S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/11/2018 - 13:35

గౌహతి : త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ నోబెల్‌ బహుమతిని వెనక్కిఇచ్చేశారని ఉదయ్‌పూర్‌లో జరిగిన రవీంద్ర జయంతి కార్యక్రమంలో పాల్గొన్న విప్లవ్‌ దేవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 1919లో జలియన్‌వాలాబాగ్‌ ఊచకోతకు నిరసనగా ఠాగూర్‌ తనకు బ్రిటన్‌ ప్రకటించిన సర్‌ టైటిల్‌ను నిరాకరించారు.

05/11/2018 - 13:19

చెన్నై: చెన్నై సినీ పరిశ్రమలో దారుణం చోటుచేసుకుంది. మదురై టోక్‌నగర్‌లోని ఎస్బీఓ కాలనీకి చెందిన సౌపా అలియాస్ సౌందర పాండియన్ (55) తన కుమారుడిని హత్యచేసి తోట బంగ్లాలో పూడ్చిపెట్టారు. ఈ సంఘటన గురవారంనాడు వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే సౌందర్ పాండియన్‌కు విపిన్(27)అనే కుమారుడు ఉన్నాడు. తల్లి లతాపూర్ణం(50) ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. భార్యభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు.

05/11/2018 - 13:08

న్యూఢిల్లీ: దుబాయ్‌లోని ఓ విలాసవంతమైన హోటల్‌లో నీటితొట్టిలో పడి మృతిచెందిన బాలీవుడ్ సూపర్‌స్టార్ శ్రీదేవి మృతిపై దర్యాపు చేయాలని సినీ నిర్మాత సునీల్‌సింగ్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై అనుమానాలు ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్‌ను జస్టిస్ దీపక్ మిశ్రా కొట్టివేశారు.

05/11/2018 - 03:18

న్యూఢిల్లీ, మే 10: టీడీపీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా భారీస్థాయిలో అవినీతికి పాల్పడిందని, టీడీపీని ప్రజాక్షేత్రంలో నిలబెడతామని బీజేపీ ఎంపీ, అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు హెచ్చరించారు. జీవీఎల్ గురువారం విలేఖరులతో మాట్లాడుతూ ఏపీలో కొన్నిరోజుల్లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉండాలని సూచించారు.

05/11/2018 - 05:22

బెంగళూరు, మే 10: హోరాహోరీగా జరిగిన కర్నాటక ఎన్నికల ప్రచారానికి గురువారంతో తెరపడింది. ముఖ్యంగా మూడు పార్టీలు పోటీపడుతున్న ఈ ఎన్నికల్లో అధికారపక్షమైన కాంగ్రెస్ పార్టీ తాము ఇన్నాళ్లూ అమలు చేసిన సంక్షేమ పథకాలపై తీవ్ర ఆశలు పెట్టుకుంది. అవే తమను మళ్లీ గెలిపిస్తాయని ధీమాను వ్యక్తం చేస్తోంది.

05/11/2018 - 02:40

న్యూఢిల్లీ,మే 10: ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.ఎం.జోసెఫ్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించే అంశం మరో మలుపు తిరిగింది.

05/11/2018 - 05:15

బెంగళూరు, మే 10: ‘ప్రధాని నరేంద్ర మోదీ నేనంటే భయపడుతున్నారు. అందుకనే నేను ప్రధానమంత్రి పదవిని చేపట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తే, ఆయన ప్రజల దృష్టిని మరల్చేందుకు యత్నిస్తున్నారు’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ ప్రధానమంత్రి పదవిని చేపడతానని చెప్పడంపై మోదీ చేసిన వ్యాఖ్యల గురించి విలేకర్లు ప్రశ్నించినప్పుడు, ‘ఈ ఎన్నికలు రాహుల్ గురించి కాదు.

05/11/2018 - 02:16

న్యూ ఢిల్లీ, మే 10: ఆధార్ కార్డుకు రాజ్యాంగ పరమైన చెల్లుబాటును కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయ స్థానం తీర్పును రిజర్వులో ఉంచినట్లు గురువారం ప్రకటించింది.

05/10/2018 - 17:11

బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. బెంగుళూరులో విలేకరులతో మాట్లాడుతూ సిద్ధరామయ్య ప్రభుత్వంపై ప్రజలు కోపంగా ఉన్నారని చెప్పారు. కర్ణాటక అభివృద్ధి, రాజధాని బెంగుళూరుపై ఆధారపడి ఉందని, కానీ బెంగుళూరుకు సిద్ధరామయ్య సర్కార్‌ చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు.

05/10/2018 - 16:47

న్యూఢిల్లీ: ఏపీ భవన్ ఉద్యోగులు గురువారంనాడు ఆందోళనకు దిగారు. రిటైర్ అయిన వారికే మళ్లీ ఉద్యోగాలు ఇస్తున్నారని ఏపీ భవన్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీ భవన్‌లోని ఉద్యోగాలన్నీ తెలుగువారికే ఇవ్వాలని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు సైతం తెలుగువారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Pages