S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/18/2018 - 03:46

న్యూఢిల్లీ, జూన్ 17: విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఏడు రోజుల విదేశీ పర్యటనల నిమిత్తం ఆదివారం బయలుదేరి వెళ్లారు. ఇటలీ, ఫ్రాన్స్, లగ్సెమ్‌బర్గ్ మరియు బెల్జియం దేశాల్లో ఆమె పర్యటిస్తారు. ఈ నాలుగు ఐరోపా దేశాలతో భారత వ్యూహాత్మక వాణిజ్య సంబంధాలను మరింత మెరుగు పరచుకునే లక్ష్యంతో ఆమె ఈ పర్యటనను కొనసాగిస్తున్నారు.

06/18/2018 - 03:46

న్యూఢిల్లీ, జూన్ 17: నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో సుదీర్ఘంగా ప్రసంగిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబును హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్షర క్రమం ప్రకారం ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాట్లాడే అవకాశం వచ్చింది. అయితే అందరికీ కేవలం ఏడు నిమిషాలు మాత్రమే మాట్లాడాలని ముందుగానే నిర్ణయించారు.

06/18/2018 - 03:45

ముంబాయి, జూన్ 17: రైతు రైతే. క్షణికావేశం, పరిస్థితుల ప్రభావం వల్ల నేరాలకు పాల్పడి శిక్షలను అనుభవిస్తున్న ఖైదీలకు కూడా రైతు రుణమాఫీ స్కీం వర్తించే విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్రప్రభుత్వం చూపించిన ఔదర్యం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివరాలను నాగ్‌పూర్ మాజీ కలెక్టర్, ప్రస్తుతం ముంబాయి సబర్బన్ కలెక్టర్‌గా పనిచేస్తున్న సచిన్ కుర్వే చెప్పారు.

06/18/2018 - 03:44

న్యూఢిల్లీ, జూన్ 17: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమాన్ని, పాలనను గాలికొదిలేసి కేవలం ప్రచారంకోసం ఆరాటపడుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు.

06/18/2018 - 02:34

చిత్రం..ప్రపంచ కరాటే దినోత్సవం సందర్భంగా ఆదివారం అహ్మదాబాద్‌లో ‘కాటా’ విన్యాసాలు ప్రదర్శిస్తున్న 7వేల మంది చిన్నారులు

06/18/2018 - 02:33

న్యూఢిల్లీ, జూన్ 17: జీశాట్-11ను ప్రయోగించడానికి ఇస్రో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత మార్చి నెలలో ప్రయోగించిన జీశాట్-6ఎతో ఇస్రో సంబంధాలు కోల్పోయింది. ఇప్పటికీ ఈ ఉపగ్రహంతో సంబంధాలకోసం ఇస్రో యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ గయానా, కౌరూ నుంచి జీశాట్-11ను పూర్తి పరీక్షల నిమిత్తం ఇస్రో వెనక్కి తెప్పించింది.

06/18/2018 - 02:33

కాఠ్మండు, జూన్ 17: ప్రపంచంలోనే అత్యునత శిఖరం వౌంట్ ఎవరెస్ట్ పెద్ద డంపింగ్ యార్డ్‌గా మారిపోతోంది. దశాబ్దాలుగా ఔత్సాహికులు వౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇదే సమయంలో తమతో తెచ్చుకున్న వివిధ పదార్థాలను ఇక్కడ విచ్చలవిడిగా పారవేస్తుండటంతో ఎవరెస్ట్ పెద్ద డంపింగ్ యార్డుగా మారిపోతున్నది.

06/18/2018 - 02:31

న్యూఢిల్లీ, జూన్ 17: కేంద్రం ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా పరిరక్షం పథకంలో లోపాలు ఉన్నాయని, నిర్వహణలో లోటుపాట్లు ఉన్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పేర్కొంది. వివిధ రోగాలు, వ్యాధులు నయం చేసేందుకు కేంద్రం ఈ స్కీం కింద నిర్దేశించిన ధరలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. ఈ నిబంధనలు ఆచరణ యోగ్యంగా లేవన్నారు.

06/18/2018 - 02:29

పూంచ్ (జమ్ముకాశ్మీర్), జూన్ 17: వీర జవాన్ ఔరంగజేబును ఉగ్రవాదులు పొట్టనబెట్టుకోవడంతో కాశ్మీర్ లోయలో విషాదచ్చాయలు అలుముకున్నాయి. ఉగ్రవాదుల దాడికి బలైన జవాన్ ఔరంగజేబు అంత్యక్రియలకు ఆదివారం ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై భారత్ అనుకూల, పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు చేశారు. పూంచ్ జిల్లాలో సలాని అనే గ్రామంలో ఔరంగజేబు అంత్యక్రియలు జరిగాయి.

06/18/2018 - 02:29

న్యూ ఢిల్లీ, జూన్ 17: కాశ్మీర్ శాంతి భద్రతలను నెలకొల్పడంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ప్రధాని మోదీ విదేశీ ప్రయాణాలతో కాలక్షేపం చేశారని పేర్కొంది. కాశ్మీర్‌పై మొదటిసారిగా ఐక్యరాజ్యసమితి నివేదిక విడుదల చేసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ధ్వజమెత్తారు.

Pages