S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/15/2018 - 14:00

శ్రీనగర్ : రైజింగ్ కాశ్మీర్ దినపత్రిక ఎడిటర్ షుజాత్ బుఖారి(53)ని హత్య చేసిన ముగ్గురు నిందితుల ఫోటోలను కాశ్మీర్ పోలీసులు శుక్రవారం విడుదల చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు నిందితులు బైక్‌పై వెళ్తున్న ఫోటోలను పోలీసులు రిలీజ్ చేశారు. ఈ ముగ్గురిని సాధారణ ప్రజలు గుర్తుపడితే సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

06/15/2018 - 05:00

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే సంవత్సరం జరిగే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గట్టిగా ఎదుర్కొనేందుకు బీజేపీ అధినాయకత్వం వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది.

06/15/2018 - 03:57

జెనీవా, జూన్ 14: కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ఈ వ్యవహారాలపై అంతర్జాతీయ విచారణ అవసరమని ఐక్యరాజ్యసమితి తొలిసారిగా ప్రకటించిన నివేదికలో పేర్కొంది. భారత్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్, పాకిస్తాన్ ఆధీనంలోని కాశ్మీర్ భూభాగంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందనే అభియోగాలు ఉన్నాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

06/15/2018 - 03:55

న్యూఢిల్లీ, జూన్ 14: గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రమైన మంచినీటిని సరఫరా చేయాలంటే ప్రజలు, ప్రభుత్వ భాగస్వామ్యం అవసరమని కేంద్ర మంత్రి ఉమా భారతి అన్నారు. కేవలం ప్రభుత్వం, పాలనాపరమైన చొరవతోపాటు ప్రజలను మంచినీటి ప్రాజెక్టులు, సరఫరాలో భాగస్వామ్యం కల్పించాలన్నారు.

06/15/2018 - 03:50

లక్నో, జూన్ 14: ఉత్తరప్రదేశ్‌పై ప్రకృతి పగబట్టింది. ప్రచండ గాలులు, భారీ వర్షాలకు దుమ్మూదూళి తోడై బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు రోజుల వర్షానికి 15 మంది మరణించారని, 18 మంది గాయపడ్డారని అధికారి ప్రతినిధి గురువారం వెల్లడించారు. సీతాపూర్‌లో ఆరుగురు, గోండా, కౌశాంబిలో ముగ్గురేసి, ఫైజాబాద్, హార్డోయ్, చిత్రకూట్‌లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. సీతాపూర్‌లో 17 మంది, ఫైజాబాద్‌లో 11 మంది గాయపడ్డారు.

06/15/2018 - 03:41

శ్రీనగర్, జూన్ 14: రైజింగ్ కాశ్మీర్ ఎడిటర్ ఇన్ చీఫ్ షూజాత్ బుఖారీ గురువారం ఇక్కడ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆయన చనిపోయారు. దుండగుల కాల్పుల్లో బుఖారీ వ్యక్తిగత భద్రతాధికారి తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ సమీపాన ఉన్న ప్రెస్ కాలనీ వద్దే ఈ దారుణం చోటుచేసుకుంది. బుఖారీపై ఇంతకు ముందూ హత్యాయత్నం జరిగింది. 2000 సంవత్సరంలో ఆయనపై దాడి జరిగింది.

06/15/2018 - 03:40

జైపూర్, జూన్ 14: ఒక తుక్కు వ్యాపారి వద్దకు అమ్మకానికి వచ్చిన పాతపేపర్లు ఉన్న సంచిలోని కట్టలో రెండు వేల ఆధార్ కార్డులు బయటపడ్డాయి. జైపూర్‌లోని జలపుర ప్రాంతానికి చెందిన తుక్కువ్యాపారి ఇమ్రాన్‌కు ఎవరో పాత పేపర్లను అమ్మారు. ఆ పేపర్లను సరిచేస్తుండగా అందులోంచి రెండు వేల ఆధార్ కార్డులు కనిపించాయి. దీంతో విస్మయం చెందిన ఆయన వెంటనే ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు, ఐటి అండ్ కమ్యూనికేషన్ శాఖకు తెలియజేశాడు.

06/15/2018 - 03:37

జైపూర్, జూన్ 14: రాజ్‌పుట్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి మహేశ్వరి ముక్కూ చెవులు కత్తిరిస్తామని శ్రీరాజ్‌పుట్ కర్నిసేన హెచ్చరించింది. బాలీవుడ్ చిత్రం పద్మావత్‌కు నిరసగా కర్నిసేన పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఓ బ్యారేజ్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడుతూ ‘ఇక్కడ జనాలు వానాకాలం ఎలుకల వలే ఎన్నికలు సమయంలో బొరియల నుంచి బయటకు వస్తారు’ అని అన్నారు.

06/15/2018 - 01:22

భిలాయ్ (చత్తీస్‌గఢ్), జూన్ 14: అభివృద్ధి, సంక్షేమం ద్వారానే హింసామార్గంలో వెళ్లేవారికి బదులివ్వాలని, శాంతి భద్రతలు నియంత్రించడం వల్ల ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బస్తర్ ప్రాంతమంటే బాంబులు, తుపాకులు గుర్తుకు వచ్చేవని, ఈ రోజు విమాన సర్వీసులు కూడా ప్రారంభించామని ఆయన అన్నారు. గురువారం ఇక్కడ రూ.22 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు.

06/15/2018 - 01:43

న్యూఢిల్లీ, జూన్ 14: నాలుగు రోజులుగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, అతని మంత్రివర్గ సహచరులు ముగ్గురు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నా వారికి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బాలాజీ నాలుగు నిముషాలైనా కేటాయించలేరా? అని ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Pages