S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/04/2018 - 13:09

మేసాయి: థాయిలాండ్ గుహలో చిక్కుకున్న చిన్నారులు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు రెండో వీడియో విడుదల అయింది. ఆ వీడియో చూసిన తల్లిదండ్రులు ఆనందం వ్యక్తంచేశారు. థాయ్ లుయాంగ్ గుహలో చిక్కుకుపోయిన ఈ 12మంది బాలురు, వారి ఫుట్‌బాల్ కోచ్, వారిని కపాడటానికి వెళ్లిన గజ ఈతగాళ్లతో కలిసి వీడియోలో నవ్వుతూ కనిపించారు.

07/04/2018 - 13:07

న్యూఢిల్లీ: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలని, ప్రభుత్వ విధులకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆటంకంగా మారవద్దని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పేర్కొంది. గత కొంతకాలంగా వివాదంగా మారిన ఢిల్లీ పరిపాలన అధికారాలపై బుధవారంనాడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

07/04/2018 - 05:33

ముంబాయి, జూలై 3: దేశ వాణిజ్య రాజధాని ముంబాయిలో భారీ వర్షాలతో ప్రజాజీవితం అతలాకుతలమైంది. రైళ్లు, విమాన, బస్సు సర్వీసులకు అంతరాయం కలిగింది. సబర్బన్‌లోని అంధేరీ వద్ద రైలు మార్గంపై రోడ్డు పై వంతెన కూలిపోవడంతో లోకల్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వంతెన కూలడంతో ఐదుగురికి గాయలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో పశ్చిమ రైల్వే జోన్‌లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

07/04/2018 - 02:28

న్యూఢిల్లీ, జూలై 3: కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన శాఖలో కోటి మందికి ఉద్యోగాలు వచ్చాయని రోడ్డు రవాణా, హైవేలు, నౌక, జలవనరులు, నదుల అభివృద్ధి మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఉపాధి కల్పనపై ప్రతిపక్షాల చేస్తున్న ఆరోపణలను మంగళవారం ఆయన కొట్టిపారేశారు.

07/04/2018 - 05:57

* ప్రాంతీయ పార్టీల స్థాయికి కాంగ్రెస్ పడిపోయింది *కొన్ని రాష్ట్రాల్లో ప్రాతినిధ్యమే కరవయిందని ఎద్దేవా

07/04/2018 - 05:55

న్యూ ఢిల్లీ, జూలై 3: గోపరిరక్షణ పేరిట ఏర్పాటైన దళాలు మనుషులను చంపే సంస్కృతిని శాంతిభద్రతల సమస్యగా చూడరాదని, ఇది ముమ్మాటికి నేరమని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారం వ్యవహరించేవారిని ఉపేక్షించరాదని, చట్ట అతిక్రమణకు పాల్పడేవారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది.

07/03/2018 - 17:50

న్యూఢిల్లీ: పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు రెండూ ఉగ్రవాద అనుకూల పార్టీలేనని, ఈ రెండు పార్టీలు పొత్తుపెట్టుకుంటే కాశ్మీర్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. తాము ఇపుడు ఉగ్రవాదుల ఏరివేత చేపట్టాం. అలాగే కాశ్మీర్‌లో కార్యకర్తలను సమీకరించే పనిలో పార్టీ నేతలు ఉన్నారని ఆయన తెలిపారు.

07/03/2018 - 17:48

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరాన్ని అరెస్టు చేయవద్దని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు నేటితో ముగియనుండటంతో చిదంబరం మళ్లీ కోర్టును ఆశ్రయించారు. మరో నెల రోజుల పాటు గడువును పొడిగించాలని కోరారు. జస్టిస్ ఎ.కె.పాథక్ ఎలాంటి అరెస్టులు చేపట్టవద్దని సీబీఐని ఆదేశించారు.

07/03/2018 - 17:46

న్యూఢిల్లీ: సునంద పుష్కర్ హత్యకేసుకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ ముందస్తు బెయిల్ కోసం మంగళవారం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఢిల్లీ కోర్టు థరూర్‌ను నిందితుడిగా గుర్తిస్తూ ఈనెల 7న విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశిస్తూ సమన్లు జారీ చేసిన విషయం విదితమే. సునందా పుష్కర్ మృతితో తనకు సంబంధం లేదని శశిథరూర్ వాదిస్తున్నారు.

07/03/2018 - 13:52

న్యూఢిల్లీ: ట్యాక్సీల్లో ప్రయాణించే మహిళా డ్రైవర్ల పట్ల కొందరు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, వారికి భద్రత కల్పించాలని కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. మహిళల భద్రత కోసం సరైన మార్గదర్శకాలను రూపొందించాలని కోరారు. క్యాబ్‌లు సురక్షితంగా లేవని పేర్కొన్నారు.

Pages