S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/07/2018 - 04:20

లక్నో, డిసెంబర్ 6: అయోధ్యలో వివాదస్పద బాబ్రీమసీదును కూల్చి 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో పలు మత సంస్థలు అనుకూలంగా, వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమాలు ప్రశాంతంగా ముగిశాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. హిందూ సంస్థలు శౌర్య దివాస్, ముస్లిం సంస్థలు బ్లాక్ డేను నిర్వహించాయి.

12/07/2018 - 04:17

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: దేశంలో పౌర రక్షణ సమితిని పునరుద్ధరించేందుకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రంగంలో దిగారు. పౌర రక్షణ సమితి, హోమ్‌గార్డులకు సంబంధించి గురువారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో రాజ్‌నాథ్ ఈ ప్రతిపాదన చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రక్షాళన చేసి సంస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు.

12/07/2018 - 04:15

లక్నో, డిసెంబర్ 6: ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యురాలు సావిత్రిబాయి పూలే గురువారం బీజేపీ నుంచి వైదొలిగారు. ఈ మేరకు ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం మాట్లాడుతూ పార్టీలో వేర్పాటువాద దోరణి ఉందని, అంతేకాకుండా ప్రజాధనాన్ని ఆలయాలు, విగ్రహాల నిర్మాణం కోసం ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని వ్యాఖ్యానించారు.

12/07/2018 - 04:13

అయోధ్య, డిసెంబర్ 6: అయోధ్యలో వివాదస్పద బాబ్రీమసీదును కూల్చి 26 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పట్టణంలోని విద్యావేత్తలు, పౌరులు, విద్యార్థులు శాంతి కావాలని కోరుతున్నారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తమ పిల్లలకు మంచి చదువు కావాలని, ఈ వివాదం శాంతియుతగా పరిష్కారం కావాలంటున్నారు. స్థానిక గౌతమ్ బుద్ద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ టీచర్ నీలయ్ తివారీ మాట్లాడుతూ, రామమందిర నిర్మాణం వివాదం కారాదన్నారు.

12/07/2018 - 04:12

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: అడవుల నరికివేతతో అభివృద్ధి సాధించాలనుకోవడం సరైన పద్ధతి కాదని, దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ జరిగిన ఎన్విరాన్‌మెంటల్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో గురువారం ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ 2000-2015 మధ్య జరిగిన మరణాల్లో ఎనిమిది శాతం కాలుష్యం వల్ల సంభవించినవేనని అన్నారు.

12/07/2018 - 04:12

బాన్స్‌వారా, డిసెంబర్ 6: వారం పది రోజులపాటు నువ్వానేనా అన్నట్టు ప్రచారంలో పాల్గొన్న రాజకీయ నాయకులు ఆరావళి పర్వతాలకు క్యూ కట్టారు. ఆరావళిలో వేంచేసిన శతాబ్దాల నాటి త్రిపుర సందరీ దేవి దర్శనానికి పయనమయ్యారు. శుక్రవారం పోలింగ్ జరుగుతుండగా దేవి ఆశీస్సుల కోసం బారులుతీరారు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా రాజకీయ ఉద్ధండులు అందరూ ఆలయాన్ని దర్శించుకుంటున్నట్టు ఆలయ కమిటీ చైర్మన్ అశోక్ పాంఛాల్ వెల్లడించారు.

12/07/2018 - 04:11

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: రైతులకు రుణమాఫీ చేయడం సమస్యకు పరిష్కారం కాదని, రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని, వారు బ్యాంకులకు రుణాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ రైతు విభాగం పేర్కొంది. ఈ విషయమై అన్ని పార్టీల రైతు సంఘాలు చర్చించాలన్నారు. రైతాంగ సమస్యలపై మనమందరం కూర్చుని చర్చించ్చి సముచిత నిర్ణయం తీసుకోవాలన్నారు.

12/07/2018 - 04:10

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: గత ఆగస్టు మాసంలో ముంచెత్తిన వరదలతో అతలాకుతలం అయిన కేరళ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అదనపుసాయాన్ని మంజూరు చేసింది. జాతీయ విపత్తుల నివారణ నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్) నుంచి కేరళకు 3,048 కోట్ల రూపాయల అదనపు సహాయాన్ని గురువారం మంజూరు చేసింది. అలాగే తుపాను పీడిత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌కు రూ.539 కోట్లు, నాగాలాండ్‌కు రూ.131 కోట్లు మంజూరు చేసినట్లు అధికారులు వివరించారు.

12/07/2018 - 01:47

ముంబయి, డిసెంబర్ 6: బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌ను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పుణే లోక్‌సభ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా రంగంలోకిదించే విషయాన్ని బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తోంది. పార్టీలోని విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం బీజేపీ చీఫ్ అమిత్‌షా ‘సంపర్క్ ఫర్ సమర్ధన్’ కార్యక్రమంలో భాగంగా మాధురీ దీక్షిత్‌ను ముంబయిలోని ఆమె స్వగృహంలో కలుసుకుని చర్చలు జరిపారు.

12/07/2018 - 01:36

ముంబయి, డిసెంబర్ 6: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్‌పైన శివసేన ధ్వజమెత్తింది. యోగి కేవలం నగరాల పేర్లు మార్చడం పట్ల శ్రద్ధపెట్టారని, రాష్ట్రంలోని వౌలిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని, దీని వల్ల బులందర్‌షహర్ ఘటనలు తలెత్తాయని పేర్కొంది. సైనికులు, పోలీసులకు మతం ఉండదన్నారు. వీరు బాధ్యతలు సజావుగా నిర్వహించేవిధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు.

Pages