S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/14/2018 - 13:27

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. దట్టమైన దుమ్ము పొరలు అలుముకోవడంతో ఛండీగర్‌ విమానాశ్రయంలో అన్ని విమానాలను నిలిపివేశారు.

06/14/2018 - 13:20

జైపూర్ : రాజస్థాన్‌లోని పుష్కర్‌లో ఫ్రెంచ్ యువతి అదృశ్యమైంది. ఫ్రాన్స్‌కు చెందిన గేలి చౌట్యూ(20) మే 30న పుష్కర్‌లోని హాలీ కా చౌక్‌లోని ఓ హోటల్‌లో బస చేసింది. అయితే జూన్ 1న పుష్కర్ నుంచి జైపూర్‌కు బయల్దేరే క్రమంలో అదృశ్యమైంది. చౌట్యూ అదృశ్యమైన విషయాన్ని ఇండియాలోని ఫ్రాన్స్ అంబాసిడర్ అలెగ్జాండర్ జిగ్లేర్ ట్విట్టర్ ద్వారా రాజస్థాన్ పోలీసులకు తెలిపారు.

06/14/2018 - 13:04

తిరువనంతపురం : కేరళలో ఎడతెరిపిలేని వర్షాలతో మరణాల సంఖ్య ఇప్పటివరకూ 25కు చేరింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోజికోడ్‌, కన్నూర్‌లలో వరద తాకిడికి తొమ్మిదేళ్ల బాలిక మరణించగా, మరో పది మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం జాతీయ విపత్తు నిర్వహణ బలగాలకు చెందిన బృందాలు, రాష్ట్ర బృందాలు కోజికోడ్‌లో గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి

06/14/2018 - 12:40

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశిలో గురువారం వేకువజామున 6 గంటల 12 నిమిషాలకు భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది. భారత వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. భూకంప కేంద్రం ఉత్తరకాశి నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని 30.8 ఉత్తర అక్షాంశం, 78.2 తూర్పు రేఖాంశాల మధ్య కేంద్రీకృతమైంది.

06/14/2018 - 12:36

జమ్మూకాశ్మీర్: బందిపొరా జిల్లా పనార్ అటవీ ప్రాంతంలో జవాన్లు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రతిఘటించిన భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి

06/14/2018 - 03:52

న్యూఢిల్లీ, జూన్ 13: లోక్‌సభకు వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు మహాకూటమిగా ఏర్పడేందుకు తెరవెనుక చర్చలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రతిపక్షాల మహాకూటమి ఏర్పాటుకు తెరవెనుక చర్చలు ప్రారంభించినట్లు తెలిసింది.

06/14/2018 - 03:51

న్యూఢిల్లీ, జూన్ 13: తిరుమల తిరుపతి దేవస్థానం వివాదం మెల్లగా సుప్రీం కోర్టుకు చేరింది. మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు కంటే ముందుగానే ప్రస్తుత ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు బుధవారం సుప్రీం కోర్టు తలుపుతట్టారు. వేణుగోపాల తరఫున ఆయన న్యాయవాది సుప్రీం కోర్టులో కేవియేట్ దాఖలు చేశారు.

06/14/2018 - 03:49

న్యూఢిల్లీ, జూన్ 13: కేంద్ర ప్రభుత్వంలోని వెనుకబడిన కులాల రిజర్వేషన్లను నాలుగు వర్గాలుగా విభజించే అంశాన్ని అధ్యయనం చేసి తగు సిపారసులు చేసేందుకు ఏర్పాటుచేసిన బీసీ కమిషన్ కాల పరిమితి జూలై 31వ తేదీ వరకు పొడిగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందు నిర్ణయించిన ప్రకారం బీసీ కమిషన్ కాల పరిమితి జూన్ 20తో ముగుస్తుంది.

06/14/2018 - 03:47

న్యూఢిల్లీ, జూన్ 13: జాతీయ రాజధాని ఢిల్లీలో అత్యవసర పరిస్థితి వాతావరణం నెలకొన్నదని, దీన్ని తొలగించేందుకు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ తక్షణమే కలుగజేసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోరింది. ఢిల్లీ, పంజాబ్‌కు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి కోవింద్ అపాయింట్‌మెంట్ కోరామని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ వెల్లడించారు.

06/14/2018 - 04:43

ముంబయి, జూన్ 13: నేడు ఎంతో ప్రాచుర్యం పొందిన ‘హెచ్‌ఎంటి’ వరి వంగడం సృష్టికర్త, ఒక నిరుపేద దళిత రైతు అంటే ఆశ్చర్యం కలుగక మానదు. దాదాజీ ఖోబ్రాగాడే ఆయన పేరు. మొత్తం 11 వరివంగడాలను కనిపెట్టిన నిరుపేద శాస్తవ్రేత్త! దేశానికి అధిక దిగుబడినిచ్చే వరివంగడాలను సృష్టించి తాను మాత్రం దుర్భర పేదరికంలోనే 78వ ఏట ఈ నెల మొదట్లో మరణించాడు. అంతటి గొప్ప మనిషిని ఇప్పటివరకు పట్టించుకున్నవారు లేరు.

Pages