S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/18/2018 - 01:50

న్యూఢిల్లీ, జూన్ 17: అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం విదేశీ వ్యవహారాలు, రక్షణ, మైక్రో ఎకనమిక్, అంతర్జాతీయ అంశాలపై దృష్టి సారించి ఆరోగ్యం, విద్య పట్టణాభివృద్ధి, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాలను రాష్ట్రాలకు వదిలి వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిపాదించారు.

06/18/2018 - 01:44

న్యూఢిల్లీ, జూన్ 17: ఆదివారం జరిగిన నీతిఆయోగ్ సమావేశంలోవిపక్షాలన్నీ ఏకమైనట్టు స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా బీజేపీ యేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంతా ఒక్కటయ్యారు. కేంద్రం సహకార సమాఖ్య వ్యవస్థను అనుసరించాలని, రాష్ట్రాల వ్యవహారల్లో అనవసరంగా కేంద్రం జోక్యం తగదని వారు కోరారు. 15వ ఆర్థిక సంఘం నివేదిక, కేంద్ర నిధుల పంపిణీ, వంటి అంశాలపై ఈ ముఖ్యమంత్రులు ఎన్‌డీఏ ప్రభుత్వంపై దాడికి దిగారు.

06/18/2018 - 04:40

న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్‌లో హింసకు పాల్పడే శక్తులను ఉపేక్షించవద్దని, దేశ భద్రతకు విఘాతం కలిగించే శక్తులను నిర్మూలించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించారు. రంజాన్ మాసం సందర్భంగా ఒక నెల రోజుల పాటు ప్రకటించిన కాల్పుల విరమణను ఎత్తివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. హింసకు పాల్పడే శక్తులను తుదముట్టించాలని ఆయన భద్రతా బలగాలకు స్పష్టం చేశారు.

06/18/2018 - 01:18

న్యూఢిల్లీ, జూన్ 17: కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించటం ద్వారా దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

06/18/2018 - 01:11

న్యూఢిల్లీ, జూన్ 17: దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించాలంటే ఇంకా అనేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.

06/17/2018 - 04:14

న్యూఢిల్లీ: ప్రతిపక్షానికి చెందిన నలుగురు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, కుమారస్వామి, విజయన్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ బైజల్ నివాసంలో ధర్నా చేస్తున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతు తెలిపారు. నలుగురు సీఎంలు శనివారం రాత్రి కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి ఆయన సతీమణి సునీతను కలిసి మద్దతు పలికారు.

06/17/2018 - 03:43

కటక్, జూన్ 16: మావోయిస్టుల నుంచి పెద్ద నల్లధనం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు నల్లధనం వెలికితీతపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ బృందం ప్రకటించింది. అక్రమ వ్యాపారం, బలవంతపు వసూళ్ల ద్వారా మావోయిస్టులు పెద్ద ఎత్తున నల్ల ధనాన్ని సమకూర్చుకుంటున్నట్లు సిట్ వైస్ చైర్మన్, రిటైర్డు న్యాయమూర్తి ఆర్జిత్ పసాయత్ చెప్పారు.

06/17/2018 - 03:39

బెంగళూరు, జూన్ 16: ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆదివారం కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరినట్లు కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు. కావేరి నదీ జలాల యాజమాన్య అథారిటీ అంశంపై చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన ఢిల్లీకి వచ్చారు. కాగా ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలవనున్నట్లు ఆయన చెప్పారు.

06/17/2018 - 03:38

న్యూఢిల్లీ, జూన్ 16: ఢిల్లీ నగర వాతావరణంలో కాలుష్య స్థాయి శనివారం తగ్గినా, ప్రమాదకర స్థాయిలోనే ఇంకా కొనసాగుతోందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు పేర్కొంది. శనివారం ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో పిఎం 10 స్థాయిలో కాలుష్య స్థాయి 522, ఢిల్లీలో 529 నమోదైంది. బుధవారం ఎన్‌సిఆర్ ఢిల్లీలో కాలుష్య స్థాయి 778కి, ఢిల్లీలో 824 స్థాయి నమోదైంది.

06/17/2018 - 01:58

ఈద్ ఉల్ ఫితర్‌ను దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. సామూహిక ప్రార్థనలతో మసీదుల పరిసర ప్రాంతాలు కొత్త శోభను సంతరించుకున్నాయ. జైపూర్, ముంబయిలోని బాంద్రా రైల్వేస్టేషన్
వద్దనున్న మసీదు, ఢిల్లీలోని జామా మసీదు పరిసరాల్లో సామూహికంగా నమాజు చేస్తున్న దృశ్యాలను పై చిత్రాలలో చూడవచ్చు.

Pages