S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/10/2018 - 16:46

న్యూఢిల్లీ: ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేయవద్దని సుప్రీం కోర్టు పశ్చిమ బెంగార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మే14 నుంచి ఫశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల ఫలితాలలో ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీల వివరాలు జూన్ 3వ తేదీ వరకు ప్రకటించవద్దని అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది.

05/10/2018 - 12:51

బెంగళూరు: సోనియా గాంధీ ఇటలీ దేశస్తురాలు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. చాలామంది భారతీయులకంటే తన తల్లి సోనియా గాంధీ గొప్పదని కౌంటర్ ఇచ్చారు. రాహుల్ బెంగళూరులో మీడియానుద్దేశించి మాట్లాడారు. ‘‘నా తల్లి ఇటలీ దేశస్తురాలు. ఈ దేశస్తురాలినని చెప్పుకునేందుకు ఆమెకు మరింత అర్హత ఉంది. ఈ దేశం కోసం ఆమె త్యాగం చేశారు.

05/10/2018 - 12:17

బెంగళూరు: కర్నాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సీఐడీ విభాగం డీఎస్పీ, సీఐ సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బాగల్‌కోట్ పట్టణంలోని సంగమా కూడలి వద్ద ఎదురుగా వస్తున్న ఓ లారీ పోలీసుల వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బెంగళూరు సీఐడీ విభాగం డీఎస్పీ బాలేగౌడ, సీఐ శివస్వామి, వాహనం డ్రైవర్ వేణుగోపాల్ అక్కడికక్కడే మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

05/10/2018 - 12:06

న్యూఢిల్లీ: బీఆర్‌ అంబేడ్కర్‌ కలను సాకారం చేసేందుకు మేం అహర్నిశలు శ్రమిస్తున్నాం. సమానత్వాన్ని మేం విశ్వసిస్తాం. దళితులు, మైనార్టీలు, మహిళలు, పేదలు ఇలా ప్రతి ఒక్కరి అభివృద్ధికి కట్టుబడి ఉంటాం అని ప్రధాని మోదీ అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది.

05/09/2018 - 17:27

ఇంఫాల్ : మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఐఈడీ పేలుడు సంభవించింది. కోయిరేంజి క్యాంపస్‌లోని బీఎస్‌ఎఫ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ పేలుడు చోటు చేసుకుంది. పేలుడు ధాటికి ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

05/09/2018 - 17:16

న్యూఢిల్లీ: ఉత్తర భారతంలో బుధవారంనాడు భూప్రకంపనలు సంభవించాయి. ఆఫనిస్థాన్‌లోని హిందుకుష్ పర్వత ప్రాంతాల్లో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. దీని తీవ్రత 6.2గా నమోదు అయింది. ఉత్తర భారతంలోని కాశ్మీర్ వ్యాలీ, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి.

05/09/2018 - 17:15

బెంగళూరు: ఓటమి భయంతోనే కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతుందని ప్రభాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ నకిలీ ఓటరు గుర్తింపు కార్డులతో ఎన్నికలలో గెలవాలని కాంగ్రెస్ యత్నిస్తుందని అన్నారు. పరిస్థితులు తారుమారు అవ్వటంతో ఇపుడు హంగ్ వస్తుందని ప్రచారం చేస్తున్నారని అన్నారు. దీన్నిబట్టి రాష్ట్రంలో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించటం ఖాయం అని అన్నారు.

05/09/2018 - 17:14

వరంగల్: మోదీ ప్రభుత్వానికి లబ్ధిచేకూరేందుకే కేసీఆర్ ఫ్రంట్‌ను ఏర్పాటుచేస్తున్నారని సీపీఐ జాతీయ నేత నారాయణ దుయ్యబట్టారు. ఆయన చెన్నబోయిన కమలమ్మ, అప్పన్న విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు ఓటు నోటు కంటే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ ప్రమాదకరమైందని అన్నారు.

05/09/2018 - 17:14

బెంగళూరు: కర్నాటకలో ఎన్నికలు సక్రమంగా జరుగకుండా ధ్వంసం చేసేందుకు బీజేపీ యత్నిస్తుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్‌శర్మ అన్నారు. కాంగ్రెస్ ప్రతినిధి బృందం బుధవారంనాడు ఎన్నికల సంఘాన్ని కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలను, ఐటీ డిపార్ట్‌మెంట్‌ను ఉపయోగించుకుని ఎన్నికలను ధ్వంసం చేయటానికి ప్రయత్నిస్తుందని అన్నారు.

05/09/2018 - 17:13

బెంగళూరు: కర్నాటకలో మోదీకి, బీజేపీకి ఉద్వాసన చెప్పనున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన బుధవారంనాడు బసవనగుడిలోజరిగిన ర్యాలీలో మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న అకృత్యాలపై ప్రధాని మోదీ పెదవి విప్పటం లేదని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ చేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా కాంగ్రెస్ తిప్పి కొడుతుందని అన్నారు.

Pages