S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/08/2018 - 10:33

న్యూఢిల్లీ, మే 4: పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ ఆలీ జిన్నా చనిపోయి దాదాపు ఏడు దశాబ్దాలు కావస్తున్నా, ఆయన పేరు నిత్యం వివాదాల్లో నానుతునే ఉంటుంది. బీజేపీ నేతలు కొందరు జిన్నాను పొగడ్తలతో ముంచెత్తుతుంటే అదే పార్టీ నేతలు ఆ నేత ఫొటోను యూనివర్శిటీ గోడకు తగిలించి అవమానిస్తున్నారు. జిన్నా ఎంతో రాజనీతిజ్ఞుడంటూ పలు సందర్భాల్లో కమలనాథులు ప్రశంసించిన సందర్భాలున్నాయి.

05/05/2018 - 03:37

న్యూఢిల్లీ, మే 4: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసకందాయంలో పడింది. అధినేతల ప్రచారాలు, మానిఫెస్టోలో విడుదల హడావుడి అదిరిపోతోంది. మధ్యమధ్యలో నేతల చలోక్తులు, చురకలు ఆహ్లాదపరుస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీ మేనిఫెస్టోపై ఓ సెటైర్ వేశారు. శుక్రవారం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుల చేసిన వెంటనే రాహుల్ ఓ వ్యాఖ్య చేశారు. ‘నేను బీజేపీ మేనిఫెస్టో రివ్యూ చేశాను.

05/05/2018 - 03:38

భోపాల్, మే 4: హిందుత్వాన్ని, హిందూ సమాజాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా డిమాండ్ చేశారు. సనాతన ధర్మం, హిందువులపై విమర్శలు చేయడం కాంగ్రెస్‌కు ఓ ఫ్యాషన్‌గా మారిందని ఆయన నిప్పులు చెరిగారు. హిందుత్వ ఉగ్రవాది అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు దేశాన్ని అగౌరపరచడమేనని షా అన్నారు.

05/05/2018 - 02:56

* బాలికల నిష్పత్తిలో గుణాత్మక మార్పు
* జాతీయ సెమినార్‌లో కేంద్ర మంత్రి మేనక ప్రశంస

05/04/2018 - 18:00

బీహార్: బీహార్‌లోని మొతిహరి ప్రాంతంలో బస్సు బోల్తాపడి దహనం అయిన ఘటనలో 27మంది చనిపోయారని అధికారులు గురువారంనాడు వెల్లడించారు. ఆయితే ఆ రాష్ట్ర మంత్రి దినేశ్ చంద్రదూదె మాత్రం ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని వెల్లడించటం గమనార్హం. దీంతో ఈ ప్రమాదం ఘటన కొత్త మలుపు తిరిగినట్లయింది.

05/04/2018 - 17:26

అలీగఢ్: జిన్నా చిత్రపటం వివాదంతో అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ అట్టుడుకుతోంది. తరగతుల బహిష్కరణకు ఏఎంయూ విద్యార్థులు పిలుపునివ్వడంతో అలీగఢ్ జిల్లాలో ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేశారు. ఈమేరకు జిల్లా మేజిస్ట్రేట్ చంద్ర భూషణ్ సింగ్ ఆదేశాలిచ్చారు.

05/04/2018 - 16:24

బెంగళూరు: దేశంలో దళితులపై దాడులు నానాటికీ పెరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. ఆయన శుక్రవారంనాడు కల్గిలోని ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ‘బేటీ బచావో..బేటీ పడావో నినాదం ‘బేటీ బచావో బీజేపీ ఎమ్మెల్యేసే’గా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. దళిత మహిళపై బీజేపీ ఎమ్మెల్యే దాడిచేస్తే ప్రధాని నోరు విప్పటంలేదని అన్నారు.

05/04/2018 - 16:22

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగిపై సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఘాటైన విమర్శలు చేశారు. యూపీలో ప్రకృతి విలయానికి వందమంది చనిపోగా.. మీరు విపత్తు బాధితులను పట్టించుకోకుండా కర్నాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం తగదని, మిమ్మల్ని ఎన్నుకున్నది కర్నాటక రాజకీయాల కోసం కాదని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి తన మఠాన్ని అక్కడే కట్టుకుని అక్కడే ఉంటే మంచిదని అన్నారు.

05/04/2018 - 16:20

కోహెన్‌హాగెన్: అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సాహిత్యంలో నోబెల్ పురస్కారం ఈ ఏడాది లేనట్టే. ఈమేరకు స్టాక్‌హోమ్‌లో జరిగిన సమావేశంలో కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనికి కారణాలను కూడా కమిటీ వెల్లడించింది. ఈ పురస్కారం కోసం ఎంపికే చేసే కమిటీ సభ్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలు, మరికొన్ని సమస్యలు తలెత్తిన నేపథ్యంలో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

05/04/2018 - 16:12

బెంగళూరు:రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరుడు గాలి సోమశేఖరరెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అనుమతినివ్వాలని గాలి జనార్థన్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గాలి సోమశేఖరరెడ్డి బీజేపీ తరపున బళ్లారి నుంచి పోటీ చేస్తున్న విషయం విదితమే.

Pages