S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/03/2018 - 05:10

న్యూఢిల్లీ, జూలై 2: అమరనాథ్ యాత్ర చేస్తున్న భక్తులపై ఉగ్రదాడి పొంచి ఉంది. లష్కర్-ఇ-తొయిబాసంస్థ ఆధ్వర్యంలో ఈ దాడి కుల్గాంలోని వీసుమీర్ బజార్‌లో జరపడానికి కుట్ర జరిగింది. దీనికి మహ్మద్ నవీద్ జుత్ అలియాస్ ఆబు హంజలా నేత్వత్వం వహించవచ్చునని నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి.

07/03/2018 - 05:08

న్యూఢిల్లీ, జూలై 2: జూన్‌లో వినియోగదారుల కొనుగోలు శక్తి, వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాల ప్రవృత్తి నిలకడగానే ఉందని ద జినిసిస్ ఇండియా కన్స్యూమర్ సెంటిమెంట్ (జిఐసిఐ) ప్రకటించింది. వినియోగదారుల కొనుగోలు శక్తి, వారు జరిపే ఆర్థిక వ్యవహారాల స్థాయిని లెక్కకెట్టి వెల్లడించే జిఐసిఐ జూన్‌లో ప్రజల కొనుగోలు శక్తి నిలకడగానే ఉందని చెప్పింది.

07/03/2018 - 05:07

న్యూఢిల్లీ, జూలై 2: అస్థిర వాతావరణ పరిస్థితుల నుంచి భారత వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలంటే వ్యవసాయ యోగ్యమైన భూమి పరిమాణాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం సూచించారు. వ్యవసాయ రంగంలో ఎంతగా భూ పరిమాణాన్ని పెంచగలిగితే అంతగానూ ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు.

07/03/2018 - 05:45

న్యూఢిల్లీ, జూలై 2: ఉత్తర ఢిల్లీ ప్రాంతంలోని బురాలి ప్రాంతంలో 11 మంది అనుమానాస్పద మృతి వెనుక మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే మతపరమైన విశ్వాసాల వల్ల వారు మృతి చెంది ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఆదివారం ఒకే కుటుంబానికి చెందిన 11 మందిలో 10మంది కళ్లకు గుడ్డలు కట్టుకుని, చేతులు కట్టివేసి ఇంట్లో వేళ్లాడుతూ ఉన్న స్థితిలో మరణించి ఉన్నారు. ఒక వృద్ధురాలు వేరే గదిలో మృతి చెంది ఉంది.

07/03/2018 - 02:44

న్యూఢిల్లీ, జూలై 2: దేశవ్యాప్తంగా ఈ వారంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే జమ్మూకాశ్మీర్‌సహా ఉత్తరాదిన పలు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతుండగా, రుతు పవనాల ప్రభావం కారణంగా ఈ వారంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు తప్పవని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది.

07/03/2018 - 05:49

న్యూఢిల్లీ, జూలై 2: దేశంలో లోక్‌పాల్‌ను ఎప్పుడు నియమిస్తారో తమకు పది రోజుల్లో తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. రంజన్ గాగోయ్, ఆర్.్భనుమతితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు గత ఏడాది 27నే ఆదేశించినా ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపిస్తూ కామన్ కాజ్ అనే ఎన్జీవో సంస్థ సుప్రీంలో కేసు దాఖలు చేసింది.

07/02/2018 - 17:16

బుందేల్‌ఖడ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఉంటే రాయలసీమ ఈపాటికి అభివృద్ధిచెంది ఉండేదని మాజీ ఎంపీ, వైఎస్సాఆర్ కాంగ్రెస్ నేత అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. అనంతపురంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వంచన దీక్షలో ఆయన మాట్లాడుతూ..హంద్రినీవా ద్వారా మూడు లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకు పనులు జరుగుతున్నాయని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోరాటాలు జరుగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు.

07/02/2018 - 17:13

సియోల్: ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఈ నెలలో భారత్‌లో పర్యటించనున్నారు. జూలై 8 నుంచి 11వ తేదీ వరకు ఆయన పర్యటిస్తారు. ఆర్థిక సహకారంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. భారత్ పర్యటనలో భాగంగా ఆయన రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా కలవనున్నారని దక్షిణ కొరియా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.

07/02/2018 - 13:39

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 22న షార్‌కు వస్తున్నారు. షార్‌లో 629 కోట్ల రూపాయలతో నిర్మించిన రెండో వాహన అనుసంధాన భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ప్రధాని రాక సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

07/02/2018 - 13:39

న్యూఢిల్లీ: వేల కోట్ల రూపాయల ఆర్థిక కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీకి రెడ్‌కార్నర్ నోటీసు జారీ అయింది. ఈ మేరకు నీరవ్ మోదీ సోదరుడు నిషాల్‌మోదీ, ఆయన కంపెనీ ఎగ్జిక్యూటివ్ సుభాష్ పరబ్‌కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఈ రెడ్‌కార్నర్ నోటీసు వల్ల సభ్యత్వం ఉన్న దేశాల్లో ఎక్కడ నీరవ్ ఉన్నా ఆయనను అరెస్టు చేసే వీలుంది.

Pages