S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/16/2018 - 00:50

న్యూఢిల్లీ, జూన్ 15: 20 జిల్లాల్లో 18 లక్షల ఎకరాలకు సాగునీరందించే తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు 20వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30కు ప్రధాని నివాసంలో మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యాంశాలపై పది వినతిపత్రాలు సమర్పించారు. కేసీఆర్ విజ్ఞప్తులకు మోదీ సానుకూలంగా స్పందించినట్టు తెరాస వర్గాలు వెల్లడించాయి.

06/16/2018 - 01:38

హాల్దియా, జూన్ 15: నడి సముద్రంలో మంటల్లో చిక్కుకున్న కంటైనర్ నౌక నుంచి 22 మందిని కోస్ట్‌గార్డ్ బలగాలు రక్షించాయి. అల్పపీడనంతో బంగాఖాఖాతం అల్లకల్లోలంగా ఉన్న సమయంలో ఎంవి ఎస్‌ఎస్‌ఎల్ కోల్‌కతా షిప్ మంటల్లో చిక్కుకుంది. ఈ నౌకలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో 22 మంది ఉన్నారు. ఈ ఘటన బుధవారం రాత్రి 11 గంటలకు జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 70 శాతం నౌక కాలిపోయింది.

06/16/2018 - 01:36

క్రీరి (జమ్మూ, కాశ్మీర్), జూన్ 15: గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమైన రైజింగ్ కాశ్మీర్ ఎడిటర్ షుజాత్ బుఖారీకి అతని స్వగ్రామం క్రీరిలో శుక్రవారం ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది అతని అంతిమయాత్రలో పాల్గొన్నారు.

06/15/2018 - 17:23

సుక్మా: ఛత్తీస్‌గఢ్ సుక్మాజిల్లాలోని చిత్రగుఫా ఏరియాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. రిజర్వ్‌గార్డ్ పోలీసులు, స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసుల కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు.

06/15/2018 - 17:22

జమ్మూకాశ్మీర్: ఉగ్రవాదులు చేతుల్లో హతమైన జర్నలిస్ట్ బుఖారి అంత్యక్రియలు శుక్రవారంనాడు అభిమానులు, జర్నలిస్టుల అశ్రునయనాల మధ్య జరిగాయి. బరాముల్లా జిల్లాలోని బుఖారి పూర్వీకుల నివాసంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. తొలుత అంతిమయాత్ర నిర్వహించారు.

06/15/2018 - 17:12

న్యూఢిల్లీ: పెండింగ్ ప్రాజెక్టులతో సహా వివిధ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.20వేల కోట్లు ఇవ్వాల్సిందిగా కోరారు. అలాగే నవోదయ పాఠశాలల సంఖ్యను పెంచాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుచేయాలని కోరారు.

06/15/2018 - 13:58

న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్.. రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు. కొత్త జోనల్ విధానం, ఎస్టీ, ముస్లింల రిజర్వేషన్ల పెంపు అంశంపై సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో చర్చించనున్నారు.

06/15/2018 - 13:45

గోవా : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ విధుల్లోకి చేరారు. సీఎం పారికర్ తన ఛాంబర్‌లో ముఖ్య అధికారులతో సమావేశమై..పలు అంశాలపై చర్చించారు. సీఎం పారికర్ అధ్యక్షతన మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. కొంతకాలంగా జీర్ణ సంబంధ సమస్యతో బాధపడుతున్న పారికర్ మూడు నెలలు అమెరికాలో చికిత్స తీసుకున్నారు.

06/15/2018 - 13:31

పాట్నా : బీహార్‌లోని గయాలో దారుణం జరిగింది. భర్తను చెట్టుకు కట్టేసి.. భార్య, కూతురిపై సామూహిక అత్యాచారం చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన జరిగింది. గయాలోని గురారు బజార్‌లో ఓ వ్యక్తి క్లినిక్ నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో తన క్లినిక్‌ను బంద్ చేసి.. భార్య, కూతురితో కలిసి ఇంటికి వెళ్తున్నాడు.

06/15/2018 - 13:06

అహ్మదాబాద్: ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేసానంటూ పాటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఖండించారు. ఇది పూర్తిగా సత్యదూరమని అన్నారు.పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ, పార్టీ అధినాయకత్వం స్థాయిలో కానీ దానిపై (రాజీనామాపై) ఎలాంటి చర్చా జరగలేదని ఆయన వివరించారు.

Pages