S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/15/2018 - 01:13

అమృత్‌సర్, సెప్టెంబర్ 14: ఆందోళన కారులపై 2015లో జరిగిన పోలీసు కాల్పుల ఘటనతో సంబంధం ఉన్న పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, ఆయన తనయుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌లను మతం నుంచి బహిష్కరించాలని మాజీ క్రికెటర్, ప్రస్తుత పంజాబ్ మంత్రి నవ్‌జోత్ సింగ్ సిద్ధూ సిక్కుమత అత్యున్నత పీఠం అకల్‌తక్త్‌ను కోరారు.

09/15/2018 - 06:00

వారణాసి: వారణాసిలోని శ్రీరామతారకాంధ్రాశ్రమంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమం మేనేజింగ్ ట్రసీ వీవీ సుందరశాస్ర్తీ మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక చవిత ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఆశ్రమాన్ని శ్రీరామభద్రేంద్ర సరస్వతి స్థాపించారన్నారు.

09/14/2018 - 15:36

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్టావర్ జిల్లాలోని థాక్రీ వద్ద ప్రయాణీకులతో వెళుతున్న ఓ మినీ బస్సు అదుపు తప్పి చీనబ్ నదిలో బోల్తా పడింది. ఈ సంఘటనలో 13 మంది అక్కడికక్కడే చనిపోయారు. బస్సులో మొత్తం 25మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలిసింది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

09/13/2018 - 06:27

న్యూఢిల్లీ: తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై ఎనిమిది వారాల్లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది విద్యార్థులు మానసిక కారణాలతో ఆత్మహత్యలు చేసుకొంటున్నారని, కనీస వసతులు లేకుండా కార్పొరేట్ విద్యా సంస్థలు వ్యవహారిస్తున్నాయని న్యాయవాది శ్రవణ్‌కుమార్ ఎన్‌హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు.

09/15/2018 - 21:25

శ్రీనగర్, సెప్టెంబర్ 12: జమ్మూ-కాశ్మీర్‌లో పంచాయతీ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ జమ్మూ-కాశ్మీర్ విభాగం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. వాస్తవానికి ఎన్నికల కమిషన్ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అక్టోబర్‌లో నిర్వహించాల్సి ఉందని తెలిపింది.

09/13/2018 - 05:26

చెన్నై, సెప్టెంబర్ 12: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలులో ఉన్న ఏడుగురు దోషుల విడుదలపై తమ కేబినెట్ ప్రతిపాదనల మేరకు రాష్ట్ర గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ మంచి నిర్ణయం తీసుకుంటారని విశ్వసిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.

09/13/2018 - 05:24

బిజ్నార్ (ఉత్తర్‌ప్రదేశ్), సెప్టెంబర్ 12: పెట్రో కెమికల్ పరిశ్రమలోని బాయిలర్ పేలడంతో ఆరుగురు కార్మికులు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నార్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు ఈ ఘటనలో మరో కార్మికుడి ఆచూకీ లభించడం లేదు.

09/13/2018 - 02:19

వాషింగ్టన్, సెప్టెంబర్ 12: భారత్, పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను నివారించేందుకు అమెరికా అవసరమైన సానుకూలమైన చర్యలు తీసుకుంటుందని అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్‌తో చర్చలు జరపాలంటే ముందుగా సరిహద్దు ఉగ్రవాదం, చొరబాట్లను ప్రోత్సహించడాన్ని పాక్ మానుకోవాలన్న భారత్ నిర్ణయానికి తమ దేశం మద్దతు ఉంటుందన్నారు.

09/12/2018 - 13:59

న్యూఢిల్లీ: చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ బలగాలు ఆగస్టు 6, 14, 15 తేదీల్లో భారత భూభాగంలోకి ప్రవేశించాయని సదరు వర్గాలు తెలిపాయి. చమోలీ జిల్లాలోని బారాహొటి ప్రాంతంలో గల వాస్తవాధీన రేఖను దాటి దాదాపు 4 కిలోమీటర్ల లోనికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు.

09/12/2018 - 13:58

జమ్మూకాశ్మీర్: జమ్ముకాశ్మీర్లో ఓ ట్రక్కులో నుంచి ఏకే-47, మూడు మ్యాగజైన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాట్రా సమీపంలో సుకేటార్‌ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ ట్రక్కులో ఏకే 47, మూడు మ్యాగజైన్లు లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ట్రక్కు డ్రైవర్‌, మరోవ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Pages