S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/17/2018 - 01:53

శ్రీనగర్/ జమ్ము, జూన్ 16: పవిత్ర రంజాన్ రోజూ కాశ్మీర్‌లో అల్లర్లు ఆగలేదు. పుల్వామా జిల్లాలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తలెత్తిన ఘర్షణల్లో ఒక యువకుడు మృతిచెందాడు. అనంత్‌నాగ్ జిల్లాలో చోటుచేసుకున్న ఘర్షణల్లో గ్రనేడ్ పేలి మరో యువకుడు మృతి చెందాడు. ఇక రజౌరి జిల్లాలోని వాస్తవాధీన రేఖవద్ద కాల్పుల విమరణ ఉల్లంఘనకు పాల్పడిన పాక్ మిలట్రీ మూకల చేతిలో భారత్ జవాను బికాస్ గురుంగ్ కన్నుమూశాడు.

06/17/2018 - 01:50

న్యూఢిల్లీ, జూన్ 15: రంజాన్ పండగ సందర్భంగా భారత రాష్టప్రతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ వేరువేరు సందేశాల్లో ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. సౌభ్రాతృత్వం, సోదర భావన, సామరస్యం, సుఖ సంతోషాలతో ప్రజలు శాంతి జీవనం కొనసాగించాలని వారు ఆకాక్షించారు. భారత సమాజం సామరస్యానికి ప్రతీకని ప్రధాని సందేశంలో తెలిపారు.

06/17/2018 - 01:38

శ్రీనగర్, జూన్ 16: కాశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ దళానికి చెందిన జవాను ఔరంగజేబును మిలిటెంట్లు విచారించిన తర్వాత కాల్చి చంపిన దృశ్యాలను వీడియో తీసిన ఘటన వెలుగు చూసింది. ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మిలిటెంట్లు గతంలో జవాన్ ఔరంగజేబు పాల్గొన్న ఎన్‌కౌంటర్ల గురించి ఆరా తీసిన దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియోలో దృశ్యాల నిడివి 1.15 నిమిషాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

06/17/2018 - 02:41

న్యూ ఢిల్లీ: అమెరికా దిగుమతులపై సుంకాలను పెంచడంతో భారత్ కూడా అదేబాటలో నడవాలని నిర్ణయించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను పెంచే విషయమై ప్రపంచ వాణిజ్య సంస్థకు తెలిపింది. మొత్తం 30 వస్తువులపై సుంకాలను పెంచనున్నారు. ఇందులో మోటార్ సైకిళ్లు, ఇనుము, స్టీలు ఉత్పత్తులు, బోరిక్ యాసిడ్ తదితరాలు ఉన్నాయి.

06/17/2018 - 01:20

న్యూఢిల్లీ, జూన్ 16: కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీయేతర పక్షాల సీఎంలు పక్కావ్యూహంతో నీతిఆయోగ్ భేటీకి సిద్ధమయ్యారు. నీతిఆయోగ్ సమవేశానికి ఒకరోజు ముందే ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్నాటక సీఎం కుమారస్వామి, కేరళ సీఎం పినరయి విజయన్ శనివారం ఏపీ భవన్‌లో సమావేశమై నీతి ఆయోగ్ పాలక మండలి భేటీలో అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసుకున్నారు.

06/16/2018 - 18:00

శ్రీనగర్‌: పవిత్ర రంజాన్‌ రోజు కూడా జమ్ముకాశ్మీర్‌లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. అనంత్‌నాగ్‌లో రంజాన్‌ ప్రార్థనలు జరిగిన అనంతరం ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు, పెల్లెట్‌ గన్స్‌ ప్రయోగించారు. ఈ అల్లర్లలో షెరాజ్‌ అహ్మద్‌ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

06/16/2018 - 13:18

పూణె: పూణెలో ఏడాది వయసున్న చిన్నారిపై అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. ఆపై ఆ చిన్నారిని హతమార్చాడు. చిన్నారి తలపై బలంగా కొట్టడంతో తల నుజ్జు నజ్జు అయింది. గురువారం జరిగిన ఈ సంఘటన సీసీటీవీ కెమెరాల ద్వారా వెలుగులోకి వచ్చింది. మల్హరి బన్సోడే అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డట్టుగా పోలీసులు గుర్తించారు. నిద్రపోతున్న చిన్నారిని ఎత్తుకెళ్లి ఈ దుశ్చర్యకు పాల్పడ్డడని లోని కల్బోర్ పోలీసులు తెలిపారు.

06/16/2018 - 12:54

కర్ణాటక : కావేరీ నదీ జలాల వివాదం త్వరలోనే పరిష్కారమయ్యే అవకాశం ఉందని కర్ణాటక సీఎం కుమారస్వామి గౌడ ఆశాభావం వ్యక్తం చేశారు.కాబినీ డ్యామ్ నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సిందిగా నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించానని, తద్వారా రెండు రాష్ట్రాల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.

06/16/2018 - 12:25

జమ్ముకాశ్మీర్‌: సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్‌ బలగాలు భారత సిబ్బందిపై రంజాన్‌ రోజు కూడా కాల్పులకు పాల్పడింది. ఆర్నియా సెక్టార్‌లో ఈ ఉదయం 4 గంటల నుంచి పాక్‌ రేంజర్స్‌ కాల్పులు జరుపుతున్నట్లు భారత ఆర్మీ వెల్లడించింది. పాక్‌ చర్యను భారత సిబ్బంది సమర్థంగా తిప్పికొడుతున్నట్లు పేర్కొంది.

06/16/2018 - 12:24

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రంజాన్‌ పండుగ జరుపుకుంటున్నారు. ఈద్‌-ఉల్‌-ఫితర్‌ను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఈద్‌ ముబారక్‌, ఈ పండుగ రోజున మన సమాజంలోని ఐక్యత, సామరస్యం మరింత పెంపొందాలని ఆశిస్తున్నా’ అని మోదీ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా ప్రజలకు రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Pages