశ్), జూలై 4: ప్రధాని నరేంద్ర మోదీ చెప్తున్నట్టు మన దేశంలో బుల్లెట్ ట్రైన్ రాదని, నిజానికి అది ఒక కల మాత్రమేనని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీ ప్రకటించిన బుల్లెట్ ట్రైన్‌ను ఆయన ఒక ‘మాయా ట్రైన్’గా అభివర్ణించారు.

07/05/2018 - 04:44

టెహ్రాన్, జూలై 4: పారిస్‌లో జరిగిన పీపుల్స్ ముజాహిదీన్ ఊరేగింపుపై బాంబు దాడికి ప్రయత్నించింది ఆ సంస్థ సభ్యులేనని, వాస్తవానికి వారే అసలైన కుట్రదారులని ఇరాన్ ప్రభుత్వం ఆరోపించింది. ఫ్రాన్స్‌లో అరెస్టయిన తీవ్రవాది పీపుల్స్ ముజాహిదీన్ సభ్యుడని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

07/05/2018 - 04:43

న్యూ ఢిల్లీ, జూలై 4: ఢిల్లీ కేంద్రపాలిత రాష్ట్ర పరిధిలో దక్షిణ ఢిల్లీలో ఈ నెల 26వ తేదీ వరకు చెట్లను తొలగించడాన్ని నిషేధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం నిమిత్తం చెట్లను తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జూలై 26వ తేదీ తర్వాత విచారిస్తామని హైకోర్టు పేర్కొంది.

07/05/2018 - 05:15

రైటప్:
=====
అమర్‌నాథ్ సందర్శన కోసం జమ్మూలో ఎదురుచూస్తున్న సాధువులకు రక్షణగా నిలిచిన ఓ పోలీసు..

07/05/2018 - 04:04

న్యూఢిల్లీ, జూలై 4: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని ఓ పక్క చెబుతూ ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్టినట్టు కేంద్రం వెల్లడించింది.

07/05/2018 - 05:35

న్యూఢిల్లీ, జూలై 4: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతుల ఆదాయాన్ని రెండింతలు చేసే దిశగా 2018-19 సంవత్సరానికి గాను పధ్నాలుగు ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను బాగా పెంచారు. మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల ఉపసంఘం ఈ నిర్ణయాలు తీసుకున్నది. వరి ధాన్యం మద్దతు ధరను క్వింటాలుకు రూ.200 పెంచటం గమనార్హం.

07/04/2018 - 18:06

న్యూఢిల్లీ: తన భార్య సునంద పుష్కర్ హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ వేసిన పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్‌లో పెట్టింది. శవిథరూర్‌కు బెయిల్ మంజూరుచేస్తే దేశం విడిచి వెళ్ల ప్రమాదం ఉందని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. వాదోపవాదాలు విన్న తరువాత న్యాయమూర్తి తీర్పును రిజర్వ్‌లో పెట్టారు. దీనిపై గురువారం తీర్పు వెలువడే అవకాశం ఉంది.

07/04/2018 - 18:01

ఝూర్ఖండ్: ఝూర్ఖండ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. సెరాయికెల-ఖర్షావన్ జిల్లాలోని కప్రాసాయి ప్రాంతంలో ఓ వ్యక్తి పాఠశాలలోకి ప్రవేశించి టీచర్ తలను నరికాడు. అతనికి మతిస్థిమితం లేదు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

07/04/2018 - 14:05

ముంబయి: ముంబయిలోని మరో బ్రిడ్జికి పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రాండ్ రోడ్‌ను నాన చౌక్‌ను కలిపే వంతెనపై రోడ్డుకు పగుళ్లు ఏర్పడ్డాయి. పోలీసులు ఈరోడ్డుపై వాహనాలను నిలిపివేశారు. ట్రాఫిక్‌ను మరోవైపు మళ్లించారు.

07/04/2018 - 14:04

డెహ్రాడూన్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి ఏన్‌డీ తివారీ(92) ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. మెరుగైన చికిత్స కోసం ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Pages